అనువాదలహరి

ఉదాత్త స్వభావము… బెన్ జాన్సన్ , ఇంగ్లీషు కవి

చెట్టులా ఏపుగా బలంగా పెరగడం

మనిషిని మెరుగైనవాడిగా చెయ్యదు;

ఓక్ చెట్టులా మూడు వందల ఏళ్ళు బ్రతికినా అంతే.

చివరకి ఎండి, నిస్సారమై, బోడి మానై, రాలి ముక్కలవాల్సిందే.

లిల్లీపువ్వు జీవితం ఒకరోజే

వేసవిలో బహుసుందరంగా ఉంటుంది.

పగలుపూచినది రాత్రికి వాడి, రాలిపోవచ్చు.  ఐతేనేం,

మన రోజంతటినీ దేదీప్యమానం చేసే పువ్వు అది.

మనం సౌందర్యాన్ని చిన్నచిన్న మోతాదుల్లోనే చూస్తాం.

చిన్న చిన్న ప్రమాణాల్లోనే జీవితం పరిపూర్ణమై ఉంటుంది.

.

బెన్ జాన్సన్

(11 June 1572 – 6 August 1637)

ఇంగ్లీషు కవి.

.

Ben Johnson

.

The Noble Nature

.

It is not growing like a tree

In bulk, doth make man better be;

Or standing long an oak three hundred year,

To fall a log at last, dry, bald, and sere;

A lily of a day

Is fairer far in May,

Although it fall and die that night-

It was the plant and flower of Light.

In small poportions we just beauty see;

And in short measures life may perfect be.

.

Ben Johnson 

English poet

Poem Courtesy:

https://archive.org/details/childrensgarlan01unkngoog/page/n362

మనోకామన… అబ్రహామ్ కౌలీ, ఇంగ్లీషు కవి

ప్రభూ! నాకీ వరాన్నొక్కటీ ప్రసాదించు!

నా సంపద పరులు ఈర్ష్యపడనంత చిన్నదిగా,

చీదరించుకోనంత ఎక్కువగా ఉండేట్టు చూడు.

నేను సాధించబోయే ఏ గొప్పపనులవల్లనో కాకుండా, కేవలం

నా మంచితనంవల్ల నాకు కాసింత గౌరవం దక్కాలి.

చెడ్డపేరుకంటే ఏ గుర్తింపూ లేకపోవడం మెరుగు

పుకార్లు మరణానికి దారిచూపిస్తాయి.

నాకు మనుషుల పరిచయాలు ప్రసాదించు, అది కేవలం సంఖ్య మీద

ఆధారపడకుండా, నా స్నేహితులను నే నెంచుకునేట్టుగా ఉండాలి.

నా వ్యాపారం కాకుండా, పుస్తకాలు రాత్రి కొవ్వొత్తిని వెలిగించాలి

అలాగే, రాత్రివేళ మృత్యువంత కలతలేని నిద్ర పట్టాలి

నా నివాసం విశాలమైన భవంతి కాకుండా

చిన్న పూరిగుడిశ అయినా, నా విలాసాలకు కాకుండా

అవసరాలకు తీరేటట్టు ఉండాలి.

నా పూతోట కళాత్మకంగా మనుషులు చేత కాకుండా

ప్రకృతిచేత సహజసిద్ధంగా అలంకరించబడాలి.

అక్కడ లభించే ఆనందం తన

సబైన్ భవంతిలో కూడా దొరకదని హొరేస్ ఈర్ష్యపడాలి.

ఆ విధంగా తరిగిపోతున్న నా జీవిత కాలాన్ని

రెట్టింపు చేసుకోగలను; అలా నిజంగా ఎవరు జీవితాన్ని నడపగలరో

వాళ్ళు జీవితాన్ని రెండురెట్లు అనుభవించగలరు.

ఇటువంటి ఆనంద క్షణాల్ని, వాటిలోని నిజమైన

ఆనందానిభూతినీ ఖరీదులేని ఈ క్రీడలివ్వగలవు.

అపుడు నా భవిష్యత్తుగూర్చి ఆలోచించను, చింతించను.

ప్రతిరోజూ రాత్రి పదుకునేటపుడు ధైర్యంగా అనుకోగలను:

రేపు సూర్యుడు తన కిరణాల్ని ప్రసరిస్తే ప్రసరించనీ,

లేక మబ్బులు వాటిని కమ్మితే కమ్మనీ, ఈ రోజు నేను హాయిగా జీవించేను!

.

అబ్రహామ్ కౌలీ

(1618 – 28 July 1667)

ఇంగ్లీషు కవి

.

The Wish

.

This only grant me, that my means may lay

Too low for envy, for contempt too high.

Some honour I would have

Not from great deeds, but good alone.

The unknown are better than ill known;

Rumour can ope the grave.

Acquaintance I would have, but when’t depends

Not on the number, but the choice of friends:

Books should, not business, entertain the light,

And sleep, as undisturbed as death, the night.

My house a cottage, more

Than place, and should fitting be,

For all my use, not luxury.

My garden painted over

With nature’s hand not art’s; and pleasures yield

Horace might envy in his Sabine  field.   

Thus would I double my life’s fading space,

For he that runs it well, twice runs his race.

And in his true delight,

These unbought sports, this happy state,

I would not fear nor wish my fate,

But boldly say each night,

Tomorrow let my sun his beams display,

Or in clouds hide them; I have lived today.

.

Abraham Cowley 

(1618 – 28 July 1667)

English Poet

Poem Courtesy: https://archive.org/details/WithThePoets/page/n109

 

ఎపిక్యూర్… అబ్రహామ్ కౌలీ. ఇంగ్లీషు కవి

మీ పాత్రని ఎర్రని మధువుతో నింపండి

తలకట్టున గులాబుల దండ ధరించండి

మధువూ, గులాబుల్లా మనం నవ్వుతూ

కాసేపు హాయిగా ఆనందంగా గడుపుదాం.

గులాబుల కిరీటాన్ని ధరించిన మనం

“జహీజ్”(1) రాజమకుటాన్నైనా తలదన్నుదాం

ఈ రోజు మనది; మనం దేనికి భయపడాలి?

ఈ రోజు మనది; అది మనచేతిలోనే ఉంది.

దాన్ని సాదరంగా చూద్దాం. కనీసం

మనతోనే ఉండిపోవాలని కోరుకునేలా చేద్దాం.

పనులన్నీ కట్టిపెట్టండి, దుఃఖాన్ని తరిమేయండి

రే పన్నది సుఖపడడం తెలిసినవాళ్లకే.

.

అబ్రహామ్ కౌలీ

(1618 – 28 July 1667)

ఇంగ్లీషు కవి

Note 1:

Gyges గురించి ఇక్కడ చదవండి

Note 2:

ఎపిక్యూరియన్లు భోగలాలసులని చాలా అపోహ. నిజానికి వాళ్ళు సుఖజీవనం బోధించారు గాని, ఇంద్రియ లాలసకి వ్యతిరేకులు. అతి సాధారణమైన, నిర్మలిన జీవితం, పరిమితమైన కోరికలు, పెద్ద పెద్ద ఆశలూ ఆశయాలు లేకపోవడమే వాళ్ళు బోధించింది. ఈ జీవితం నశ్వరమనీ, దీనికి భగవంతుడు కారణం కాదనీ, మరణం తర్వాత జీవితం లేదనీ, జననానికి ముందున్న అనంత శూన్యంలోకే మరణం తర్వాత చేరుకుంటాము కనుక భయపడవలసినది ఏమీ లేదనీ, బాధలకి భయపడవద్దనీ, హాయిగా జీవించమనీ చెప్పారు.

.

Abraham Cowley

.

The Epicure

.

Fill the bowl with rosy wine,

Around our temples roses twine.

And let us cheerfully awhile,

Like the wine and roses smile.

Crowned with roses we contemn

Gyge’s wealthy diadem.

Today is ours; what do we fear?

Today is ours; we have it here.

Let’s treat it kindly, that it may

Wish, at least, with us to stay.

Let’s banish business, banish sorrow;

To the Gods belongs tomorrow

.

Abraham Cowley

(1618 – 28 July 1667)

English Poet

Note:

Epicureanism is a form of hedonism insofar as it declares pleasure to be its sole intrinsic goal, the concept that the absence of pain and fear constitutes the greatest pleasure, and its advocacy of a simple life, make it very different from “hedonism” as colloquially understood.

 

Poem Courtesy:

The Book of Restoration Verse. 1910.

Ed. William Stanley Braithwaite.

http://www.bartleby.com/332/102.html

Read the Bio of the poet here

\

నే చెప్పలేదూ?… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి

నే చెప్పలేదూ… ఇకపై పాపాలు చెయ్యనని?

ప్రభూ, నువ్వే సాక్షివి, చేశాను;

అంతే కాదు, ఇంకా చేస్తూనే ఉన్నాను.

నా తప్పుల్ని దాచ శక్యం కాదు.

ఏం చెయ్యను? మళ్ళీ ప్రమాణంచేసి మాట తప్పనా?

ప్రమాణం చెయ్యడం కేవలం వృధా ప్రయాస.

నాలోని మంచి చెడుని అదుపుచెయ్యలేకపోతోంది;

ఈ ప్రయత్నం తప్పకుండా విఫలమౌతుంది.

ఓహో! ఎందుకు అలా అనుకుంటావు? నీకు భగవంతుడు

ఎంతటి ఆత్మనిగ్రహాన్ని ప్రసాదించేడో నీకు తెలియదు,

తిరిగి ఒట్టుపెట్టుకో, నువ్వు చివరిదాకా నిలబడగలిగితే

దేముడు నీ గతాన్నంతటినీ క్షమిస్తాడు.

అసలు నువ్వు మాటకినిలబడలేనకున్నప్పుడే ప్రమాణం చెయ్యాలి;

మనబలహీనక్షణాల్లో ఎంతబలంగా నిలబడగలమో మాటిచ్చినపుడే తెలుస్తుంది.

నీ దైవం నీకు వేటినీ నిరాకరించలేదు,

అలాటప్పుడు ప్రార్థించవలసిన పూచీ నీదే.

నీ దైవాన్ని నువ్వుచేసిన ప్రమాణాలను నీబెట్టుకోగల

శక్తినిమ్మని వేడుకో; మాటతప్పితే, పశ్చాత్తాపపడు.

మాటతప్పిన ప్రమాణాలకై దుఃఖించు; మళ్ళీ ప్రమాణం చెయ్యి:

కన్నీటితో చేసిన ప్రమాణాలు వృధాగా పోవు.

అలా అయితే, మరొకసారి

నా దారి సరిదిద్దుకుంటానని ప్రమాణం చేస్తున్నా;

ప్రభూ! ‘తధాస్తు’ అని ఆశీర్వదించు

ఆ గొప్పదనమంతా నీకే చెందుతుంది.

.

జార్జి హెర్బర్ట్

(3 April 1593 – 1 March 1633)

వెల్ష్ కవి

.

.

“Said I not so?”

.

 

Said I not so,—that I would sin no more?        

    Witness, my God, I did;     

Yet I am run again upon the score:  

    My faults cannot be hid.     

What shall I do?—make vows and break them still?            

    ’T will be but labor lost;     

My good cannot prevail against mine ill:   

    The business will be crost. 

O, say not so; thou canst not tell what strength  

    Thy God may give thee at the length.            

Renew thy vows, and if thou keep the last,         

    Thy God will pardon all that’s past.     

Vow while thou canst; while thou canst vow, thou may’st    

    Perhaps perform it when thou thinkest least.  

    Thy God hath not denied thee all,        

    Whilst he permits thee but to call.

    Call to thy God for grace to keep 

    Thy vows; and if thou break them, weep.       

Weep for thy broken vows, and vow again:        

Vows made with tears cannot be still in vain.             

          Then once again  

        I vow to mend my ways;

          Lord, say Amen, 

        And thine be all the praise.

.

George Herbert

(3 April 1593 – 1 March 1633)

Welsh Poet

The World’s Best Poetry.

Eds.: Bliss Carman, et al. 

Volume IV. The Higher Life.  1904.

VI: Human Experience

Poem Courtesy: https://www.bartleby.com/360/4/166.html

కాలిపోతున్న ఓడ… జాన్ డన్ ఇంగ్లీషు కవి.

.

ఇది చాలా సందేశాత్మకమైన కవిత. మనం జీవితాలు కాలి మునిగిపోతున్న ఓడలాంటివి. మరణాన్నించి ఎవ్వరమూ తప్పించుకోలేం. అలా తప్పించుకుందికి ప్రయత్నంచేసిన వారికి మరణకారణం మారుతుందేమో గాని మరణాన్నుంచి మినహాయింపు మాత్రం దొరకదు. జాన్ డన్ 17 వ శతాబ్దపు ప్రముఖ ఆధిభౌతిక (Metaphysical) కవుల పరంపరకి చెందినవాడు.

.

సముద్రంలో మునిగిపోవడంవల్ల తప్ప మంటలనుండి

తప్పించుకోలేని కాలిపోతున్న ఓడ లోంచి

కొందరు మనుషులు ఒక్కసారి బయటకు గెంతారు ,

వాళ్ళు శత్రుఓడలదరికి జేరగానే వాళ్ళతూటాలకు బలైపోయారు;

అలా ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ సమసిపోయారు,

చిత్రంగా, సముద్రంలో దూకినవారు నిప్పుకీ,

మండుతున్న ఓడలో మిగిలినవారు నీటమునిగీ.

.

జాన్ డన్

(22 January 1572 – 31 March 1631)

ఇంగ్లీషు కవి.

.

Burnt Ship

.

Out of a fired ship, which by no way 

But drowning could be rescued from the flame, 

Some men leap’d forth, and ever as they came 

Near the foes’ ships, did by their shot decay; 

So all were lost, which in the ship were found, 

      They in the sea being burnt, they in the burnt ship drown’d. 

.

John Donne

(22 January 1572 – 31 March 1631)

English Poet

Poem Courtesy: https://www.poetryfoundation.org/poems/44095/a-burnt-ship

ప్రాపంచిక సుఖాలకి వీడ్కోలు… ఏన్ కిలిగ్రూ, ఇంగ్లీషు కవయిత్రి

నశ్వరమైన సుఖాల్లారా! మీకు వీడ్కోలు

బంగారు పూతపూసిన మిధ్యలు మీరు, తళుకులీనే బొమ్మలు

చాలకాలం నా మనసు వశంచేసుకుని దారితప్పించారు

రిక్తభక్ష్యాలతో నా కడుపునింపారు.

చాలు! ఇక మీరు నా మనసుని

పూర్వంలా మోసగించలేరు.

ఎందుకంటే, ఇథాకా రాజు యులిస్సిస్ ని

మోసగించిన మాయా సంగీతం మీరు వినిపించినా

దృఢనిశ్చయంతో నా మనసునీ,

నా కోరికలని అతన్ని వాడ స్తంభానికి

కట్టినదానికంటే గట్టిగా

నా వివేకానికి బంధించుకుంటాను.

అపుడు, మీ మంత్రతంత్రాలు నా చెవి సోకినా

అతనిలాగే, మీ మాయలవల్ల గాయపడకుండా తప్పించుకుంటాను.

.

ఏన్ కిలిగ్రూ

(1660 – 1685)

ఇంగ్లీషు కవయిత్రి

.

A Farewell (To Worldly Joys.)

.

Farewell ye Unsubstantial Joys,

Ye Gilded Nothings, Gaudy Toys,

Too long ye have my Soul misled,

Too long with Airy Diet fed:

But now my Heart ye shall no more

Deceive, as you have heretofore:

For when I hear such Sirens sing,

Like Ithaca’s fore-warned King,

With prudent Resolution I

Will so my Will and Fancy tie,

That stronger to the Mast not he,

Than I to Reason bound will be:

And though your Witchcrafts strike my Ear,

Unhurt, like him, your Charms I’ll hear.

.

Anne Killigrew

(1660 – 1685)

English Poet

http://famouspoetsandpoems.com/poets/anne_killigrew/poems/21096

ఇక నీకు ఎండ బాధలేదు… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇక నీకు ఎండ బాధలేదు…

ఎంత గజగజ వణికించినా చలి బాధా లేదు;

నువ్వు ఈ లోకంలో వచ్చిన పని పూర్తిచేసుకుని

ఇంటిముఖం పట్టేవు, తగిన వేతనం అందుకున్నావు;

అందమైన, డబ్బున్న మగపిల్లలైనా ఆడపిల్లలైనా,

బీదా బిక్కీ అనాధల్లా ఒకరోజు మట్టిలో కలవవలసిందే.

గొప్ప అధికారుల కోపం నిను భయపెట్టదు;

నిరంకుశుల బాధల పరిధి దాటిపోయావు;

ఇక కూడూ గుడ్డా గురించి ఆలోచించే పని లేదు;

నీకు చెట్టుకీ, రెల్లుగడ్డికీ మధ్య భేదం లేదు;

మహరాజయినా, మేధావైనా, గొప్ప వైద్యుడైనా

అందరిదీ ఇదే వరస, చివరకి మట్టిలో కలవాల్సిందే.

ఇక నీకు మెరుపుల వల్ల భయం లేదు;

అందరూ భయపడే పిడుగన్నా భయం లేదు;

అపనిందలకీ, దూషణలకీఉ నువ్వు అతీతం;

నువ్వు నీ కష్టసుఖాలన్నీ అనుభవించేసేవు;

యువ ప్రేమికులూ, ఆమాటకొస్తే ప్రేమికులందరూ

నిన్ననుసరించవలసిందే, మట్టిలో కలవాల్సిందే.

నీ కిక ఏ మాంత్రికుడూ హానిచెయ్యలేడు;

ఏ మంత్రం నిన్ను సమ్మోహపరచలేదు;

నిన్ను ఏ ప్రేతాత్మలూ ఆవహించకుండుగాక!

నీకు ఏ అపకారమూ జరుగకుండు గాక!

నీకు చాలా ప్రశాంతమైన ముగింపు లభించుగాక!

నీ సమాధి జగత్ప్రసిద్థమగు గాక!

.

షేక్స్పియర్

ఇంగ్లీషు కవి

(From Cymbeline Act IV Scene 2 )

William Shakespeare

.

Fear No More the Heat o’ the Sun

.

Fear no more the heat o’ the sun,

        Nor the furious winter’s rages;

Thou thy worldly task hast done,

        Home art gone, and ta’en thy wages:

Golden lads and girls all must,

As chimney-sweepers, come to dust.

Fear no more the frown o’ the great;

        Thou art past the tyrant’s stroke;

Care no more to clothe and eat;

        To thee the reed is as the oak:

The Sceptre, Learning, Physic, must

All follow this, and come to dust.

Fear no more the lightning-flash,

Nor the’all-dreaded thunder-stone;

Fear not slander, censure rash;

Thou hast finished joy and moan:

All lovers young, all lovers must

Consign to thee, and come to dust.

No exorciser harm thee!

Nor no witchcraft charm thee!

Ghost unlaid forbear thee!

Nothing ill come near thee!

Quiet consummation have,

And renownèd by thy grave!

.

William Shakespeare

(26 April 1564 – 23rd  April 1616)

English Poet

( From Cymbeline Act IV Scene 2)

అసత్యం… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి

ఓ ఆత్మా! ఈ శరీరపు అతిథీ! ఫో!
ఎవ్వరూ మెచ్చని ఈ పని చేసిపెట్టు;
అత్యుత్తమమైన వాటిని ఎంచుకోడానికి వెనుకాడకు;
సత్యమొక్కటే నీకు అనుమతి పత్రం.
ఫో! ఫో! నాకు మరణం ఆసన్నమయింది.
పోయి లోకం చేసే తప్పులు … తప్పులని చెప్పు!

రాజాస్థానికి పోయి అది కుళ్ళిన
కట్టెలా వెలుగుతోందని చెప్పు;
చర్చికి పోయి అది మంచేదో చెబుతుంది
గాని, ఏ మంచీ చెయ్యదని చెప్పు.
చర్చిగాని, రాజసభగాని వాదిస్తే,
వాళ్ల సమాధానాలు నిర్ద్వంద్వంగా ఖండించు.

అధికారులదగ్గరకి పోయి చెప్పు వాళ్ళు
ఇతరుచేస్తున్న సేవలవల్ల బ్రతుకుతున్నారని,
వాళ్ళు తగిన ప్రతిఫలం ముట్టచెప్పకపోతే
ద్వేషంతో కాదు కుట్రతో సమాధానం చెబుతారని
అధికారులు తిరిగి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే
వాళ్ళ మాటల్లో అసత్యాన్ని ఎత్తి చూపించు.

భోగభాగ్యాలతో తులతూగుతూ
ఆస్థిపాస్థుల్ని నిర్వహించుకునే వారితో చెప్పు
వాళ్ళ ఆశయం అభ్యుదయమేగాని
వాళ్ళ ఆచరణలో మాత్రం ద్వేషం ఉందని.
వాళ్లు ఒక్కమాట ఎదురు సమాధానం చెప్పినా
ఆ మాటల్లోని అసత్యాన్ని ఎత్తి చూపించు.

కష్టాలు ధైర్యంగా ఎదుర్కొనేవారితో
వాళ్లు కష్టాల్ని అనుభవిస్తూ, కొనితెచ్చుకుంటారని,
వాళ్లు అలా మూల్యాన్ని చెల్లిస్తూ
నలుగురినుండీ కేవలం మెచ్చుకోలు ఆశిస్తారని.
వాళ్ళు మాటకిమాట సమాధానం చెప్పేరా
వాళ్ళ మాటల్లో డొల్లతనాన్ని ఎత్తి చూపించు.

భక్తితో చెప్పు దానికి శ్రద్ధ అవసరమని
ప్రేమతో చెప్పు అది కేవలం కామమేనని
కాలానికి చెప్పు అది కేవల ప్రవాహమని
ఈ శరీరానికి చెప్పు అది కేవలం మట్టి అని:
అవి సమాధానం చెప్పకూఊడదని ఆశించు,
ఎందుకంటే నువ్వు వాటిని కాదనవలసి వస్తుంది.

వయసుతో చెప్పు అది ప్రతిరోజునీ వృథా చేస్తోందని
గౌరవప్రతిష్ఠలతో చెప్పు అవి ఎంతనిలకడలేనివో,
అందంతో చెప్పు అది ఎంత వేగిరం దెబ్బతింటుందో
ఔదార్యంతో చెప్పు అది ఎన్ని తప్పటడుగులు వేస్తుందో
అవి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే
వాటి తప్పుని నిర్దాక్షిణ్యంగా ఖండించు.

బుద్ధికి చెప్పు అది సున్నితమైన
విషయాలలో ఎంతగా చిక్కుల్లోపడుతుందో
అలాగే జ్ఞానాకి చెప్పు అదికూడా
అతితెలివికి పోయి చిక్కుల్లో చిక్కుకుంటుందో
అవి సమాధానం చెప్పడానికి పూనుకోగానే
చక్కగా వాటిలోపాన్ని వాటికి ఎత్తి చూపించు.

వైద్యానికి దాని తెగువగురించి హెచ్చరించు
నైపుణ్యానికి దాని అలసత్వం గురించి హెచ్చరించు
దాతృత్వానికి ఉదాశీనతగురించి హెచ్చరించు
చట్టానికి, దాని వాదనప్రతివాదనలగురించి హెచ్చరించు.
అవి సమాధానం చెబుతుంటే
అందులోని అసత్యాన్ని వేలెత్తి చూపించు.

అదృష్టానికి అది ఎంత గుడ్దిదో వివరించు
ప్రకృతికి అది చెందబోయే క్షయం గురించి చెప్పు;
స్నేహానికి అందులోని కరకుదనం గురించి చెప్పు
న్యాయానికి అందులోని ఆలశ్యం గురించి చెప్పు
అవిగాని సమాధానం చెబితే
వాటిని ఖండిస్తూ ఎదురుసమాధానం చెప్పు

కళలకి ప్రజలు వాటికిచ్చే విలువలోని తేడాయేతప్ప
సహజంగా దేనిలోనూ పరిపక్వత లేదని చెప్పు
తత్త్వచింతనలతో అవి లోతుగా ఉండాలని కోరుకుంటాయిగానీ
అలా పైపైకి కనిపించడనికే ఎక్కువగా ప్రయతిస్తాయనీ చెప్పు.
కళలుగాని, తత్త్వచింతనలు గాని సమాధానం చెబితే
కళలూ, తత్త్వచింతనల వాదాలని పూర్వపక్షం చెయ్యి.

విశ్వాసానికి చెప్పు అది వీడు వీడి పోయిందని
దేశం ఎలా తప్పులు చేస్తోందో వివరించు
మగతనం దయని పక్కనబెడుతుందనీ
శీలానికి ఎంతమాత్రం విలువివ్వదనీ చెప్పు.
అవి తిరిగి సమాధానం చెబితే
ఎదిరించడానికి ఎంతమాత్రం వెనుకాడకు.

నేను నిన్ను ఆదేశించినట్టు చెప్పమన్నవన్నీ
ఉన్నదున్నట్టు చెప్పిన తర్వాత,
నిజానికి ఇతరుల మాటలని ఖండించడానికి
వాళ్ళని చంపడానికి కావలసినంత సాహసం కావాలి;
ఎవడికి ఇష్టమయితే వాడిని నిన్ను చంపడానికి ప్రయత్నించనీ
ఆత్మని ఏ ఖడ్గాలూ సంహరించలేవు.

.

సర్ వాల్టర్ రాలీ

1554 – 29 October 1618

ఇంగ్లీషు కవి .

.

The Lie

 .

Go, soul, the body’s guest,

        Upon a thankless arrant:   [errand]

Fear not to touch the best;

        The truth shall be thy warrant.

                Go, since I needs must die,

                And give the world the lie.

Say to the court, it glows

        And shines like rotten wood;

Say to the church, it shows

        What’s good, and doth no good:

                If church and court reply,

                Then give them both the lie.

Tell potentates, they live

        Acting by others’ action,

Not loved unless they give,

        Not strong but by a faction:

                If potentates reply,

                Give potentates the lie.

Tell men of high condition

        That manage the estate,

Their purpose is ambition,

        Their practice only hate:

                And if they once reply,

                Then give them all the lie.

Tell them that brave it most,

        They beg for more by spending,

Who, in their greatest cost,

        Seek nothing but commending:

                And if they make reply,

                Then give them all the lie.

Tell zeal it wants devotion;

        Tell love it is but lust;

Tell time it is but motion;

        Tell flesh it is but dust:

                And wish them not reply,

                For thou must give the lie.

Tell age it daily wasteth;

        Tell honour how it alters;

Tell beauty how she blasteth;

        Tell favour how it falters:

                And as they shall reply,

                Give every on the lie.

Tell wit how much it wrangles

        In tickle points of niceness;

Tell wisdom she entangles

        Herself in over-wiseness:

                And when they do reply,

                Straight give them both the lie.

Tell physic of her boldness;

        Tell skill it is prevention;

Tell charity of coldness;

        Tell law it is contention:

                And as they do reply,

                So give them still the lie.

Tell fortune of her blindness;

        Tell nature of decay;

Tell friendship of unkindness;

        Tell justice of delay:

                And if they will reply,

                Then give them all the lie.

Tell arts they have no soundness,

        But vary by esteeming;

Tell schools they want profoundness,

        And stand too much on seeming:

                If arts and schools reply,

                Give arts and schools the lie.

Tell faith it’s fled the city;

        Tell how the country erreth;

Tell, manhood shakes off pity;

        Tell, virtue least preferreth:

                And if they do reply

                Spare not to give the lie.

So when thou hast, as I

        Commanded thee, done blabbing,

Although to give the lie

        Deserves no less than stabbing,

                Stab at thee he that will,

                No stab the soul can kill.

 .

Sir Walter Raleigh

1554 – 29 October 1618

English Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Lie.htm

నిరాకరణ… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి

ప్రశాంతంగా ఉన్న నీ చెవులలోకి
నా ప్రార్థనలు చొరబడలేనపుడు;
నా కవితలాగే, నా హృదయమూ ముక్కలై,
నా గుండెనిండా భయాలు నిండి
అంతా అస్తవ్యస్తమైపోయింది.

వక్రించిన నా ఆలోచనలు, శీర్ణధనువులా,
రెండుగా చీలిపోయాయి;
వేటిత్రోవన అవిపోయాయి; కొన్ని సుఖాలవేటలో పోతే
కొన్ని పోరాటాలకీ, ప్రమాదకరమైన
ప్రయత్నాలవైపు మరలాయి.

ఎక్కడికెళితేనేమిటి, అని అవి అంటుండేవి,
రేయింబవళ్ళు చేసే వాడికోళ్లకు
హృదయమూ, కాళ్ళూ చచ్చుబడిన తర్వాత?
ఓ ప్రభూ! కనికరించి కనిపించు, కనిపించు,
అయినా నువ్వు కనిపించవు.

చిత్రమేమిటంటే, నువ్వు మట్టికి నిన్ను వేడగలిగే
నాలుకని ప్రసాదించి,
తీరా అది వేడుకున్నపుడు నువ్వు వినిపించుకోవు! రోజల్లా
రోజల్లా నా హృదయం మోకాళ్లమీదే ఉంది
అయినా నువ్వు కనిపించవు.

కనుక నా ఆత్మ కనుమరుగైపోయింది
శృతిచేయకా, మీటబడకా;
బలహీనమైన నా మనసు, తృంచబడినగుండెలా
సవ్యమైనమార్గంలో చూడలేకున్నది
వేరుపడి, వేలాడుతోంది.

ఓ ప్రభూ! గుండెలేని హృదయానికి ధైర్యం చెప్పి, శృతి చెయ్యి,
ఆలస్యం చెయ్యవద్దు;
దాని వల్ల నా ప్రార్థనలకు నువ్వు చూపిన అనుగ్రహానికి
అవీ నా మనసూ జంటగా గణగణమ్రోగుతూ
నా కవితను సరిదిద్దగలుగు గాక!

.

జార్జి హెర్బర్ట్
(3 April 1593 – 1 March 1633)
వెల్ష్ కవి .

.

Deniall

            When my devotions could not pierce

                                    Thy silent eares;

Then was my heart broken, as was my verse;

                  My breast was full of fears

                                    And disorder:

            My bent thoughts, like a brittle bow,

                                    Did flie asunder:

Each took his way; some would to pleasures go,

                  Some to the warres and thunder

                                    Of alarms.

            As good go any where, they say,

                                    As to benumme

Both knees and heart, in crying night and day,

                  Come, come, my God, O come,

                                    But no hearing.

            O that thou shouldst give dust a tongue

                                    To crie to thee,

And then not heare it crying! all day long

                  My heart was in my knee,

                                    But no hearing.

            Therefore my soul lay out of sight,

                                    Untun’d, unstrung:

My feeble spirit, unable to look right,

                  Like a nipt blossome, hung

                                    Discontented.

            O cheer and tune my heartlesse breast,

                                    Deferre no time;

That so thy favours granting my request,

                  They and my minde may chime,

                                    And mend my ryme.

.

George Herbert

(3 April 1593 – 1 March 1633)

Welsh  Poet, Orator and Anglican Priest

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Deniall.htm

ఓ గులాబీ, పోయి చెప్పు… ఎడ్మండ్ వేలర్, ఇంగ్లీషు కవి

ఓ గులాబీ! ఆమె  సమయాన్నీ, నా సమయాన్నీ
వృథా చేసే ఆమెకి పోయి చెప్పు,
ఇప్పుడు ఆమెను నీతో సరిపోలుస్తున్నానని
ఆమెకి తెలుసు గనుక
ఆమె ఎంత అందంగా మనోహరంగా ఉంటుందో!

ఆమె సౌందర్యాన్ని తిలకించడాన్ని నిరసించే
ప్రాయంలో ఉన్న ఆమెకు చెప్పు
నువ్వేగాని మనిషిజాడలేని
ఎడారిలో పుట్టి ఉంటే
నిన్ను కీర్తించేవాళ్ళు లేక సమసిపోయేదానివని.

వెలుగుపొడ సోకని ఎంతటి అందానికైనా
విలువ అల్పమని చెప్పు
ఆమెని నలుగురిలోకీ రమ్మను
ఆమెను అందరూ కోరుకోడాన్ని సహించమను
ఆమెని పొగిడితే సిగ్గుపడొద్దను.

అన్ని అపురూపవస్తువుల్లాగే
ఆమెనీ సమసిపోనీ
అది నిన్ను చూసి నేర్చుకోమను
అందంగా మనోహరంగా ఉండేవన్నిటికీ
జీవితం ఎంత క్షణికమో తెలుసుకోనీ
.

ఎడ్మండ్ వేలర్

(3 March 1606 – 21 October 1687)

ఇంగ్లీషు కవి

.

Go, Lovely Rose

     Go, lovely Rose-

 Tell her that wastes her time and me,

     That now she knows,

 When I resemble her to thee,

 How sweet and fair she seems to be.

     Tell her that’s young,

 And shuns to have her graces spied,

     That hadst thou sprung

 In deserts where no men abide,

 Thou must have uncommended died.

     Small is the worth

 Of beauty from the light retired:

     Bid her come forth,

 Suffer herself to be desired,

 And not blush so to be admired.

     Then die-that she

 The common fate of all things rare

     May read in thee;

 How small a part of time they share

 That are so wondrous sweet and fair!

.

 Edmund Waller

(3 March 1606 – 21 October 1687)

English Poet and Politician

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2000/10/go-lovely-rose-edmund-waller.html

 

%d bloggers like this: