అనువాదలహరి

అహః ప్రవాహం … కేథరీన్ టఫెరీలో అమెరికను

మూడు గంటలు, ఆమె నే నెరిగిన గది
ఒక్కొక్కటీ మారుతూ తుడవడం గమనిస్తాను
మగతనిద్రలోనే కళ్ళముందు ఏవో బొమ్మలు
కదలాడుతుంటే, ఆ చీపురు చప్పుడు వింటాను.

అది ఆకుల గలలా ఉంటుంది
కాగితాల రెపరెపలా ఉంటుంది
జాచినచేతులతో చెల్లాచెదరుచేసే మంచులానూ;
మూలన కుంపటి పేట్టే నిట్టూర్పు వినిపిస్తుంది

దానితో పాటే ఆమె నిట్టూర్పూ వినిపిస్తుంది
ఆమె చేతిలోని అడక లయాన్వితంగా నడుపుతూనే.
అది నన్ను ఈ నేలమీంచి, ఈ ద్వారంలోంచి
ఆలా సముద్రం మీదకి నడుపుకుంటూ పోతోంది.
.

కేథరీన్ టఫెరీలో

జననం 1969

అమెరికను

Catherine Tufariello
Image Courtesy:
http://www.ablemuse.com/v14/featured-interview/catherine-tufariello

.

Moving Day

Three, I watch her sweep

Each changed, familiar room,

And listen as the broom

Draws shadows out of sleep,

Its song the whisper of leaves

Rustling in papery swarms,

Of snow on my sweeping arms.

Below, the furnace heaves

A sigh and so does she,

Still plying the rhythmic oar

That rows us over the floor,

Through the door, out to sea.

Catherine Tufariello

Born 1969

American

Poem Courtesy:

http://www.poemtree.com/poems/MovingDay.htm 

http://www.poemtree.com/poems/MovingDay.htm

ఆశావాది… జోషువా మెహిగన్, అమెరికను కవి

ఆ ఎక్స్ రే వివిధ పరిమాణాల్లో అనేక నక్షత్రాలను చూపిస్తోంది
కుడిపక్క తులారాశి, ఎడమప్రక్క కర్కాటకం(కేన్సర్)
మెదడు పూర్ణ మండలాన్ని చూపిస్తున్న అందులో, కొన్ని బిందువులు
విచక్షణనీ, కోరికనీ… పూర్తిగా హరించాయి.
డాక్టర్లకి ఆమె ఉల్లాసంగా ఉండడం ఎంతో నచ్చింది
ఆమె స్థితిలో ఆశను మించి మరేమీ మిగలలేదు.

ఆమె చాలా ప్రశాంతంగా ఎదురుచూసింది. ముందుగా స్పర్శ కోల్పోయింది.
తర్వాత చూపు; ఆవేశం మందగించింది. ఊపిరితిత్తులూ, గుండె వంతు చివర.
కానీ, ఆ క్రమాన్ని ప్రస్తావిస్తూ రుచి తర్వాతది అని చెప్పేరు.
అప్పుడామె అడిగింది, మీరు “నా చివరి దుస్తులు ఎంచగలరా?” అని

ఆమె తెలివితక్కువగా మాటాడటం లేదు. ఆమె దృష్టిలో
కేన్సరు జీవితం పట్ల ఉండే దృక్పథాన్ని ఎలా పునరభినయించిందంటే
మనిషి కోరికలు రాను రాను బిందుప్రమాణానికి సన్నగిలిపోతాయి
ఆ బిందువుకి అస్తిత్వం ఉంటుంది, కానీ పరిమాణం ఉండదు.
.

జోషువా మెహిగన్

Born 11 June 1969 

అమెరికను కవి 

.

.

The Optimist

The film showed stars of varying magnitude:

On the right, Libra, and on the left, Cancer,

Mapping the brain’s horizons, vanishing points

Respectively of reason and desire.

The doctors liked her cheerful attitude,

Hope being all she had in her position.

She waited, calm.  Touch burned out first, then vision.

Emotion slipped.  Last would be lungs and heart.

But, noting trends, they told her Taste was next.

She asked then, could they pick out her last dress?

She wasn’t making light.  It seemed to her

That cancer just rehearsed life’s attitude

That one’s desires must taper to a point,

Which has position, but no magnitude.

Joshua Mehigan 

Born: 11 June 1969

American Poet  

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Optimist.htm

 

%d bloggers like this: