-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం తృతీయాంకం 3 వ భాగం
తృతీయాంకం దృశ్యం 3 మరువీచి – దర్బారు ప్రముఖులు- త్రిభుల [పెన్న మినహా మిగతా దర్బారు ప్రముఖులంతా లోనకి వస్తారు. అతను ద్వారబంధం దగ్గర కాపలా కాస్తుంటాడు.] మరువీచి: (తలుపువైపు వేలు చూపిస్తూ) గొర్రెపిల్ల ఆశ్రయంకోసం సింహం గుహలోకి దూరింది. పార్థివన్: పాపం, త్రిభుల! పెన్న: (లోపలికి వస్తూ) హుష్! నిశ్శబ్దం! అతను వస్తున్నాడు. అందరికీ ఇదే హెచ్చరిక. ఏమీ ఎరగనట్టు ఎవరి పని వారు చేసుకుంటూ పొండి. మరు: అతను నాతో తప్ప ఎవరితోనూ మాటాడలేడు. …
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం తృతీయాంకం 2 వ భాగం
తృతీయాంకం దృశ్యం 2 రాజు- బాహుదా రా: (బాహుదా ముసుగు తొలగిస్తూ) బాహుదా! బా: (ఆనందం, ఆశ్చర్యంతో) ఓహ్! భగవంతుడా! మధుపాయి! రా: (పట్టరాని నవ్వుతో) నా మీద ఒట్టు! కాకతాళీయం అనుకున్నా, ముందుగావేసుకున్న పధకం అనుకున్నా సరే! లాభం మట్టుకు నాకే! ఓ! బాహుదా! ప్రియా! హృదయేశ్వరీ! ఏదీ, రా! నాచేతులలోకి రా! బా: (లేవబోతూ, మళ్ళీ కూర్చుంటుంది) ప్రభువులు నన్ను మన్నించాలి! నిజానికి నాకు ఏం మాట్లాడాలో తెలియడంలేదు. మధుపాయి! కాదుకాదు, ఇప్పుడు దయగల…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం తృతీయాంకం 1 వ భాగం
తృతీయాంకం దృశ్యం 1 రాజు [ రాజప్రాసాదంలో ముందరి గదులు. రినైజాన్సు కాలం నాటి అభిరుచులకు అనుగుణంగా లోపలి అలంకరణలు ఉంటాయి. రంగస్థలం ముందుభాగంలో ఒక మేజాబల్ల, ఒక కుర్చీ, ఒక స్టూలు, వెనుక భాగంలో తళతళలతో ఒక పెద్ద తలుపు ఉంటాయి. అందంగా వ్రేలాడుతున్న తెరలతో ఎడమవైపుగా రాజుగారి శయన మందిరం. కుడిప్రక్క పింగాణీ పాత్రలు ఉంచుకునే సైడు బోర్డు. వెనుకనున్న తలుపు డాబామీదకు తెరవబడి ఉంటుంది. దర్బారు ప్రముఖుల ప్రవేశం] గద్దే: ఈ సాహస…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 5 వ భాగం
ద్వితీయాంకం దృశ్యం 5 [బాహుదా, దర్బారు ప్రనుఖులు, కొంతసేపు పోయిన తర్వాత త్రిభుల. బాహుదా డాబా మీదకు వచ్చును. ఆమె ఇంటికి ఆవలిముఖంగా ఉంటుంది. చేతిలో ఒక దివిటీ ఉంటుంది. దాని వెలుగు ఆమె ముఖంపై పడుతూంటుంది.] బాహుదా: మధుపాయి! ఆహా! ఎంత తియ్యనైన పేరు! నా మనోఫలకంపై శాశ్వతంగా ముద్రించబడుతుంది. (ఇంటి బయట) పెన్న: (తక్కిన వారుతో) సాత్త్వికులారా! అ.. త.. ను కాదు…. ఆమె! గద్దే: ఎవరో మధ్యతరగతి సుందరి. … (ఆమెను సంభోదిస్తున్నట్టూగా)…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 4 వ భాగం
ద్వితీయాంకం దృశ్యం 4 బాహుదా, భద్రద, రాజు [ ఈ దృశ్యంలో రాజు చాలసేపటివరకు చెట్టు వెనకే దాగి ఉంటాడు] బాహుదా: నాకెందుకో నేరం చేసిన భావన కలుగుతోంది. భద్రద: ఏం? ఎందుకని? ఏమిచేసావని? బా: నా తండ్రి ప్రతి చిన్న విషయానికీ తల్లడిల్లిపోతుంటాడు. చిన్న నీడను చూసినా ఎంత జడుసుకుంటున్నారో చూస్తున్నావు గదా! అతను వెళుతున్నప్పుడు చూసావు కదా, కళ్ళు ఎంత ఆర్ద్రమైపోయాయో! అంత కరుణాళువైన నా తండ్రికి –ఆ కుర్ర వాడి గురించి, అదే,…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 3 వ భాగం
అంకం 2 దృశ్యం 3 (త్రిభుల, బాహుదా, కొంత సమయం గడిచిన తర్వాత భద్రద) త్రి: తల్లీ! (ఆమెను గుండెకు అదుముకుంటాడు… ఆనందాతిరేకంతో) ఏవీ! నీ చేతులు నా మెడచుట్టూ వెయ్యి. దగ్గరగా రా తల్లీ! అబ్బ! ఈరోజు ఎంత ఆనందంగా ఉంది. నీ దగ్గర అంతా ఆనందమే! నాకు మళ్ళీ ప్రాణం లేచి వచ్చినట్లుంది. (త్రిభుల ఆమెను తదేకంగా చూస్తుంటాడు) రోజురోజుకీ నీ అందం ద్విగుణీకృతం అవుతోంది బాహుదా! అంతా బాగుంది కదా! నీకు ఏ కష్టం…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 2 వ భాగం
ద్వితీయాంకం దృశ్యం 2 త్రిభుల (ఏకాంతంలో) [సుల్తాన్ కనుమరుగవనిచ్చి, ప్రహారీ గోడ తలుపు నెమ్మదిగా తెరుస్తాడు. ఆదుర్దాతో నాలుగు దిక్కులూ పరిశీలించి, కప్పనుండి తాళం తొందరగా తీసి, లోపలికి వెళ్ళి మళ్ళీతాళం వేసుకుంటాడు. విచారవదనంతో అన్యమనస్కుడై అడుగులు వేస్తుంటాడు] ఆ ముదుసలి నన్ను శపించాడు. అతను మాటలాడుతున్నప్పుడు కూడా నేను అతన్ని అనుకరించి అవహేళన చేశాను. పాపం శమించుగాక! నా పెదాలే నవ్వాయి. అతని విషాదం నా గుండెను తాకింది. నిజంగా శాపగ్రస్తుడే. (నాపరాయి పలక మీద…
-
రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం, 1వ భాగం
ద్వితీయాంకం దృశ్యం 1 [ బుస్సీ గారి భవంతి. ఎక్కడా జనసంచారం కనిపించదు. ఆ భవంతికి కుడిప్రక్కగా చూడచక్కని ఒక ఇల్లు. పెద్ద ప్రహారీ గోడ. ముందు విశాలమైన ఖాళీ స్థలం. ఖాళీ స్థలంలో రకరకాల వృక్షాలు. కూర్చునేందుకు ఒక నాపరాయి పలక. ప్రహారీ గోడకు వీధిలోకి తెరుచుకుంటూ తలుపు. ప్రహారీ గోడమీదనుండి డాబా- క్రింద అందమైన “ఆర్చ్”లు. మేదమీద గదినుండి డాబా మీదకు తెరురుచుకున్న తలుపు. డాబా నుండి క్రిందకు ఒక ప్రక్కగా మెట్లు. బుస్సీగారి…
-
రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 5వ భాగం
(రంగస్థలి రెండు భాగాలుగా విడివడి “తెర వెనుక” జరిగే విషయాలన్నీ ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. ) ప్రథమాంకము దృశ్యం 5 (రాజు, త్రిభుల, కాశ్యప, వేలరీ, తదితరులు) వేలరీ: నామాట వినవలసిందే! నన్ను వద్దని శాసించే వారెవ్వరు? రాజు: ( తేరుకుని) ఓహ్! మీరా, వేలరీ! వే: అవును, నేనే! (రాజు కోపంతో అతని మీదకు వెళ్లబోతుండగా త్రిభుల అడ్డుకుంటాడు) త్రి: ప్రభూ! అతనితో సంభాషించడానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి. (నాటక ఫక్కీలో నిల్చుని వేలరీతో) స్వామీ! ఒకప్పుడు తమరే…
-
రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 4 వ భాగం
ప్రథమాంకము దృశ్యం 4 [ఫ్రాన్సిస్, త్రిభుల ప్రవేశం) త్రి: రాజసభకు మేధావులా? ఇంతకంటే దారుణం ఇంకెక్కడా ఉండదు. ఫ్రా: అయితే పోయి చెప్పుకో. మా సోదరి సలహా మండలిని మేధావులతో నింపాలని యోచిస్తున్నది. త్రి: ఇది మనలో మన మాట. నేను మీ కంటే తక్కువ తాగేనని ఒప్పుకుంటారు గదా. కాబట్టి మనిద్దరిలో నాకు ఈ విషయం అన్ని కోణాలూ, రూపాలూ, వర్ణాలూ చర్చించి, నిర్ణయించే అధికారం ఉంది. నాకు ఒక ఆధిక్యత ఉంది. అట్టే మాటాడితే…