Tag: 18th century
-
కుర్రతనమే గాని సహజమే… కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి
(ఈ కవిత చదివేక నాకు “ప్రణయలేఖలు” అన్న ఖండికలో పింగళి కాటూరి కవుల పద్యం: “ఎగిరి నీ పాదములచెంత కెట్లొ వచ్చి వ్రాలుదునొయన్న ఉత్సుకత్వమ్ము గలదు; సాధ్య సాధనమైన పక్షముల జంట హృదయమునకుండి లేదు శరీరమునకు” గుర్తుకు వచ్చింది ) *** నాకే గాని రెండు చిన్న రెక్కలుంటే నేనే గాని ఒక చిన్న పక్షినయి ఉంటే ప్రియతమా! నేను నీ దగ్గరకి ఎగిరివచ్చేవాడిని! కానీ ఇలాంటి ఆలోచనలన్నీ ఊసుపోకకి. నేను ఇక్కడ ఉన్నచోటే ఉన్నాను .…
-
యోధులు ఎలా మరణిస్తారు?… విలియం కాలిన్స్, ఇంగ్లీషు కవి
తమ దేశప్రజల ఆశీస్సులు పొందిన యోధులు ఎలా శాశ్వత విశ్రాంతి తీసుకుంటారు? వారి అపురూపమైన సమాధులని చల్లని మంచు వేళ్ళతో అలంకరించడానికి హేమంతం పునరాగమించినపుడు ఊహలు నడయాడిన ఏ మట్టికన్నా భిన్నంగా గొప్ప విలువైన మిత్తికతో అలంకరిస్తుంది. వారి తుది ఘంటికలని దివ్య హస్తాలు మోగిస్తాయి విషాదగీతికలని అగోచర ఆకారాలు ఆలపిస్తాయి; వాళ్ళ శరీరాలను అక్కునజేర్చుకున్న నేల ననుగ్రహించడానికి యశస్సు, ఒక అలసిన బాటసారిలా విచ్చేస్తుంది. అక్కడ, శోకిస్తున్న మునిలా నివసించడానికి స్వాతంత్ర్యం కాసేపు సేదదీరుతుంది. .…
-
పనికొచ్చే సూచన … ఏరోన్ హిల్, ఇంగ్లీషు కవి
సుతిమెత్తగా ఆ ఆకుని ఒత్తి చూడు, అది నీకు దురదపెట్టి బాధిస్తుంది; అదే సాహసంతో దాన్ని తెంపిచూడు అది పట్టులా చేతిలో ఒదుగుతుంది. మనుషుల స్వభావంతోనూ అంతే, వాళ్ళని దయగా చూడు, తిరగబడతారు; అదే జాజికాయ కోరాల్లా కరుకుగా ఉండు, ఆ ధూర్తులే, అణిగిమణిగి ఉంటారు. . ఏరోన్ హిల్ (10 February 1685 – 8 February 1750) ఇంగ్లీషు నాటక కర్తా, కవి. . A Useful Hint . Tender-Handed stroke…
-
పెళ్ళి ఉంగరం … జార్జ్ క్రాబ్, ఇంగ్లీషు కవి
నువ్వు చూస్తుండగా తొడుగుతున్న ఈ ఉంగరం పల్చగా, కళతగ్గినట్టున్నా బంగారందే; జీవితంలోని ఆటుపోట్లకి ప్రేమ తరిగినట్టనిపించొచ్చు అయినా, ప్రేమ ప్రేమే అని ఇది ఋజువుచేస్తుంది. . జార్జ్ క్రాబ్ 24 December 1754 – 3 February 1832 ఇంగ్లీషు కవి . George Crabbe . A Marriage Ring . The ring, so worn as you behold, So thin, so pale, is yet of gold: The…
-
కడలి దృశ్యం (సానెట్ 83) … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి
కొండల మీద సంచరించే ఆ గొర్రెల కాపరి మేను వాల్చేడు కొండశిఖరం వరకూ పరుచుకున్న మెత్తని గడ్డిమీద, క్షితిజరేఖవద్ద ఆకాశంతో కలుస్తున్న కడలి అంచును చూస్తున్నాడో, లేక, తన వియద్దృష్టిపరిధికి బాగా దిగువన, పడమటి జలాల్లో నిప్పులు చెరుగుతూ వాలుతున్న వేసవి సూర్యుణ్ణి చూసునాడో; ఆ విశాల దృశ్యం, అద్భుతంగా, పరమ శాంతంగా, నలుదిక్కులా వ్యాపిస్తోంది, ఆ గ్రామీణుడి గుండెమీదకూడా ఒక ప్రసన్న హర్షం కానీ, దూరంగా, సముద్రజలాలపై, నల్లని మచ్చల్లా మృత్యువునద్ది రాక్షసులు కురిపిస్తున్న రోగ…
-
ఫిర్యాదు… మార్క్ అకెన్ సైడ్, ఇంగ్లీషు కవి
దూరం! దూరం! మోసకారీ, ప్రేమా! నన్నిక మభ్యపెట్టకు: నీ మెత్తని మాటల ప్రభావానికి నా అమాయకపు యువహృదయం బలైంది, చివరికి ఎలాగైతేనేం నీ కుట్ర బహిర్గతమైంది కడకి ఖరీదైన అనుభవంతో జాగ్రత్త తెలిసొచ్చింది. దూరం! ఈ వయసులో నన్ను లొంగదీస్తాననుకోకు నాకు తెలుసు, ఆమె గొప్పదనాన్ని గ్రహించగలను. ఇప్పుడు ఇంకా చూపించాలా? ఆమె గురించి? నాకు? నాకు నాకే తెలియకుండా ఆ యువతి సొగసునీ, నమ్రతనీ, సుగుణాలనీ ప్రశంసించలేదు! ఎన్నిసార్లు అనలేదు ఆమె హృదయాన్ని తనదిగా చెప్పుగలగడం…
-
కోయిలా- మిణుగురూ… విలియం కౌపర్, ఇంగ్లీషు కవి.
పగలల్లా ఆ పల్లెని తనపాటతో మురిపించిన ఒక కోయిల ఇంకా పూర్తిగా చీకటి పడనే లేదు తన పాట ఆపడం ఇంకా పూర్తవనే లేదు, అప్పుడే, దాని శ్రమకి తగ్గట్టుగా కడుపులో ఆకలి వెయ్యడం మొదలైంది. ఆశగా నాలుగుపక్కలా పరికించి చూస్తే దూరంగా, నేలమీద ఏదో కనిపించింది చీకటిలో మిణుకుమిణుకు మెరుస్తూ, దాని వెలుగును బట్టి పోల్చుకుంది మిణుగురని; మామిడి కొమ్మ మీంచి క్రిందకి వాలింది, దాన్ని పొట్టలో వేసుకుందామే తరవాయి. కోయిల ఉద్దేశ్యాన్ని గ్రహించిన…
-
పరోక్షము… రిఛర్డ్ జాగో, ఇంగ్లీషు కవి
డేలియా దూరంగా ఉన్నప్పుడు, గుదిబండ తగిలించినట్టు కాళ్ళీడ్చింది కాలం; ఆమె వెంట ఉన్నప్పుడు పాటలోనూ వేదనలేదు ఏ రోజూ విసుగు కలగలేదు. ఓ అసూయాగ్రస్త కాలమా! నీ విధి తిరగరాయి; నీ నడకని మరింత నెమ్మది చెయ్యి, ఎంత కష్టపడాలో పడు, ఎంత దోచుకుంటావో దోచుకో ఆమె పక్కన ఉన్నప్పుడు క్షణాలనన్నిటినీ. . రిఛర్డ్ జాగో (1 October 1715 – 8 May 1781) ఇంగ్లీషు కవి. . . Absence . With leaden…
-
ఒక నక్క మీ పెంపుడు కోళ్ళు ఎత్తుకు పోతుంది, సర్ … జాన్ గే , ఇంగ్లీషు
ఒక నక్క మీ పెంపుడు కోళ్ళు ఎత్తుకు పోతుంది, సర్ ఒక వేశ్య మీ ఆరోగ్యాన్నీ, ఆస్థినీ, సర్ మీ అమ్మాయి కేవలం మీ ఇనప్పెట్టె ఎత్తుకుపోవచ్చు, సర్ మీ భార్య మీ మనశ్శాంతినీ, ఒక దొంగ మీ వస్తువుల్నీ, వాహనాల్నీ, సర్. కానీ ఇదంతా కేవలం ఎత్తుకుపోవడం గురించి. మనశ్శాంతైనా, ఆస్థైనా, ఇనప్పెట్టైనా, కోళ్ళైనా; కాని అదెప్పుడో రాసిపెట్టి ఉంది సర్, ఒక వేళ న్యాయవాదికి గాని ఫీజు చెల్లించాల్సి వస్తే అతడు మీ సర్వ…
-
స్వీయ మృత్యుల్లేఖనం… జాన్ గే, ఇంగ్లీషు కవి
జీవితం ఒక పరిహాసం, అన్ని వస్తువులూ అదే ఋజువుచేస్తాయి. ఒకప్పుడు నేనూ అలాగే అనుకునే వాడిని; ఇప్పుడు నాకు తెలుసు. . జాన్ గే (30 June 1685 – 4 December 1732) ఇంగ్లీషు కవీ, నాటక కర్తా. ఈ కవితలో సౌందర్యం “Jest” అన్న మాటని సునిశితంగా వినియోగించిన తీరు. మొదటి పాదంలో జీవితం పరిహాసం అన్నప్పుడు ప్రకృతిలోని వస్తువులని పరికిస్తూ ఆశగా … కావాలని కోరుకునే ఆనందం (Wishfulness) అన్న అర్థం సూచిస్తే, …