Tag: నిమజ్జనం
-
మృతనగరి… Shernaz Wadia
ఆ మృతనగరిలో నదులు రక్తరంజితాలై ప్రవహించేయి. తునకలైన పుర్రెలు, మాడిపోయిన ఎముకల గుట్టల క్రింద ప్రేతాత్మలు మంటల్లో లుంగలుచుట్టుకుంటున్నాయి. దీనంగా మూలుగుతూ, అరుస్తూ అవి నా త్రోవలోకి జరజరా ప్రాకి ఆలశ్యంగా కలిగిన పశ్చాత్తాపంతో గద్గదంగా బుసలుకొట్టేయి… నువ్వు నీ మర్త్యలోకంలోకి తిరిగె వెళ్ళినపుడు మా మాటలుగా వాళ్ళకీ కబురందించు… ద్వేషానికీ- హింసకీ ప్రతినిధులుగా నిలిచిన మేము మేం చేసిన ఘోరనేరాల అగ్నికీలల్లో శాశ్వతంగా వ్రేలేలా శాఫగ్రస్తులమైనాము. కనుక మీరు మీ పంథాలు మార్చుకోవలసిందే… మీ విద్వేషాలని […]