అనువాదలహరి

మా ముసుగు … పాల్ లారెన్స్ డన్ బార్, అమెరికను కవి

మేము ధరించే ముసుగు  నవ్వుతూ అబద్ధాలు చెబుతుంది 

మా చెక్కిళ్ళు దాచిపెట్టి కళ్ళకి రంగులద్దుతుంది,…

మనుషుల కుతంత్రాలకు మేము చెల్లించే ప్రతిఫలమిది;

పగిలి రక్తమోడుతున్న గుండెలతో నవ్వుతాం,

కొన్ని లక్షల తియ్యని పలుకులు నేర్పుగా పలుకుతాం.

మా కన్నీళ్ళనీ, నిట్టూర్పులనీ అంచనా వెయ్యడానికి

ప్రపంచం ఎందుకు అతితెలివి ప్రదర్శించాలి?

అంతే! వాళ్ళని మమ్మల్ని చూస్తూ ఉండనీయండి,

మేము మాత్రం ముసుగేసుకునే ఉంటాం.

ఓ క్రీస్తు ప్రభూ! మేము చిరునవ్వులు నవ్వినా, నినుచేరే

మా ఆక్రందనలు వచ్చేది వ్యధార్తహృదయాలనుండే!

మేము నిన్ను స్తుతించినా, మా కాలిక్రింద నేల

కరిగిపోతూనే ఉంటుంది; గమ్యమెంతకీ చేరరాదు;

ప్రపంచం ఎలా అనుకుంటే అలా అనుకోనీ,

మేము మాత్రం ముసుగు ధరించే ఉంటాం!

.

పాల్ లారెన్స్ డన్ బార్

(June 27, 1872 – February 9, 1906)

అమెరికను కవి .

.

We Wear the Mask

.

We wear the mask that grins and lies,

It hides our cheeks and shades our eyes,–

This debt we pay to human guile;

With torn and bleeding hearts we smile,

And mouth with myriad subtleties.

Why should the world be overwise,

In counting all our tears and sighs?

Nay, let them only see us, while

We wear the mask.

We smile, but, O great Christ, our cries

To thee from tortured souls arise.

We sing, but oh the clay is vile

Beneath our feet, and long the mile;

But let the world dream otherwise,

We wear the mask!

.

Paul Laurence Dunbar

(June 27, 1872 – February 9, 1906)

American Poet, Novelist and Playwright

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/paul_laurence_dunbar/poems/14864

కీర్తికాంత … జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి

 కాలు నిలవని పిల్లలాంటి కీర్తికాంత, ఆమెకు పాదాక్రాంతులై

సేవచేసేవారిని చూస్తే, ఇంకా సిగ్గునభినయిస్తూనే ఉంటుంది.

కానీ మనసులో నిశ్చింతగా ఉండే వెర్రివాడు ఎవడైనా ఉంటే

దాసోహమంటూ అతని వెంటే ఎక్కువగా తిరుగుతుంటుంది;

ఆమె ఒక సంచారిణి; ఆమె పక్కనలేకపోయినా

తృప్తిగా ఉండడం అలవాటులేనివారిని ఆమె పలకరించదు;

ఆమె ఒక మోసకత్తె…ఆమె చెవిలో ఎవరూ గుసగుసలాడరు,

ఆమె గూర్చిమాటాడేవారు అభాండాలు వేస్తున్నారని అనుకుంటుంది;

ఆమె అచ్చంగా సంచారిణే… నైలు నదీ తీరాన పుట్టింది

అసూయాపరురాలైన పోటిఫార్* భార్యకి సాక్షాత్తూ అప్పచెల్లెలే.

ఆమె ప్రేమకై తపించే కళాకారులారా! మీరు నిజంగా పిచ్చి వారు!

ఎంత గౌరవంగా వంగి నమస్కరించగలరో నమస్కరించి శలవుతీసుకొండి.

అప్పుడు, ఆమెకి నచ్చితే, మిమ్మల్ని అనుసరించి వస్తుంది.

.

జాన్ కీట్స్

31 October 1795 – 23 February 1821

ఇంగ్లీషు కవి

(Notes:

పోటిఫార్ (Potiphar): Chapter 39 of  Genesis tells the story of Potiphar, an official of the Pharoh of Egypt,  whose wife flirts  incessantly with Joseph who serves there. Once when  Joseph leaves his garments behind to evade her advances, she shows the garments as evidence to claim Joseph had thrown himself upon her and gets him imprisoned.)

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

.

On Fame, I

Fame, like a wayward girl, will still be coy   

  To those who woo her with too slavish knees,      

But makes surrender to some thoughtless boy,       

  And dotes the more upon a heart at ease;    

She is a Gipsy,—will not speak to those       

  Who have not learnt to be content without her;     

A Jilt, whose ear was never whisper’d close,

  Who thinks they scandal her who talk about her;  

A very Gipsy is she, Nilus-born,        

  Sister-in-law to jealous Potiphar;      

Ye love-sick Bards! repay her scorn for scorn;       

  Ye Artists lovelorn! madmen that ye are!   

Make your best bow to her and bid adieu,    

Then, if she likes it, she will follow you.

.

John Keats

(31 October 1795 – 23 February 1821)

English Poet

The Book of Georgian Verse.  1909.

 Ed: William Stanley Braithwaite.

http://www.bartleby.com/333/690.html

 

%d bloggers like this: