అనువాదలహరి

తెల్లవారుఝాము వచ్చిన కల … లీ చింగ్ చావో, చీనీ కవయిత్రి

ఈ కవితలో చాలా కుతూహలమైన విషయాలున్నాయి :

తెల్లవారుఝామున వచ్చిన కల నిజమౌతుందన్న నమ్మకం, అక్కడి ప్రజల్లో కూడా ఉండేదన్నమాట.

దాన్ని మూఢనమ్మకంగా గుర్తించిన మేధావి వర్గం కూడా ఉండేదన్నమాట.

మనసులో చాలా గాఢంగా ఉన్న కోరికలే కలలరూపంలో వస్తాయని ప్రతీతి. ఇష్టమైన కలలు వచ్చినపుడు ఆ కలలలోంచి బయటపడడానికి మనసు ఇష్టపడదు. అందుకే ఆ సమయంలో ఎవరైనా మేలుకొలపబోతే విసుక్కుంటాం. లేవవలసిన అవసరం వస్తే అయిష్టంగా బయటపడతాం.ఆ కలనే పదే పదే నెమరువేసుకుంటాం.

మేధావులు మేధావులతో మంచి చర్చ చెయ్యాలనుకుంటారు. అయితే ఈ చర్చలు కేవలం మేథోపరమైన చర్చలుగా మిగిలిపోకుండా, ఆ వాదోపవాదాల పర్యవసానం / నిగ్గుతేల్చిన సత్యాలు రాజ్యపాలనలో రాజు / చక్రవర్తికి ఉపయోగించేవిగా ఉండాలనుకున్న వర్గం కూడా ఉండేదన్నమాట.

***

ఈ తెల్లవారుఝామున నాకో కలవచ్చింది

గాలికి కొట్టుకుని చప్పుడౌతున్న దూరదూరంగా ఉన్న

గంటల మధ్యనుండి పోతున్నానట;

పొగమంచు నెక్కి ప్రాభాతనీరదపంక్తి నందుకున్నానట.

అక్కడ మన ప్రాచీన ఋషిసత్తముడు చీ-షేంగ్ తో

ఎప్పటినుండో కలగంటున్నట్టు సమావేశమయానట.

అనుకోకుండా అక్కడ దేవకాంత

‘ఓ లు హువా’  ని కలుసుకున్నానట.

ఇద్దరం పడవలంత పెద్ద కలువతీగెల వేర్లు చూశాము

ఇద్దరమూ పుచ్చకాయలంతప్రమాణపు రేగుపళ్ళను తిన్నాము.

మేమిద్దరం కలువలపై ఆశీనులైన వారి అతిధులం

సున్నితమైన భావవిశేషాలతో నిండిన

గొప్ప అపురూపమైన భాషలో వారు మాటాడేరు.

ఆభాసవైరుధ్యాలగూర్చి సునిశితమైనమాటలతో చర్చించారు

అప్పుడే పొయ్యిమీంచి కాచితెచ్చిన తేనీరు సేవించాము.

చక్రవర్తికి పరిపాలనలో ఇది ఉపకరించనప్పటికీ

మనుషులజీవితం ఇలా ఉండగలిగితే

ఇదొక అవధిలేని ఆనందానుభూతి.

నేనెందుకు తిరిగి నా పాత ఇంటికి మరలిపోవాలి?

మేలుకుని, దుస్తులేసుకుని, ధ్యానంలో కూచోవాలి?

అక్కరలేని రొద వినలేక చెవులుమూసుకోవాలి?

నా మనసుకి తెలుసు ఈ కల ఎన్నటికీ నిజం కాలేదని.

అయితేనేం? ఆ ప్రపంచాన్ని ఒకసారి

మనసారా తలుచుకుని నిట్టూరుస్తాను.

.

లీ చింగ్ చావో

13 మార్చి 1084 – 1155)

చినీ కవయిత్రి

Li QingZhao

(aka  Li Ching Chao)

Photo Courtesy:

http://m.womenofchina.cn/xhtml/people/history/15083277-1.htm 

.

A Morning Dream 

.

This morning I dreamed I followed
Widely spaced bells, ringing in the wind,
And climbed through mists to rosy clouds.
I realized my destined affinity
With An Ch’i-sheng the ancient sage.
I met unexpectedly O Lu-hua
The heavenly maiden.

Together we saw lotus roots as big as boats.
Together we ate jujubes as huge as melons.
We were the guests of those on swaying lotus seats.
They spoke in splendid language,
Full of subtle meanings.
The argued with sharp words over paradoxes.
We drank tea brewed on living fire.

Although this might not help the Emperor to govern,
It is endless happiness.
The life of men could be like this.

Why did I have to return to my former home,
Wake up, dress, sit in meditation.
Cover my ears to shut out the disgusting racket.
My heart knows I can never see my dream come true.
At least I can remember
That world and sigh.

.

Li Ching Chao (Li Quingzhao)

1084-1155

Chinese Poetess

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/li_ching_chao/poems/7258

ప్రకటనలు

రుబాయీ XI… ఉమర్ ఖయ్యాం, పెర్షియన్ కవి

ఇక్కడ, ఈ పొదరింటి క్రింద ఒక రోట్టె ముక్కా,

ఒక పాత్రనిండా మద్యం, ఒక కవిత్వ పుస్తకం…

ఈ నిర్జనప్రదేశంలో… పక్కన సాకీ! నువ్వు పాడుతుంటే,

చాలు! ఈ ఏకాంతప్రదేశమే స్వర్గతుల్యం.

.

ఉమర్ ఖయ్యాం

(18 May 1048 – 4 December 1131)

పెర్షియన్ కవీ, ఖగోళ శాస్త్రజ్ఞుడూ

.

Omar Khayyam
Omar Khayyam
Image Courtesy: http://en.wikipedia.org

.

Here with a Loaf of Bread beneath the Bough,

A Flask of Wine, A Book of Verse, — and Thou

Beside me singing in the wilderness —

And Wilderness is Paradise enow.

.

Omar Khayyam

(18 May 1048 – 4 December 1131)

Persian Poet and astronomer

Poem Courtesy: From the reprint of First Version of 75 Rubayat by Edward Fitzgerald

https://ia700508.us.archive.org/20/items/rubaiyatfitzgera00omar/rubaiyatfitzgera00omar_bw.pdf

రుబాయీ – 51… ఉమర్ ఖయ్యాం, పెర్షియన్ కవి

ఆ రాసే చెయ్యి రాస్తూనే ఉంటుంది, ఎంతరాసినా ఆగదు;

ముందుకు పోతూనే ఉంటుంది; నీ ప్రార్థనలూ, మేధస్సూ

అందులో ఒక్క వాక్యాన్ని కూడా వెనక్కి వచ్చి సరిదిద్దేలా చెయ్యలేవు,

నువ్వు ఎన్ని కన్నీళ్ళు కార్చు; ఒక్క అక్షరంకూడా చెక్కుచెదరదు.

.

ఉమర్ ఖయ్యాం

(18 May 1048 – 4 December 1131)

పెర్షియను కవీ, తాత్త్వికుడూ, గణిత, ఖగోళ శాస్త్రజ్ఞుడు.

(అనువాదం: ఫిజెరాల్డ్ )

Omar Khayyam
Omar Khayyam
Image Courtesy: http://en.wikipedia.org

.

Rubai- LI

The Moving Finger writes; and, having writ,

Moves on: nor all Thy Piety nor Wit

Shall lure it back to cancel half a Line,

Nor all Thy Tears wash out a Word of it

.

Omar Khayyam

(18 May 1048 – 4 December 1131)

Persian Poet and astronomer

Poem Courtesy: From the reprint of First Version of 75 Rubayat by Edward Firzerald

https://ia700508.us.archive.org/20/items/rubaiyatfitzgera00omar/rubaiyatfitzgera00omar_bw.pdf

 

Source:

 

%d bloggers like this: