అనువాదలహరి

మనలో మన మాట… కెరొలీన్ రఫేల్, అమెరికను కవయిత్రి

ఎవరన్నారు ఈ పిల్లల్ని ఎగిరిపోనివ్వాలని?
ఈ పిల్లలు మన పేగుతో ముడిపడినవాళ్ళు
వాళ్లకి మన అవసరం ఉంటుంది, చివరకి ఎగిరిపోనివ్వడమేనా?
(నేను ఈ మాటలు అనవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు)

ఋతువులన్నీ సంగీతంలోని స్వరాల్లా
క్రమంతప్పకుండా వచ్చిపోయే
ఈ ఇంటి చెట్టుకి దగ్గరలోనే …
ఏ కొమ్మమీదో గూడుకట్టుకుంటే, ఏమిటిట నష్టం?

ఈ-ఉత్తరాలనీ, పుట్టినరోజు కార్డులనీ, ఫోన్లనీ
ఎప్పుడూ మనం రొట్టె తునకలే ఎందుకు ఏరుకోవాలి?
తక్కినవాళ్లందరూ వాళ్ళపిల్లలతో హాయిగా ఉంటే
మనమెందుకు ఇట్టే గడిచిపోయే శలవులతో సర్దుకుపోవాలి?

సాహసం చెయ్యాలని మనమే నూరిపోసామనుకో;
అయినా, ఎవరనుకున్నాడు వాళ్లంత స్వేచ్ఛగా ఎగిరిపోతారని?

.

కెరొలీన్ రఫేల్

అమెరికను కవయిత్రి .

Photo Courtesy:

http://carolynraphaelpoetry.com/

Between You and Me

 .

Who says we have to let them fly,

these children who were bound by cords

of flesh, then need, then, finally, sky?

(I never thought I’d say these words.)

What’s wrong with nesting close to home

in branches of the family tree,

where seasons, like a metronome,

count days of continuity?

Why must we always savor crumbs—

the emails, birthday cards, and calls,

the hurried holiday that numbs—

while others celebrate their smiles?

Of course we championed bravery;

who ever thought they’d fly so free?

 .

Carolyn Raphael

American

6 Longview Place

Great Neck, NY 11021

craphael429@gmail.com

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Between-You-and-Me.htm

 

మరణించిన కవి… టిమొతీ మర్ఫీ , అమెరికను కవి

ఎలాగైతేనేం చివరకి, అతని జీర్ణకుటీరం నుండి
త్రోవ తిన్నగా స్వర్గానికి పోతుంది
గడియపెట్టబడిన స్వర్గపు
పెరటిద్వారం దగ్గర దేవతలు
కొన్ని వేలమంది అర్హత పరీక్షిస్తూ
అదేమిటో, కొందరిని అల్పమైన కవితకే
స్వర్గంలోకి అనుమతిస్తారు.
.

టిమొతీ మర్ఫీ
జననం 1951
అమెరికను .

.

The Dead Poet

At last the path runs straight

from his hovel to the skies

and the bolted postern gate

of the Western Paradise

where seven times seven

Immortals judge a throng,

admitting some to heaven

for the pittance of a song.

Timothy Murphy

 Born: 1951

American

Poem Courtesy:

http://www.poemtree.com/poems/DeadPoet.htm

తక్కినవాళ్ళు… డేవిడ్ బెర్మన్… అమెరికను కవి

కొందరికి సాహిత్యంలో జీవిత లక్ష్యం దొరుకుతుంది
కొందరికి లలిత కళలలో,
ఎవరికి వారికి అది మనసులోనే దొరుకుతుందన్న
నమ్మికకి కొందరు అంకితమౌతారు.

కొందరికి మదిరలో ఆనందం దొరుకుతుంది
కొందరికి మగువలో
కొందరికి జీవితంలో వెలుగెన్నడూ దొరకదు
వాళ్ళు చీకటితోనే సర్దుకుపోతారు.

మనం వాళ్ళగురించి ఆలోచిస్తున్నప్పుడు
వాళ్ళెప్పుడూ దుఃఖంలో మునిగి ఉన్నట్టు ఊహించుకోవచ్చు;
కానీ, అది నిజం కాదు; వాళ్ళకి కనిపించని ఆ వెలుగు
వాళ్ళెన్నడూ కోరుకున్నది కాదు.
.

డేవిడ్ బెర్మన్

జననం 4 జనవరి 1967

సమకాలీన అమెరికను కవి .

.

And the Others

.

Some find The Light in literature;

Others in fine art,

And some persist in being sure

The Light shines in the heart.

Some find The Light in alcohol;

Some, in the sexual spark;

Some never find The Light at all

And make do with the dark,

And one might guess that these would be

A gloomy lot indeed,

But, no, The Light they never see

They think they do not need.

David Berman

(Born 4 January 1967)

Contemporary American poet, cartoonist, and singer-songwriter best known for his work with indie-rock band the Silver Jews.

http://www.poemtree.com/poems/And-the-Others.htm

%d bloggers like this: