వర్గం: అనువాదాలు
-
రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం, 1వ భాగం
ద్వితీయాంకం దృశ్యం 1 [ బుస్సీ గారి భవంతి. ఎక్కడా జనసంచారం కనిపించదు. ఆ భవంతికి కుడిప్రక్కగా చూడచక్కని ఒక ఇల్లు. పెద్ద ప్రహారీ గోడ. ముందు విశాలమైన ఖాళీ స్థలం. ఖాళీ స్థలంలో రకరకాల వృక్షాలు. కూర్చునేందుకు ఒక నాపరాయి పలక. ప్రహారీ గోడకు వీధిలోకి తెరుచుకుంటూ తలుపు. ప్రహారీ గోడమీదనుండి డాబా- క్రింద అందమైన “ఆర్చ్”లు. మేదమీద గదినుండి డాబా మీదకు తెరురుచుకున్న తలుపు. డాబా నుండి క్రిందకు ఒక ప్రక్కగా మెట్లు. బుస్సీగారి…
-
రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 5వ భాగం
(రంగస్థలి రెండు భాగాలుగా విడివడి “తెర వెనుక” జరిగే విషయాలన్నీ ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. ) ప్రథమాంకము దృశ్యం 5 (రాజు, త్రిభుల, కాశ్యప, వేలరీ, తదితరులు) వేలరీ: నామాట వినవలసిందే! నన్ను వద్దని శాసించే వారెవ్వరు? రాజు: ( తేరుకుని) ఓహ్! మీరా, వేలరీ! వే: అవును, నేనే! (రాజు కోపంతో అతని మీదకు వెళ్లబోతుండగా త్రిభుల అడ్డుకుంటాడు) త్రి: ప్రభూ! అతనితో సంభాషించడానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి. (నాటక ఫక్కీలో నిల్చుని వేలరీతో) స్వామీ! ఒకప్పుడు తమరే…
-
రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 4 వ భాగం
ప్రథమాంకము దృశ్యం 4 [ఫ్రాన్సిస్, త్రిభుల ప్రవేశం) త్రి: రాజసభకు మేధావులా? ఇంతకంటే దారుణం ఇంకెక్కడా ఉండదు. ఫ్రా: అయితే పోయి చెప్పుకో. మా సోదరి సలహా మండలిని మేధావులతో నింపాలని యోచిస్తున్నది. త్రి: ఇది మనలో మన మాట. నేను మీ కంటే తక్కువ తాగేనని ఒప్పుకుంటారు గదా. కాబట్టి మనిద్దరిలో నాకు ఈ విషయం అన్ని కోణాలూ, రూపాలూ, వర్ణాలూ చర్చించి, నిర్ణయించే అధికారం ఉంది. నాకు ఒక ఆధిక్యత ఉంది. అట్టే మాటాడితే…
-
రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 3 వ భాగం
ప్రథమాంకం దృశ్యం 3 (ముందుగా గద్దే, పార్థివన్, విస్సు, మరువీచి ప్రవేశిస్తారు. తర్వాత నెమ్మదిగా పెన్న, కాశ్యప ప్రవేసిస్తారు. ఒకరికొకరు అభివాదం చేసుకుంటారు) పెన్న: ఉదాత్త మిత్రవర్యులారా!మీకొక కొత్త విషయం చెప్పబోతున్నాను. లేదు. ముందుగా మీ మేధాశక్తికి పరీక్ష. మీకొక చిక్కు ప్రశ్న. మీరే ఊహించండి. అనూహ్యమూ, అద్భుతమూ, ఐన ఒక ప్రేమ కథ. తల్చుకుంటే నవ్వొస్తుంది. జరగడానికి అవకాశంలేనిది…. గద్దే: ( కుతూహలం ఆపుకోలేక) ఏమిటది? మరువీచి: తమకేమి కావాలో? పెన్న: మరువీచీ! నే చెబుతున్నా…
-
రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 2 వ భాగం
ప్రథమాంకము — దృశ్యం 2 [ఫ్రాన్సిస్, త్రిభుల, గద్దే, ఇతర ప్రముఖులు ప్రవేశం. అందరూ చక్కని ఆహార్యంలో ఉంటారు. త్రిభుల మాత్రం విదూషకుడి వేషధారణలో. ఫ్రాన్సిస్ అక్కడున్న స్త్రీలను మెచ్చుకోడానికి వెళుతుంటాడు.] లాతూరు: శ్రీమతి ఇందిర ఈరోజు దేవకాంతల్ని సైతం మైమరపిస్తోంది. గద్దే: నాకు అర్బుద, వినీల జంట నక్షత్రాల్లా కనిపిస్తున్నారు. ఫ్రాన్సిస్: కానీ, శ్రీమతి కాశ్యప ముగ్గుర్నీ తలదన్నేట్టుగా ఉంది. గ: (శ్రీ కాశ్యపను చూపిస్తూ- అతను ఫ్రాన్సులోని నలుగురు మహాకాయులలో ఒకడని గుర్తుచేస్తూ) కాస్త…
-
రాస లీల (The King Amuses Himself ) — Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ప్రథమాంకం 1 వ భాగం
ఉపోద్ఘాతం: 19 వ శతాబ్దపు ఉత్తమ కవి, నవలాకారుడు, నాటక రచయితలలో ఫ్రాన్సుకు చెందిన విక్టర్ హ్యూగో ఒకరు. అలెగ్జాండరు డ్యూమాస్ కు సమకాలికుడైన హ్యూగో, తన 16వ ఏటనే అన్నదమ్ములతో రచనలు ప్రారంభించి, ప్రాన్సులో “రొమాంటిక్ మూవ్ మెంట్ ” కు నాయకత్వం వహించేడు. మొదటి ప్రదర్శనలోనే హంసపాదు ఎదుర్కొన్న ఈ నాటకం, మలి ప్రదర్శనకు నోచుకోలేదు. కాని అచ్చులో ఈ నాటకం బాగా విజయవంతమయింది. ఇది నిజ సంఘటనలు ఆధారంగా చేసుకుని వ్రాయలేదని చెప్పినా, ఇందులో రాచరికపు వ్యవస్థలో జరిగే అకృత్యాలు కళ్ళకు కట్టినట్టు చూపించడంతో దీన్ని పూర్తిగా బహిష్కరించడమే గాక, అతనుకూడా 20 సంవత్సరాలపాటు దేశ బహిష్క్రుతుడయ్యాడు. ఈ సమయం లోనే అతని అత్యున్నత మైన రచనలు వచ్చాయి. ( please visit https://en.wikipedia.org/wiki/Le_roi_s’amuse) ఈ నాటకంలో ప్రత్యేకత ఇందులోని…
-
నీ జ్ఞాపకాలు…Shernaz Wadia, Indian Poet
ఇక నుండీ నన్ను వివశను చేసే నీ చిరునవ్వూ, చూడు, అలా నవ్వితే చిన్నగా సొట్టలు పడే నీ బుగ్గలూ, బుంగ మూతీ, కనుమరుగే కదా! చుట్టూ ఉన్న రణగొణధ్వనిని కూడా ఛేదించుకుని, రహస్యంగా నా చెవుల్లో నెమ్మదిగా ఊసులాడి నా ఏకాంతపు విషాదాశ్రువులు తుడిచి నన్నూరడించే నీ కమనీయ కంఠధ్వని, ఉహూ, ఇక ఎన్నటికీ దొరకదు కదా!! ఇంద్రజాలం చేసే నీ కర స్పర్శ అందనంతదూరమైనా, నీ లాలనలో ఎంత మహిమ ఉందంటే, చిత్రంగా నా…
-
కృతజ్ఞతా భావన … Shernaz Wadia, Indian Poet
ఆ మాట ఇంకా ప్రచారంలోకి రాక ముందే ఆ అద్వితీయ భావనని మాలోకి చొప్పించారు మీరు. తనముక్కు చాలాపొడుగ్గా ఉందని ఒకరు విచారిస్తుంటే మీరన్నారు: “నయం!అదింకా వాసనలు పసిగట్టగలుగుతోంది. కుష్టురోగం అక్కడఒక ఒక గొయ్యి మిగులుస్తుంది తెలుసా?” అని. తన పాదాలు అందంగాలేవని మరొకరు తపిస్తుంటే, మీరు అభిశంసించేరు: “సంతోషించు! నీ కాళ్ళమీద నువ్వు నిలబడగలుగుతున్నందుకు. ఒక వేలు పోగొట్టుకున్నవాళ్ళని అడిగిచూడు దాని అవసరమెంతో తెలుస్తుంది.” మూడవది తనగొంతులో కోకిలారవాలు పలకడంలేదని తపిస్తుంటే, మీరు ఆదేశించారు :…
-
ఆప్త మిత్రుడికి… Shernaz Wadia, Indian Poet
మిత్రమా! తీరని ఈహల నిర్జీవ హృదయాన్ని నీ కిచ్చాను. లలితజీవన చుంబనాన్ని దానిపై నువ్వు ప్రసరించావు. ఇపుడది కొంగ్రొత్త జవంతో కేరింతలు కొడుతోంది. ఆప్తుడా! తప్త కాంక్షల చితా భస్మాన్ని నీకిచ్చాను. దాన్ని నీ ప్రేమ పేటికలో భద్రపరిచావు. ఇపుడది పునరుజ్జీవనంతో కళకళలాడుతోంది. నేస్తమా! పీటముడులుపడిపోయిన ఆలోచనల పోగులను నీ ముందుంచాను. అవిఛ్ఛిన్న ప్రశాంతతతో చిక్కులు విప్పి నాకు సాంత్వన నందించావు. సహచరుడా! రసహీనమైన నా జీవితాన్ని నీ ముందు పరిచాను. దయార్ద్రహృదయంతో దానికి ప్రేమలేపనం పూసావు.…
-
చిరు దివ్వె … Shernaz Wadia
దివాకరుడు రోజును వెలిగించినంత దేదీప్యంగా నువ్వు నా జీవితాన్ని వెలిగించలేక పోవచ్చు కానీ, చిరుదివ్వెలా ఒక కాంతిపుంజాన్ని విరజిమ్మి మనసుని అలముకొన్న విషాదకరమైన వెలితిని పటాపంచలు చేశావు. ధ్రువనక్షత్రంలా అచంచలమైన నీ అనునయ సన్నిధి ఎల్ల వేళలా నా తప్పటడుగులని సరిదిద్దుతూ నే పోగొట్టుకున్న నా వ్యక్తిత్వం వైపు నన్ను మరలిస్తూనే ఉంది. నీ తీయందనపు వెలుగులు నాలో నిబిడమైన శక్తిని వెలికితీసి ఎ బంధనాలూ, బంధాలూ లేకుండానే స్నేహమనే అస్వతంత్ర స్వతంత్రంతో నన్ను…