అనువాదలహరి

కర్తవ్యం… సారా టీజ్డేల్, అమెరికను కయిత్రి

వెర్రివాడా! పనికిమాలిన చేతులతో
గాలిని చెదరగొట్టడానికి ప్రయత్నించకు—
జరగవలసిన పొరపాటు జరిగిపోయింది; బీజం పడింది.
చేసిన నేరం స్థిరమైపోయింది.

ఇప్పుడు నీ కర్తవ్యం
చేసిన పొరపాట్ల వలలోనుండి
చేసిన దుష్కార్యాల అల్లికలోనుండి
ఒక రాగాన్ని సృష్టించగలవేమో చూడడం.
.

సారా టీజ్డేల్

(August 8, 1884 – January 29, 1933)

అమెరికను కవయిత్రి

.

Duty

Fool, do not beat the air

With miserable hands—

The wrong is done, the seed is sown,

The evil stands.

Your duty is to draw

Out of the web of wrong,

Out of ill-woven deeds,

A thread of song.

Sara Teasdale

(August 8, 1884 – January 29, 1933)

American

Poem Courtesy: http://www.poemtree.com/poems/Duty.htm

ప్రకటనలు

నవంబరు నెల… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి

ఎక్కడ గులాబి ఉందో అక్కడ పిల్లతెమ్మెర ఉంది
ఎక్కడ చక్కని గడ్ది ఉందో అక్కడ మంచుసోన ఉంది
ఇక దొంతరదొంతరలుగా మేఘమాలికలు
అంతుదొరకని వినీల విహాయస వీధుల్లో
“లార్క్” తోపాటు విహరిస్తూనే ఉన్నాయి.

చెయ్యి ఎక్కడ ఉందో అక్కడ వేడి లేదు
జుత్తు ఎక్కడ ఉందో అక్కడ పసిడివెలుగు లేదు
ఏకాకిగా, దెయ్యంలా
ముళ్ళపొదలక్రింద
ప్రతి ముఖం ప్రేతకళ సంతరించుకుని ఉంది

ఎక్కడ మాటవినవస్తోందో, అక్కడ చలిగాలి వీస్తోంది
నాగుండె ఎక్కడ ఉందో అక్కడ కన్నీరే కన్నీరు
ఇక నా విషయానికి వస్తే
ఏమి చెప్పమంటావు బిడ్డా!ఎప్పటిలాగే
ఎక్కడ ఆశ అల్లుకుందో అక్కడ నిశ్శబ్దం తాండవిస్తోంది.
.

వాల్టర్ డి లా మేర్

25 April 1873 – 22 June 1956

ఇంగ్లీషు కవి.

.

November

There is wind where the rose was,

Cold rain where sweet grass was,

And clouds like sheep

Stream o’er the steep

Grey skies where the lark was.

Nought warm where your hand was,

Nought gold where your hair was,

But phantom, forlorn,

Beneath the thorn,

Your ghost where your face was.

Cold wind where your voice was,

Tears, tears where my heart was,

And ever with me,

Child, ever with me,

Silence where hope was.

.

Walter de la Mare

25 April 1873 – 22 June 1956 

English Poet 

Poem Courtesy:

http://www.poemtree.com/poems/November.htm

%d bloggers like this: