అనువాదలహరి

ఏరోన్ స్టార్క్… E.A. రాబిన్సన్, అమెరికను

పైగా, ఏరోన్ స్టార్క్ చాలా బక్కపలచని మనిషి, శాపగ్రస్తుడు;
మురికిగా, శుష్కించి, ఎప్పుడూ ఏదోపోయినట్టు, తగువులాడుతూ ఉంటాడు.
అతనొక పిసినారి, తగ్గట్టే ముక్కుకూడా ఉందా లేదా అన్నట్టు ఉంటుంది,
అతని కళ్ళు చీకట్లో చిరునాణేల్లా ఉంటాయి.
అతని గీతగీసినట్టున్న నోరు అక్కడొక ఆనవాలులా ఉంటుంది;
అతను మాటాడినపుడు నోటంట వచ్చే ఆ రెండుమూడు శబ్దాలూ
ఎడమైనకోరలమధ్యనుండి కోపంతో వచ్చే బుసలా ఉండి,
కుక్క దాని అరుపుకే భయపడి జాగ్రత్తపడినట్టు ఆగిపోతాయి.

అతనికున్న చెడ్డపేరుకి సంతోషిస్తూనే
ప్రేమచేబహిష్కృతుడైన అతడు కర్రపట్టుకుని
ఊరంతా విచ్చలవిడిగా తిరుగుతుంటాడు;
అప్పుడప్పుడు అతని చెవుల్లోకి ఎక్కడో దూరాన్నుండి
జొరబడిన అజ్ఞాత కరుణార్ద్రమైన మాటలు మనసుతాకి,
కళ్ళు చెమర్చినపుడు, అప్పుడే, ఏరోన్ ఒక చిరునవ్వు నవ్వుతుంటాడు.
.

E. A. రాబిన్సన్

(December 22, 1869 – April 6, 1935)

అమెరికను

.

 

.

Aaron Stark

Withal a meagre man was Aaron Stark,

Cursed and unkempt, shrewd, shrivelled, and morose.

A miser was he, with a miser’s nose,

And eyes like little dollars in the dark.

His thin, pinched mouth was nothing but a mark;

And when he spoke there came like sullen blows

Through scattered fangs a few snarled words and close,

As if a cur were chary of its bark.

Glad for the murmur of his hard renown,

Year after year he shambled through the town,

A loveless exile moving with a staff;

And oftentimes there crept into his ears

A sound of alien pity, touched with tears,—

And then (and only then) did Aaron laugh.

E.A. Robinson

(December 22, 1869 – April 6, 1935)

American

(Winner of 3 Pulitzer Prizes and nominated for Nobel 4 times)

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Aaron-Stark.htm

 

 

 

నీలిదుస్తుల విద్యార్థినులు … జాన్ క్రో రాన్ సమ్, అమెరికను

మీ నీలి గౌన్లను గిరగిర తిప్పుకుంటూ, మీ బడిని
ఆనుకున్న పచ్చనిపొలాలలో నడుచుకుంటూ
మీ గురువృద్ధులు చెప్పింది వినండి పిల్లలూ; కానీ,
అందులో ఒక్కముక్కకూడా నమ్మకండి.

మీ తలకట్టు చుట్టూ తెల్లని కేశబంధాల్ని తగిలించి,
గడ్డిమీద ఎగురుకుంటూ ఉబుసుపోకమాటలు
చెప్పుకునే నీలి నీలి పిట్టల్లా
ఇక జరగబోయేదానికి ఆలోచించడం మానెయ్యండి.

ఇదిగో నీలి దుస్తుల అమ్మాయిలూ, అంతరించకమునుపే
మీ చక్కదనాన్ని సాధనచెయ్యండి. నేను పెద్ద గొంతుకతో
నలుగురికీ ప్రకటిస్తాను:దాన్ని మన అధీనంలోని సమస్త శక్తులూ
నిర్ణయించలేవని. చక్కదనం మహా దుర్బలమైనది.

ఎందుకంటే, మీకు నేనొక జరిగిన కథ చెప్తాను:
నాకు బాగా పెద్దగొంతుకపెట్టుకుని అరిచే స్త్రీ గురించి తెలుసు,
కళ్ళంట నీళ్ళతో ఆమె ఆకాశంనుండి క్రిందకి పడేది. 
అతితక్కువసమయంలోనే ఆమె చక్కదనాలన్నీ కనుమరుగయేవి…
అయితేనేం, ఆమె మీలో ఎవరికన్నాకూడా చూడచక్కనిది.
.

జాన్ క్రో రాన్ సమ్
(April 30, 1888 – July 3, 1974)
అమెరికను విమర్శకుడు, మేధావి.

Blue Girls

Twirling your blue skirts, travelling the sward

Under the towers of your seminary,

Go listen to your teachers old and contrary

Without believing a word.

Tie the white fillets then about your hair

And think no more of what will come to pass

Than bluebirds that go walking on the grass

And chattering on the air.

Practise your beauty, blue girls, before it fail;

And I will cry with my loud lips and publish

Beauty which all our powers shall never establish,

It is so frail.

For I could tell you a story which is true;

I know a lady with a terrible tongue,

Blear eyes fallen from blue,

All her perfections tarnished—yet it is not long

Since she was lovelier than any of you.

.

John Crowe Ransom

(April 30, 1888 – July 3, 1974)

American  Educator, scholar and Critic

 

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Blue-Girls.htm

 

%d bloggers like this: