అనువాదలహరి

కెరటాలమీద పడవ… విలియమ్ ఎలరీ చానింగ్, అమెరికను

తెల్లని మంచు పెల్లలపై
గాలి విడిచిపెట్టిన వంకర అడుగు జాడల్లా
ఎగిసి మెలితిరిగిన కెరటం
అదాటున విరగబడినచోట అలతోపాటు వంపులు తిరుగుతూ,
మన పడవ కెరటాలపై అలవోకగా సాగుతుంది.
పద! పద! నీటిపుట్టపై నిలువెత్తు త్రోవ అదిగో!

పెనుగాలి రానుంది, తెరచాపలెత్తు…
గాలినుండే మనము ఉత్సాహం దొరికించుకోవాలి
మనసు దిటవుగా ఉంటే,
ఎంత నల్లటిమేఘమైనా తలవంచుతుంది
గాలి ఊళలకి మనం భయపడేది లేదు!
.
విలియమ్ ఎలరీ చానింగ్

(November 29, 1818 – December 23, 1901)

అమెరికను

.

“Our boat to the waves”

.

Our boat to the waves go free,       

  By the bending tide, where the curled wave breaks,   

  Like the track of the wind on the white snowflakes:   

Away, away! ’T is a path o’er the sea.      

Blasts may rave,—spread the sail,            

  For our spirits can wrest the power from the wind,   

  And the gray clouds yield to the sunny mind,   

Fear not we the whirl of the gale.

.

William Ellery Channing

(November 29, 1818 – December 23, 1901)

American Transcendentalist poet

Poem courtesy: http://www.bartleby.com/360/5/291.html

ప్రకటనలు

విధేయత… ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, ఇంగ్లీషు కవయిత్రి

ఏనాడో ఇచ్చిన వాగ్దానాన్ని
నువ్వు వెనక్కి తీసుకున్నావు;
ఇచ్చిన హృదయాన్నీ వెనక్కి తీసుకున్నావు-
నేను దానికి కూడా పోనీమని ఊరుకోవాలి.
నాడు ప్రేమ ఊపిరులూదినచోట, నేడు గర్వము నశించింది;
తొలుత గొలుసు తెగిపోకుండా ఉండడానికీ, తర్వాత,
తెగిన లంకెలు కలిపి ఉంచడానికీ
నేను ఎంతో ప్రయత్నించాను గాని, ప్రయోజనం లేదు.

పూర్వంలా నీ స్నేహాన్ని పరిపూర్ణంగా
నేను పునరుద్ధరించలేక పోవచ్చు,
నీ నుండి తీసుకున్న హృదయం
ఇకనుండి ఎల్లకాలమూ నా స్వంతమే.
ఏ పశ్చాత్తాపభావనా నిన్నిక స్పృశించదు,
భయపడకు, నీ మీద నా హక్కుని కోరనులే!
అలాగని, నన్ను నేను స్వతంత్రురాలిగా
భావిస్తున్న ఊహ నీలో కలుగనియ్యను.

నేను అప్పటి ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను;
బంగారంలాంటి ఆ బంధాన్ని ఏది త్రెంచగలదు?
నే ననుభవించిన తీవ్రమైన బాధకే కాదు
నువ్వాడిన మాటలకి కూడా సాధ్యం కాదు;
ఈ రోజు నువ్వు నమ్మకాన్ని వమ్ముచేసావనీ,
ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్నావనీ,
నేను నీకు సమర్పించిన నా హృదయంలోని
గాఢమైన ప్రేమ ఇసుమంతైనా తగ్గుతుందనుకున్నావా?

అది అలాగే ఉంటుంది. అది ఏ కంటికీ కనిపించకపోవచ్చు;
కాని నా హృదంతరాల్లో నిలిచే ఉంటుంది,
ఎవరికీ కనిపించకుండా. కానీ అది నిద్రలో
కలతచెందినపుడల్లా నాకు తెలుస్తూనే ఉంటుంది.
గుర్తుంచుకో! ఈ రోజు నువ్వు పనికిరాదనీ
విలువలేనిదనుకుంటున్న ఈ స్నేహం,
నువ్వు తిరిగి అది కావాలని కోరుకునేదాకా
ఆశతో, ఓరిమితో నిరీక్షిస్తూనే ఉంటుంది.

బహుశా ఏ జీవితసంధ్యాసమయంలోనో ,
మనం చూసిన చాలామంది వృద్ధులలాగే
గతస్మృతులనీడలు నిన్ను చుట్టుముట్టినపుడు
నేటి నీ స్నేహితులు నీపట్ల ఉదాసీనం వహించినపుడు
నువ్వు స్నేహానికై  నావైపు చెయ్యి జాచవచ్చు.
ఆహ్! నువ్వు జాస్తావు. కానీ ఎప్పుడు నేను చెప్పలేను.
అప్పటిదాకా నీ కోసం ఎంతో విధేయతతో,
నా ప్రేమని పరిరక్షించుకుని నిలబెట్టుకుంటాను.
.
ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్
(30 October 1825 – 2 February 1864)
ఇంగ్లీషు కవయిత్రి

.

http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/dc/Adelaide_Anne_Procter_by_Emma_Gaggiotti_Richards.jpg/220px-Adelaide_Anne_Procter_by_Emma_Gaggiotti_Richards.jpg
Image Courtesy: http://upload.wikimedia.org

.

Fidelis

.

You have taken back the promise
That you spoke so long ago;
Taken back the heart you gave me-
I must even let it go.
Where Love once has breathed, Pride dieth,
So I struggled, but in vain,
First to keep the links together,
Then to piece the broken chain.

But it might not be-so freely
All your friendship I restore,
And the heart that I had taken
As my own forevermore.
No shade of reproach shall touch you,
Dread no more a claim from me-
But I will not have you fancy
That I count myself as free.

I am bound by the old promise;
What can break that golden chain?
Not even the words that you have spoken,
Or the sharpness of my pain:
Do you think, because you fail me
And draw back your hand today,
That from out the heart I gave you
My strong love can fade away?

It will live. No eyes may see it;
In my soul it will lie deep,
Hidden from all; but I shall feel it
Often stirring in its sleep.
So remember that the friendship
Which you now think poor and vain,
Will endure in hope and patience,
Till you ask for it again.

Perhaps in some long twilight hour,
Like those we have known of old,
When past shadows gather round you,
And your present friends grow cold,
You may stretch your hands out towards me-
Ahl You will-I know not when-
I shall nurse my love and keep it
Faithfully, for you, till then.

Adelaide Anne Procter

ప్రకటనలు

నానావర్ణ సౌందర్యం… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి

                                                                                            Trout

                                                                              Brinded Cow

                                                                                   Finch

ఇన్ని వన్నెచిన్నెలుగల ప్రకృతిని సృష్టించిన దైవానికి నుతులు.
పొడల ఆవులా జంట రంగుల్లో కనిపించే ఆకాశమూ;
విలాసంగా ఈదే చుక్కలచుక్కల జల్లచేపకి పక్కలో గులాబిరంగు మెరుపులూ;
అప్పుడేవెలిగించిన బొగ్గులా చెట్లనుండి రాలిన బాదంలూ; ఫించ్ పక్షుల బారజాచిన రెక్కలూ;
పంటపొలాలతో, చవిటినేలలతో, రకరకాలచెట్లతో కనుచూపుమేరా అలంకరించే ప్రకృతిదృశ్యాలూ
అన్ని రకాల వృత్తులూ, వాటి పరికరాలూ, పనిముట్లూ వగైరా వగైరా. ఓహ్! ఏం చెప్పను!

అందులో మళ్ళీ సహజమైనవీ, అనుకరణలూ, చిత్రమైనవీ, అరుదైనవీ,
చంచలమైనవన్నీ వింత వింత వన్నెల్లో (అవెందుకలా ఉన్నాయో ఎవరు చెప్పగలరు?)
వడియైనవీ, నెమ్మదియైనవీ, తియ్యనివీ, పుల్లనివీ, మెరిసేవీ, అస్పష్టమైనవీ ;
ఇన్నింటి సౌందర్యం మార్పుకి అతీతంగా తీర్చిదిద్దిన ప్రభువు అతను.
అతనికి జేజేలు పలకండి.
.

గెరార్డ్ మాన్లీ హాప్కిన్స్

(28 July 1844 – 8 June 1889)

ఇంగ్లీషు కవి

.

.

Pied Beauty

.

Glory be to God for dappled things

For skies of couple-colour as a brinded cow;

For rose-moles all in stipple upon trout that swim;

Fresh-fire coal chestnut-falls; finches’ wings;

Landscapes plotted and pieced—fold, fallow, and plough;

And all trades, their gear and tackle and trim.

All things counter, original, spare, strange;

Whatever is fickle, freckled (who knows how?)

With swift, slow; sweet, sour; adazzle, dim;

He fathers-forth whose beauty is past change:

Praise Him.

.

Gerard Manley Hopkins

(28 July 1844 – 8 June 1889)

English Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/PiedBeauty.htm

ప్రకటనలు

ప్రార్థన… హెన్రీ డేవిడ్ థరో, అమెరికను కవి

శక్తిసంపన్నుడవైన ప్రభూ! నన్ను నేను నిరాశపరచుకోకుండా
జీవించగలగడాన్ని మించి ఏ తుచ్ఛ సంపదలూ కోరుకోను,
నా చేతల్లో, ఇప్పుడు ఈ కంటితో స్పష్టంగా ఏ ఎత్తులైతే
చూడగలుగుతున్నానో, ఆ ఎత్తులకి ఎదగగలిగేలా ఆశీర్వదించు.
ఆ చేతల విలువ, అది నీ కటాక్షఫలితమే గనుక,
నీవు ఏ ప్రత్యేకత నాకు ప్రసాదించావో అది నా మిత్రుల
ఊహకి అందనివిషయం గనుక,వాళ్ళు దానిని ఎలా నిర్వచించినా,
విలువకట్టినా, వాళ్లని నేను నిరుత్సాహపరచినా, పరచనీ.

అశక్తమైన ఈ చెయ్యి, నా ప్రగాఢమైన నమ్మకానికి తగ్గట్టు పనిచెయ్యనీ
నా జీవితము, నా నోరు ఏది ఉచ్ఛరిస్తే దానిని ఆచరించగలగనీ
ఈ పేలవమైన రాతలు గాని
నా నీచమైన నడవడికగాని,
నీ అంతరార్థము తెలుసుకోలేకపోయానని గాని
నీ కల్పనాలీలని అతిగా ఊహించేననిగాని సూచించకుండుగాక!
.

హెన్రీ డేవిడ్ థరో
(July 12, 1817 – May 6, 1862)
అమెరికను

.

Henry David Thoreau by Benjamin D Maxham

.

Prayer

.

Great God, I ask for no meaner pelf

Than that I may not disappoint myself,

That in my action I may soar as high

As I can now discern with this clear eye.

And next in value, which thy kindness lends,

That I may greatly disappoint my friends,

Howe’er they think or hope that it may be,

They may not dream how thou’st distinguished me.

That my weak hand may equal my firm faith

And my life practice what my tongue saith

That my low conduct may not show

Nor my relenting lines

That I thy purpose did not know

Or overrated thy designs.

.

Henry David Thoreau

July 12, 1817 – May 6, 1862)

American essayist, poet, philosopher,  and transcendentalist

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/prayer-2/

ప్రకటనలు

శాంతశీలి సాలీడు… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి

ఒక చిన్నగుట్టమీద ఒంటరిగా నిశ్శబ్దంగా ఉన్న
శాంతశీలియైన ఒక సాలీడుని అది దానిపరిసరాల్లోని
ఖాళీజాగాలని ఎలా వాడుకుందికి ప్రయత్నిస్తుందో గమనించేను.
అది ముందుగా దానిపొట్టలోంచి ఒక సన్నని దారాన్ని తీసి దూకింది,
అక్కడినుండి అలసటలేకుండా దారాన్ని తీస్తూ అల్లుతూనే ఉంది…

పరీవ్యాప్తమైన, ఎల్లలులేని రోదసిచే చుట్టుముట్టబడి
నిర్లిప్తంగా నిలబడ్డ ఓ నా మనసా!
నిరంతరం ఆలోచిస్తూ, కనిపిస్తున్న గోళాలచలనాన్ని అర్థంచేసుకుందికి
సాహసంతో సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ, విడిచిపెడుతూ, చివరకి
నీకు నచ్చిన సిద్ధాంతం దొరికేక, నిరాధారమైన ఆలోచనల వంతెన
ఎలాగోలా నిలబడడానికి, అతిసన్నని హేతువుతో అల్లిన ప్రతిపాదనని
ఎక్కడైనా పట్టుదొరకకపోతుందా అన్న ఆశతో విసురుతూనే ఉంటావు, కదూ!
.
వాల్ట్ వ్హిట్మన్
May 31, 1819 – March 26, 1892
అమెరికను కవి

 

.

A Noiseless Patient Spider

.

A noiseless patient spider,

I mark’d where on a little promontory it stood isolated,

Mark’s how to explore the vacant vast surrounding,

It launch’d forth filament, filament, filament, out of itself,

Ever unreeling them, ever tirelessly speeding them.

And you O my soul where you stand,

Surrounded, detached, in measureless oceans of space,

Ceaselessly musing, venturing, throwing, seeking the spheres to connect them,

Till the bridge you will need be form’d, till the ductile anchor hold,

Till the gossamer thread you fling catch somewhere, O my soul.

Walt Whitman

May 31, 1819 – March 26, 1892

American

Poem Courtesy:

http://www.poemtree.com/poems/NoiselessPatientSpider.htm

ప్రకటనలు

స్థూలంగా చూసినపుడు … లార్డ్ టెన్నిసన్, ఇంగ్లీషు కవి

ప్రేమలో, ప్రేమ నిజంగా ప్రేమ అయి, ఆ ప్రేమ మనదైనపుడు
విశ్వాసమూ, విశ్వాసఘాతమూ సమ ఉజ్జీలు ఎన్నడూ కాలేవు;
స్థూలంగా చూసినపుడు అన్నిచోట్లా విశ్వాసఘాతం అంటే, అపనమ్మకమే.

వీణలో ఎక్కడో అతి చిన్న బీట,
క్రమక్రమంగా దానిలోని సంగీతాన్ని హరిస్తూ,
క్రమంగా వ్యాపిస్తూ వ్యాపిస్తూ,దాన్ని పూర్తిగా మూగబోయేట్టు చేస్తుంది.

అలాగే, ప్రేమిక మదివీణియలోని చిన్న బీట
లేదా ఏరినపండ్లమధ్య కనిపించని ఒక చిన్న ముల్లు,
లోలోపలే కుళ్ళిపోయి దానిచుట్టూ బూజుపేరుకునేలా చేస్తుంది

ఇక అది దాచుకుందికి పనికి రాదు; దాన్ని పారవేయవలసిందే:
కానీ అలా చెయ్యగలమా? ఏదీ, ప్రియతమా చెప్పు కాదని చెప్పు.
అయితే నన్ను పూర్తిగా నమ్ము, లేదా అసలు నమ్మకు.
.
లార్డ్ టెన్నిసన్

(6 August 1809 – 6 October 1892)

ఇంగ్లీషు కవి .

.

All in All

In Love, if Love be Love, if Love be ours,

Faith and unfaith can ne’er be equal powers:

Unfaith in aught is want of faith in all.

It is the little rift within the lute,

That by and by will make the music mute,

And ever widening slowly silence all.

The little rift within the lover’s lute,

Or little pitted speck in garner’d fruit,

That rotting inward slowly moulders all.

It is not worth the keeping: let it go:

But shall it? answer, darling, answer, no.

And trust me not at all or all in all.

.

Alfred Lord Tennyson

(6 August 1809 – 6 October 1892)

Poet Laureate of Great Britain  

Poem Courtesy: 

http://www.poemtree.com/poems/All-in-All.htm  

 

ప్రకటనలు

సత్యదర్శనము… కొవెంట్రీ పాట్ మోర్, ఇంగ్లీషు కవి

ఒక వ్యర్థ కవి, నూటికొక్కడు

తనపరిసరాల్ని పరికిస్తాడు, కానీ, తక్కినపుడు

అతని అవగాహనకి అందనంత సౌందర్యవంతంగా ఉండే సృష్టి,

అతనికి కుకవి హాస్యం కంటే పేలవంగా కనిపిస్తుంది.

ప్రేమ ప్రతి వ్యక్తినీ జీవితంలో ఒక్కసారి మేల్కొలుపుతుంది;

మనిషి తన బరువైన కనులెత్తి, పరికిస్తాడు;

ఆహ్! ఒక సౌందర్యవంతమైన పేజీ బోధించలేనిదేమున్నది!

దాన్ని ఆనందంతో చదువుతారు, మళ్ళీ పుస్తకం మూసేస్తారు.

కొన్ని కృతజ్ఞతలూ, కొన్ని దూషణలూ గడచిన తర్వాత,

చాలమంది అన్నీ మరిచిపోతారు, కానీ, ఎలా చూసినా,

గుర్తుపెట్టుకోలేని చిన్నపిల్లవాడి కలలా, అది

వాళ్లజీవితంలో మధురమైన ఒకే ఒక సందర్భంగా మిగిలిపోతుంది.

.

కొవెంట్రీ పాట్ మోర్

(23 July 1823 – 26 November 1896)

ఇంగ్లీషు కవి.

.

The Revelation

.

An idle poet, here and there,

Looks round him, but, for all the rest,

The world, unfathomably fair,

Is duller than a witling’s jest.

Love wakes men, once a lifetime each;

They lift their heavy lids, and look;

And, lo, what one sweet page can teach,

They read with joy, then shut the book.

And give some thanks, and some blaspheme,

And most forget, but, either way,

That and the child’s unheeded dream

Is all the light of all their day.

.

Coventry Patmore

(23 July 1823 – 26 November 1896)

English Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Revelation.htm

 

ప్రకటనలు

ప్రకృతి… HW లాంగ్ ఫెలో, అమెరికను కవి

నిద్రపుచ్చడానికి … సగం ఇష్టంగా, సగం అయిష్టంగా

నేలమీద తను ఆడుకుంటూన్న వస్తువులనన్నీ నేలమీదే వదిలేసి,

అయినా తెరిచిఉన్న తలుపులోంచి వాటిని చూస్తూ,

పూర్తిగా ఊరడింపూలేక, వాటికి బదులు ఇస్తానన్నవి

అంతకంటే మంచివైనా సంతోషం కలిగిస్తాయన్న హామీ లేక,

బాధపడే చిన్న పిల్లాడిని ఆ రోజుకి ఆటముగిసేక ప్రేమగా

లాలిస్తూ చెయ్యిపట్టుకుని లాక్కువెళ్ళే పిచ్చితల్లిలా

ప్రకృతికూడా మనతో సంచరిస్తుంది, మన ఆటవస్తువుల్ని

ఒక్కటొక్కటిగా లాక్కుంటూ, మనల్ని చెయ్యిపట్టుకుని

మన విశ్రాంతి స్థలానికి నెమ్మదిగా నడిపించి తీసుకుపోతుంది

కళ్ళమొయ్యా నిద్ర ముంచుకు వస్తుండటంతో మనకి

వెళ్ళడానికి ఇష్టమో, అయిష్టమో అర్థంకాకుండానే అనుసరిస్తాము.

మనకి తెలిసినదానికంటే తెలియనిది ఎంత ఎక్కువో కదా!

.

HW లాంగ్ ఫెలో

(February 27, 1807 – March 24, 1882)

అమెరికను కవి

.

.

Nature

As a fond mother, when the day is o’er,

Leads by the hand her little child to bed,

Half willing, half reluctant to be led,

And leave his broken playthings on the floor,

Still gazing at them through the open door,

Nor wholly reassured and comforted

By promises of others in their stead,

Which, though more splendid, may not please him more;

So nature deals with us, and takes away

Our playthings one by one, and by the hand

Leads us to rest so gently, that we go

Scarce knowing if we wish to go or stay,

Being too full of sleep to understand

How far the unknown transcends the what we know.

.

Henry Wadsworth Longfellow

(February 27, 1807 – March 24, 1882)

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Nature.htm

ప్రకటనలు

నూత్న మహావిగ్రహం… ఎమ్మా లాజరస్, అమెరికను కవయిత్రి

అద్భుతమైన ఈ కవిత అమెరికా దేశపు నాయకత్వం 20 వశతాబ్దం మొదలు వరకూ పాటించిన ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. చిత్రంగా అదే దేశపు నేటి నాయకుల ఆకాంక్షలూ, అభిప్రాయాలూ దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో సాగుతున్నాయి. ఫ్రెంచి ప్రజల సౌహార్ద్ర సూచకంగా అమెరికనులకు బహూకరించబడిన ఈ రాగితో చేసిన విగ్రహాన్ని గుస్తావ్ ఈఫెల్ నిర్మించగా, అక్టోబరు 28, 1886 న జాతికి అంకితం చెయ్యబడింది.  కవయిత్రి మరణించిన 15 సంవత్సరాలకు, 2003 లో Statue of Liberty పదపీఠాన  ఈ కవిత కంచుఫలకంపై చెక్కి ఉంచబడింది. 

*

నిస్సిగ్గుగా నిలుచునే ప్రఖ్యాతివహించిన గ్రీకు విగ్రహంలా కాకుండా,

అన్ని నేలల స్వేచ్చకి సంకేతంగా శృంఖలాలు తెంచుకుని కాళ్ళు ఎడం చేసి

ఇక్కడ, పడమటిదిక్కున సముద్రకెరటాలు జీరాడే “స్వేచ్ఛా ద్వీపంలో”

ఒక మహత్తరమైన స్త్రీమూర్తి నిలుచుని ఉంటుంది చేతిలో దివిటీతో

దాని వెలుగులు శాశ్వతమైన ఊరటకి ప్రతీకలు, ఆమె పేరు

“దేశబహిష్కృతులకు కన్నతల్లి”. కారణం, కాగడా పట్టిన ఆ చేతివెలుగులు

ప్రపంచం నలుమూలలకీ ఆహ్వానాన్ని ప్రసరిస్తాయి; ఈ జంటనగరాలను

అనుసంధానంచేసే ఆ నౌకాశ్రయంలో గాలిని సైతం ఆమె సౌజన్య నేత్రాలు శాసిస్తాయి.

“ఓ ప్రాక్తన దేశాల్లారా! సమాధిగతమైన మీకీర్తిప్రతిష్ఠలను అక్కడే దాచుకొండి!”

అంటూ మౌనంగా హెచ్చరిస్తుంది. ” మీ దేశానికి చెందిన నిరుపేదలనీ, అలసి సొలసినవారినీ,

స్వేఛ్ఛావాయువులు పీల్చుకోడానికి తహతహలాడే లెక్కలేని జనులందరినీ,

మీ దేశతీరాలలో పనికిమాలి వృధాగా పడివున్నవారినందరినీ

గూడులేని, కష్టాలతుఫానులకు గురైన వారందరినీ నా దగ్గరకు పంపించండి.

వాళ్ళందరికీ, ఈ బంగారు వాకిలి తలుపు తెరిచి దీపకళికతో స్వాగతిస్తాను.

.

ఎమ్మా లాజరస్

(July 22, 1849 – November 19, 1887)

అమెరికను కవయిత్రి

.

[This poem is inscribed on the base of the Statue of Liberty.]

The New Colossus

Not like the brazen giant of Greek fame,

With conquering limbs astride from land to land;

Here at our sea-washed, sunset gates shall stand

A mighty woman with a torch, whose flame

Is the imprisoned lightning, and her name

Mother of Exiles.  From her beacon-hand

Glows world-wide welcome; her mild eyes command

The air-bridged harbor that twin cities frame.

“Keep, ancient lands, your storied pomp!” cries she

With silent lips.  “Give me your tired, your poor,

Your huddled masses yearning to breathe free,

The wretched refuse of your teeming shore.

Send these, the homeless, tempest-tost to me,

I lift my lamp beside the golden door!”

Emma Lazarus

(July 22, 1849 – November 19, 1887)

American Poet and Geologist

Poem Courtesy:

http://www.poemtree.com/poems/NewColossus.htm

ప్రకటనలు

ఈ సజీవ హస్తం… జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి

ఇది చాలా చిత్రమైన కవిత. నిజానికి ఇది అసంపూర్ణ కవిత. కీట్స్ దీనిని తన అసంపూర్ణ కవితల రాతప్రతులలో రాసుకున్నాడు. ఈ కవిత కాలం సుమారుగా అక్టోబరు 1819. నిజానికి 18 అక్టోబరు 1819 న కీట్స్ కీ అతని ప్రేయసి ఫానీ బ్రౌన్ కీ నిశ్చితార్థం జరిగింది. వారిద్దరు వివాహం చేసుకునే అదృష్టానికి నోచుకోలేదు. అప్పటికే అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు.  కీట్స్ కి తను ఎక్కువకాలం బ్రతకనని అప్పటికే తెలుసు. భయపడినట్టుగానే, రెండేళ్ళలో కీట్స్ చనిపోతాడు. అతనిమీద ఉన్న ప్రేమకొద్దీ ఆమె కీట్స్ చనిపోయిన 12 సంవత్సరాలవరకూ వివాహం చేసుకోలేదు.

ఈ కవిత అర్థాంతరంగా ముగుస్తుంది. బహుశా ఆమెకు అతని మరణం వేదన మిగిల్చినపుడు ఉపశాంతినివ్వడానికి తన కవిత పనికొస్తుందని చెప్పదలుచుకున్నాడేమో! (?)

*

ఇప్పుడు వెచ్చగా, సజీవంగా దేన్నైనా

సుళువుగా పట్టుకోగలిగిన ఈ చెయ్యి, రేపు, చల్లబడిపోయి

సమాధిలోని నిశ్శబ్ద ఏకాంతతకు గురయితే,

నీ పగళ్ళూ, కలలుగనే రాత్రులూ వెంటాడుతూంటే,

నా శరీరంలో తిరిగి జీవం ప్రవహించడానికీ,

“అరే, నేను చనిపోయినా బాగుండేది,” అని అనిపించవచ్చు

నీ మనసుకి ప్రశాంతత నివ్వడానికి; ఇదిగో చూడు

ఇది నీ కోసమే, నీకోసమే దీన్ని పట్టుకుంది.

.

జాన్ కీట్స్

31 October 1795 – 23 February 1821

ఇంగ్లీషు కవి.

Image Courtesy: http://upload.wikimedia.org

.

This Living Hand

This living hand, now warm and capable

Of earnest grasping, would, if it were cold

And in the icy silence of the tomb,

So haunt thy days and chill thy dreaming nights

That thou wouldst wish thine own heart dry of blood

So in my veins red life might stream again,

And thou be conscience-calmed—see here it is—

I hold it towards you.

.

John Keats

31 October 1795 – 23 February 1821

English Poet

Poem courtesy:

http://www.poemtree.com/poems/ThisLivingHand.htm 

ప్రకటనలు
%d bloggers like this: