అనువాదలహరి

అది పైకి చెప్పే మాట కాదు … సారా టీజ్డేల్

Image Courtesy: http://www.livinghealthyworldwide.com

అది పైకి చెప్పే మాట కాదు.

కొన్ని మాటలే బయటకి వస్తాయి;

అది కళ్లల్లో ప్రతిఫలించేదీ కాదు,

తల అవనతం చెయ్యడమూ కాదు,


పదిలపరచుకోవలసినవెన్నో ఉన్న

హృదయపు సడిలేని అలజడి

కేవలం జ్ఞాపకాలు కలతపరచే

కలతనిద్ర.

.

Image Courtesy: http://img.freebase.com

సారా టీజ్డేల్

.

It is not a word

.

It is not a word spoken,
Few words are said;
Nor even a look of the eyes
Nor a bend of the head,

But only a hush of the heart
That has too much to keep,
Only memories waking
That sleep so light a sleep.
.
Sara Teasdale

August 8, 1884 – January 29, 1933

American Lyrical Poet

Her works: Sonnets to Duse and Other Poems (1907), Helen of Troy and Other Poems(1911), Rivers to the Sea(1915), Love Songs (1917), Flame and Shadow(1920). Love Songs won the 1918 Pulitzer prize, Columbia University Poetry Society Prize and the Annual Poetry Society of America Prize.

పాత రాగాలు … సారా టీజ్డేల్

Image Courtesy: http://www.all-hd-wallpapers.com

నా బ్లాగు దర్శకులకు

ఇది నా 300 వ టపా. నేను నా బ్లాగు ప్రారంభించినపుడు (29.8.2010) ఇంతదూరం వస్తానని ఊహించలేదు. మీ  అందరి ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యపడింది. మీ కందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

ఈ సందర్భగా నా అభిమాన ఆంగ్ల కవయిత్రి సారా టీజ్డేల్ కవిత అందిస్తున్నాను.

(సారా టీజ్డేల్ అసాధారణ ప్రజ్ఞావంతురాలయిన కవయిత్రి.  ఒక సామాన్యమైన అనుభవాన్ని తీసుకుని, అందులో ఎంత తాత్త్విక భావనని కలగలిపిందో చూడండి.)

..

తోటలో గాలి పెద్దగా వీచనప్పుడు

గులాబులు, సూర్యకమలాలనుండీ వచ్చే పరిమళపు తెమ్మెరలు

మనమీద తేలియాడి ఎక్కడికి సాగిపోతాయో తెలీదు

.

అలాగే, ఒక పాతరాగంకూడా గుండెలో గుసగుసలాడి

జాడ తెలుపకుండా నా నుండి చల్లగా ఎక్కడికో జారుకుంటుంది

మంద పవనాలు చడీచప్పుడులేకుండా మోసుకుపోయే సుగంధంలా.

.

కానీ, ఆ పరిమళాలు నా మీద వీస్తున్న క్షణంలో

నాకు తెలుస్తునే ఉంటుంది, ఆ క్షణంలో అనుభవించే

ఆనందమూ, విషాదమూ మరి తిరిగి రావని.

.

అందుకే, చీకటి మడుగుపై

‘రాక’ నుండి రాలి పడి విరిగిన వెలుగురేకలు ఏరుకున్నట్టు

దొరికినన్ని రాగాలు చేజిక్కించుకుందికి ప్రయత్నిస్తాను

.

కానీ అవి తేలి వెళ్లిపోతాయి… అయినా, అసలు  ఎవ్వడాపగలడు

యవ్వనాన్నీ, సుగంధాన్నీ, వెన్నెల వెలుగునీ?

.

సారా టీజ్డేల్.

.

Old Tunes…

.

As the waves of perfume, heliotrope, rose,
Float in the garden when no wind blows,
Come to us, go from us, whence no one knows;

So the old tunes float in my mind,
And go from me leaving no trace behind,
Like fragrance borne on the hush of the wind.

But in the instant the airs remain
I know the laughter and the pain
Of times that will not come again.

I try to catch at many a tune
Like petals of light fallen from the moon,
Broken and bright on a dark lagoon,

But they float away — for who can hold
Youth, or perfume or the moon’s gold?

.

Sara Teasdale

ఒక్కతెనే… సారా టీజ్డేల్

Image Courtesy: http://bp2.blogger.com

.

నువ్వు నన్ను ప్రేమిస్తున్నప్పటికీ,

ఎంతో అపురూపంగా చూచుకుంటున్నప్పటికీ,

నేను నా సర్వస్వం ఇచ్చి, పుచ్చుకుంటున్నప్పటికీ,

ఎందుకో, ఒక్కోసారి జీవితం పై విరక్తి కలుగుతోంది.

.

ఈ వేసారిన వివర్ణ విశ్వశృంగాగ్రంపై

ఒక్కతెనే నిలబడి నట్టు ఒంటరితనం ఆవహించి,

పురులువిప్పుకుంటున్న మంచు నా చుట్టూ పొరలుతూ,

తలపై అనంత రోదసి తెరుచుకుంటున్నట్టు అనిపిస్తుంది.

.

భూమ్యాకాశాలు అదృశ్యమై,

ప్రకృతిలో లీనమై, ఒంటరితనమెరుగని వారి

ప్రశాంతత నే ననుభవించకుండా

నా అస్తిత్వపు అహంకారం అడ్డుగా నిలుస్తుంది.

.

సారా టీజ్డేల్

.

Alone

.

I am alone, in spite of love,
In spite of all I take and give—
In spite of all your tenderness,
Sometimes I am not glad to live.

I am alone, as though I stood
On the highest peak of the tired gray world,
About me only swirling snow,
Above me, endless space unfurled;

With earth hidden and heaven hidden,
And only my own spirit’s pride
To keep me from the peace of those
Who are not lonely, having died.

.

Sara Teasdale

ఉత్తర క్షణం … సారా టీజ్డేల్

Image Courtesy: http://www.norahhouse.com
http://www.norahhouse.com

.

నేను మరణించిన ఉత్తరక్షణం నుండి నా జీవితం 

విశ్వవిలీనగానంలో సజీవమై ఉంటుంది

ఉత్తుంగతరంగాలు కడలిలో కలిసిపోయినపుడు

ఉత్పన్నమై, తీరానికి మోసుకుపోబడే ధవళఫేనంలా.

.

క్షణికమైన బుద్బుదప్రకాశంలా

ఈ రేయింబవళ్ళు నిమిత్తకాలం జ్వలిస్తాయి

తమ స్వక్షేత్రమైన అనంత

శూన్యంలోకి మరలిపోయేంత వరకూ.

.

Image Courtesy: http://img.freebase.com

సారా టీజ్డేల్.

(8-8-1884 – 29-1-1933)

(అమెరికను కవయిత్రి సారాటీజ్డేల్ కి తగినంత గుర్తింపు రాలేదని నేను భావిస్తాను. తాత్త్విక చింతన, ప్రేమ, విరహం మొదలైన విషయాల మీద ఆమె అపురూపమైన కవిత్వం వ్రాసింది.  ఆమె కవితలు మరీ దీర్ఘంగా ఉండవు. ఆమె ఉపమానాలు సూటిగా పాఠకుడి గుండెలోతులను స్పృశించేలా ఉంటాయి. అందుకు ఈ కవితనే ఉదాహరణగా చెప్పవచ్చు.

మొదటిచరణంలో నశ్వరమైన మన జీవితంగురించి చెబుతూ, మనం పోయిన తర్వాత మిగిలేది, కెరటం భంగపడ్డతర్వాత మిగిలే నురుగులాంటిదని ఉపమిస్తుంది. అంతే కాక, ఆ ఉపమానాన్ని మరికొంచెం పొడిగిస్తూ, మనం పోయిన తర్వాత మనగురించి మన అభిమానులు మాటాడుకునే విషయాలు ఎలాంటివంటే ఆ నురగమీద పడి మెరిసే కిరణాలవంటివిట. కాలక్రమంలో బుడగలుపేలిపోయి శూన్యమే మిగులుతుంది.  మనం శూన్యంలోకి విలీనం అవుతాము. దాన్ని, సృష్టికి కూడా అన్వయిస్తూ… ఈ సూర్యచంద్రులున్నంతకాలం సృష్టివెలుగుతుంది. తర్వాత అనంత అప్రమేయ శూన్యంలో ఒక భాగమై మిగిలిపోతుంది… అని ఆమె ఇచ్చిన ముగింపు గమనించండి.

ఇది నాకు నచ్చిన ఆమె అనేక కవితల్లో ఒకటి.)

.

A Little While

.

A little while when I am gone

My life will live in music after me

As spun foam lifted and borne on

After the wave is lost in the full sea.

.

A while these nights and days will burn

In song with the bright frailty of foam

Living in light before they turn

Back to the nothingness that is their home.

.

Sara Teasdale

(This is one of her most beautiful poems. Philosophy, love, angst of separation were her forte. Her poems are not very long but full of apposite images and drive the point straight to the reader. Perhaps she did not receive the kind of reputation she richly deserves.

In this poem you can notice that while in  the first stanza treats  the ephemeral nature of life, in the second she subtly mixes up the ephemeral nature of the universe itself with the way people remember the dead for a while, maybe for the lifetime of the offspring and friends,  before the person and his memories pass into infinite nothingness … never to be mentioned or never to be heard of,  after that. Just as, the creation itself falls into a long dreadful eternal silence after its tenure is over

This is a poem with great philosophical depth.)నిద్రలోనే … సారా టీజ్డేల్

Image Courtesy: http://t0.gstatic.com

.

నిద్రలోనే వాళ్ళ ముఖాలు నాకు కనిపిస్తాయి

నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాతో ఆడిన పిల్లలందరివీ

లూయిజ్,  తన గోధుమరంగుజుత్తు చక్కగా జడేసుకునీ,

ఏనీ,  తన ఉంగరాలజుట్టు హాయిగా, ఎగరేసుకుంటూను

.

నిద్రలోనే కాలాన్ని మరిచిపోతాం…

ఇప్పుడు వాళ్లంతా ఎలా ఉన్నారో, ఎవరికి తెలుస్తుంది?

కాని నిన్నరాత్రి చిన్నప్పటిలాగే ఆడుకున్నాం,

మెట్ల పక్క మలుపులో బొమ్మరిల్లుతో సహా

.

ఏళ్ళు గడిచినా, కాలం వాళ్ళ ముఖాలని పదునుపెట్టలేకపోయింది.

వాళ్ళ కళ్ళలోకి చూశాను… అప్పటిలాగే ఇంకా అమాయకంగానే ఉన్నై,

వాళ్ళూ నా గురించి కలగంటుంటారా?

వాళ్ళకీ నేను చిన్నపిల్లలాగే కనిపిస్తుంటానా? ఏమో!

.

సారా టీజ్డేల్, 

అమెరికను కవయిత్రి

.
Only In Sleep
.
Only in sleep I see their faces,
Children I played with when I was a child,
Louise comes back with her brown hair braided,
Annie with ringlets warm and wild.
Only in sleep Time is forgotten —
What may have come to them, who can know?
Yet we played last night as long ago,
And the doll-house stood at the turn of the stair.
The years had not sharpened their smooth round faces,
I met their eyes and found them mild —
Do they, too, dream of me, I wonder,
And for them am I too a child?
.
Sarah Teasdale
American Poetess

నేనింకా నీదానను కాలేదు … సారా టీజ్డేల్

Image Courtesy: http://cdn.designrfix.com

.

నే నింకా నీదానకాలేదు, నీలోకరిగిపోలేదు, ఉనికికోల్పోలేదు; 

మధ్యాహ్నం వెలిగించిన కొవ్వొత్తిలా,

మున్నీటగలిసిన మంచుతరకలా,

నీలో నన్ను నే కోల్పోవాలన్న కాంక్ష ఉన్నప్పటికీ

.

నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నిజమే! ఇప్పటికీ

నువ్వు నాకొక సుందరతర తరళ తేజస్సువే.

అయినా, నేను ఇంకా నేనుగానే మిగిలి ఉన్నాను

వెలుగులో హరించిన వెలుగునౌ కోర్కె ఉన్నప్పటికీ

.

ఓహ్! నన్ను నీ ప్రేమతో ముంచెత్తు —

నీ ప్రేమ జడిలో కొట్టుకుపోయి,

సుడిగాలికి కొండెక్కిన దీపకళికలా,

నాచేతన సమస్తమూ సమయించి,

నన్నొక బధిరాంధగా మిగిలిపోనీ!

.

సారా టీజ్డేల్

.

I Am Not Yours

.

I am not yours, not lost in you,
Not lost, although I long to be
Lost as a candle lit at noon,
Lost as a snowflake in the sea.

You love me, and I find you still
A spirit beautiful and bright,
Yet I am I, who long to be
Lost as a light is lost in light.

Oh plunge me deep in love — put out
My senses, leave me deaf and blind,
Swept by the tempest of your love,
A taper in a rushing wind.

Sarah Teasdale

నేను ఖాతరు చెయ్యను … సారా టీజ్డేల్

Image Courtesy: http://alanbauer.com

.

నేను మరణించిన పిదప, వానలోతడిసిన తరుల కురులను

ఏప్రిలునెల విదిలించే వేళ, నువ్వు నా సమాధిమీద

గుండెలు పగిలి శోకిస్తే శోకింతువు గాక!

నేనేం ఖాతరు చెయ్యను.

.

జడివాన తరుశాఖలను అవనతం చేసినపుడు,

పత్రాతపత్రపాదపాల ప్రశాంతత నేనవధరిస్తాను.

నువ్విప్పుడెంత మౌనంగా, నిర్దయగా ఉన్నావో

అంతకంటే మౌనంగా, నిర్దాక్షిణ్యంగా ఉంటాను.

.

నేను అమితంగా ప్రేమిస్తాను.

పరవళ్ళుతొక్కుతూ, వార్నిధిని కాంక్షించే నదిని నేను.

నేనొక ఉదార వితరణశీలిని.

ప్రేమ నన్ను త్రాగేందుకు వొదగ లేదు.

.

వర్ష, తుషార, ఛాయలు,  ఛాయామాత్రంగానైనా లేని

మరుభూములంట అతని పాదాలు తిరుగాడుతాయి,

సాంద్రనీలగగనం నుండి రిక్కలు

తమ చురుకైన చూపులతో తేరిపారి చూస్తుంటాయి.

.

నిశాభ్యంతరవేళ, నడువలేక నడువలేక,

అవధిమీరిన దాహార్తిని అనునయించడానికి

కోరికతో అతను దిగక తప్పదు

వహ్నివర్ణముగల నిలిచిన నీటియందు.

.

సారా టీజ్డేల్

.

I Shall Not Care

.

When I am dead and over me bright April

Shakes out her rain-drenched hair,

Tho’ you should lean above me broken-hearted,

I shall not care

.

I shall have peace, as leafy trees are peaceful

When rain bends down the bough,

And I shall be more silent and cold-hearted

Than you are now

.

I love too much; I am a river,

Surging with spring that seeks the sea.

I am too generous a giver

Love will not stoop to drink of me

.

His feet will turn to desert places

Shadowless, reft of rain and dew,

Where stars stare down with sharpened faces,

From heavens pitilessly blue

.

And there at midnight sick with faring,

He will stoop down in his desire

To slake the thirst grown past all bearing

In stagnant water keen as fire.

.

Sarah Teasdale

%d bloggers like this: