వర్గం: అనువాదాలు
-
నితాంత ప్రేమ…Shernaz Wadia
తమ యుగళనృత్యపుహేలతో ఒక అపూర్వమైన జాడను విడిచివెళ్ళారు వారు ఆ త్రోవ విపరీత భావనల సమ్మేళనం సంతోషం / సంతాపం, ఆవేదన / ఆనందం నవ్వూ / కన్నీరూ, అన్యోన్యత / గౌరవం… వినీల ప్రేమాకాశంలో వింతవన్నెలరంగుల ఉల్కాపాతం విధి వాళ్ళ అద్భుతగాథను కాలాతీతం చేసింది… ఉంచిందామె చేతిలో ఒక పరాయి చెయ్యి “తప్పదు” అందామె. ఏకాకిగా నిలబడిపోయాడతడు అంతుచిక్కని అగాథంలోకి తొంగి చూస్తూ… కళ్ళుమూసుకుని పిడికిలిబిగించి ఒక్కసారి ఎగిరేడు రెక్కలు తొడుగుకుని, విశ్వాసపు వీచికలమీద రెక్కలార్చుకుంటూ… ఆశగా…
-
అసంగత ఆకాంక్షలు… Shernaz Wadia
ఈ అనువాదం చదివిన తర్వాత ఇంతకంటే బాగా చెయ్యొచ్చునని మీలో కొందరికైనా అనిపించకపోదు. అప్పుడు మూలం కోసం వెతక నక్కర లేకుండా ఇక్కడ పొందుపరుస్తున్నాను: శాపగ్రస్తుడనై, అచేతనంగా, దిక్కుతోచక నాతీరంలో నేనుంటూనే దిశాంత తీరాల నపేక్షిస్తుంటాను ఆదరి చేర్చగల సరంగు రాకకై నిరీక్షిస్తూ… రికామీగా, అశక్తుడనై, తప్పటడుగులేస్తూ, నేలమీద తడబడుతున్నా, నేను ఊహలస్వర్గంకోసం ఉవ్విళ్ళూరుతుంటాను నన్నటకు చేర్చగల ఐంద్రజాలికుడికై ఎదురుచూస్తూ… నైరాశ్యంతో, జీవితంతో రాజీపడి, ధైర్యం కోల్పోయి, ఆనవాళ్ళు లేని శవాకృతిగా మిగిలిన నేను మితిలేని ప్రశంసలకు…
-
దీప కళిక… రబీంద్రనాద్ టాగోర్
బెంగాలీ మూలం: కే లేబే మోర్ కార్జ్ , కహే సంధ్యా రబి, సునియా జగత్ రహే నిరుత్తర్ ఛబి మాటేర్ ప్రదీప్ ఛిలో సే కహిలో స్వామీ అమార్ జేటుకు సాధ్య కరిబో తా అమి రబీంద్రనాద్ టాగోర్ Who shall take my charge asked the setting sun, suddenly, the world went pale and heard it spell-bound then a small lamp ventured forward, my lord!…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 4 వ భాగం
పంచమాంకం దృశ్యం 4 త్రిభుల – బాహుదా (ఒక్క మెరుపు మెరుస్తుంది. ఒక్క పిచ్చికేకతో కొయ్యబారిపోతాడు త్రిభుల) త్రీ: ఓరి భగవంతుడా! ఇది నా బిడ్డా! ఏమిటిది? నాచేతులకు రక్తం అంటుకుంది? నా కూతురు. నా తల తిరుగుతోంది. క్రూరమైన కల ఏదో నా జ్ఞానేంద్రియాలను వశపరచుకుంది. ఇది అసంభవం! ఇంతసేపూ నాతో ఇక్కడే ఉంది. భగవంతుడా! కనికరించు! ఇది ఆమె అయి ఉండదు. ఆమే అయితే నాకు నిజంగా పిచ్చెక్కిపోతుంది. (మరొక్కసారి మెరుపు మెరుస్తుంది) అమ్మో!…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 3 వ భాగం
పంచమాంకం దృశ్యం 3 (ఒంటరిగా త్రిభుల. అతని దృష్టి అంతా సంచీమీద కేంద్రీకృతమై ఉంటుంది.) త్రి: అతనిక్కడ చచ్చి పడి ఉన్నాడు. నేనే గనక అతని ముఖాన్ని చూడగలిగితే ఎంతబాగుండును! (సంచిని మరోసారి పరీక్షిస్తాడు) సందేహం లేదు. అతనే! ఇవి అతని కాలి జోళ్ళు. వాటిని వేగిర పరచడానికి కొట్టిన నాడాలు ఇవి. అనుమానమక్కరలేదు. అతనే!) (త్రిభుల లేచి నుంచుని ఒక కాలు సంచీమీద ఉంచుతాడు) బుర్రతిరుగుడు ప్రపంచమా! ఇప్పుడు, ఇప్పుడు తిలకించు! ఇక్కడ విదూషకుడు! అక్కడ మహా…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 2 వ భాగం
పంచమాంకం దృశ్యం 2 త్రిభుల- సుల్తాన్ సుల్తాన్: చాలా బరువుగా ఉంది. ఏదీ? ఒక చెయ్యి వెయ్యి! ఇందులోనే నీ మనిషి చచ్చిపడి ఉన్నాడు. త్రి: అతని ముఖాన్నొకసారి చూస్తాను. ఏదీ? ఒకసారి దీపం తీసుకురా! సు: అయ్య బాబోయ్! లాభం లేదు. త్రి: ఏమిటీ? హత్య చెయ్యగలవు గాని, హతుడి ముఖమ్మీద మృత్యువును చూడడానికి భయమా? సు: నేను భయపడేది అందుకు కాదు. రాత్రి పహరా కాసే వాళ్ళకు. నేను మాత్రం దీపం ఇయ్యను. అయినా,…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 1 వ భాగం
పంచమాంకం త్రిభుల దృశ్యం 1 [సుల్తాన్ ఇంటితలుపు పూర్తిగా మూసి ఉంచడం, లోపల ఎక్కడా దీపాలు వెలగక పోవడం మినహా, రంగాలంకరణలో ఏ మార్పూ లేక రంగస్థలి నాల్గవ అంకం మాదిరిగానే ఉంటుంది. త్రిభుల రంగస్థలి వెనుక నుండి ముసుగు కప్పుకుని ప్రవేశిస్తాడు. గాలివాన భీభత్సం తగ్గు ముఖం పడుతుంది. వర్షం కొంతసేపటిలో పూర్తిగా ఆగిపోతుంది కూడా. అయినా దూరం నుండి మెరుపులు మెరవడం కనిపిస్తూంటుంది. ఉరుములు ఇంకా ఉరుముతూనే ఉంటాయి…] త్రి: ఇప్పుడు విజయం నాది. ఒక…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 5 వ భాగం
చతుర్థాంకం దృశ్యం 5 [రాజు నిద్రిస్తుంటూ మేడమీది గదిలో; సుల్తాన్ మొగలి క్రింద గదిలో; బాహుదా బయట] బాహుదా: (చీకటిలో నెమ్మదిగా మెరుపుల ఆసరాతో నడుస్తుంటుంది. మహా ప్రమాదకరమైన ప్రయత్నం. నాకుగాని వివేకము తప్పడం లేదు గదా! ప్రకృతికన్న బలీయమైన శక్తి ఏదో నన్ను ప్రేరేపిస్తోంది. అతను ఈ ఇంటిలోనే ఎక్కడో నిద్రిస్తుంటాడు. నాన్నా, క్షమించు! నీ ఆజ్ఞని ఉల్లంఘించి వచ్చినందుకు మన్నించు. నా హృదయాన్ని చీలుస్తున్న సందేహాన్ని అణుచుకోగల శక్తి నాకు లేదు. ఇన్ని సంవత్సరాలూ,…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 4 వ భాగం
చతుర్థాంకం దృశ్యం 4 [రాజు, సుల్తాన్, మొగలి] సుల్తాన్: [బయట ఒంటరిగా ఆకాశంలోకి చూస్తుంటాడు. మెల్లి మెల్లిగా మేఘాలు దట్టంగా కమ్ముకోవడం ప్రారంభిస్తుంటాయి. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోతుంది. మెరుపులు బాగా మెరుస్తుంటాయి. దూరాన్నుండి ఉరుములు వినిపిస్తుంటాయి] ఇంక కాసేపట్లో ఈ ప్రదేశం శ్మశానంలా నిర్మానుష్యమైపోతుంది. ఇదొక చిత్రమైన వ్యవహారం. నాకు ఇదేమీ అర్థం కావటంలేదు. (రాజును చూపిస్తూ) మనకు తెలియనిది ఏదో ఈ మనుషులని ఆవహించి ఉంది. (ఆకాశాన్ని మరోసారి పరీక్షిస్తాడు. ఆ సమయంలో రాజు…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 3 వ భాగం
చతుర్థాంకం దృశ్యం 3 [త్రిభుల, సుల్తాన్ బయట; రాజు మొగలి లోపల] త్రి: (బంగారు నాణేలు సుల్తాన్ కి ఒక్కొక్కటీ లెక్కబెడుతూ) నువ్వు ఇరవై అడిగేవు. ప్రస్తుతానికి ఇవిగో పది. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాడంటావా? (నాణేలు ఇవ్వబోతూ ఆగిపోతాడు) సు: (ఆకాశాన్ని పరీక్షిస్తూ) మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇంకో గంటలో గాలీ వానా వచ్చి అతన్ని ఈ రాత్రికి ఇక్కడే ఉంచేటట్టయితే, మా మొగలికి అవి సహాయం చేస్తాయి. త్రి: అలా అయితే నేను అర్థరాత్రికి వస్తాను.…