వర్గం: అనువాదాలు
-
నిరాశా గీతం – part 2 Neruda
ఓ శిధిలావశేషాల రాశీ! అన్నీ నీలోలయించాయి. నువ్వు ప్రకటించని విషాదం ఏది, నువ్వు మునక వెయ్యని విషాదం ఏది! ఓడముందు నిలబడి, నావికునిలా ఉత్తుంగ తరంగాలపైనుండి నువ్వు పిలుస్తూ ఆలపిస్తున్నావు. నువ్వు గీతాల్లో ఇంకా వికసిస్తూనే ఉన్నావు, కెరటాల్ని అదుముతూనే ఉన్నావు, ఓ శిధిలావశేషాల రాశీ! నువ్వొక గట్టులేని క్షారజల కూపానివి. పాలిపోయిన శీఘ్ర చోదకుడూ, అదృష్టంలేని వడిశల వేటగాడూ, దారితప్పిన శోధకుడూ, అందరూ నీలో లయించారు. ఇది ఇక నిష్క్రమించవలసిన సమయం, రాత్రి ప్రతి ఝాముకీ…
-
నిరాశా గీతం … Part 1 Neruda
. రాత్రయేసరికి నీ జ్ఞాపకం నన్ను చుట్టుముడుతుంది. నది తన అదుపులేని దుఃఖాన్నిసముద్రంతో కలబోసుకుంటుంది. అరుణోదయంతోనే తెరమరుగయే కాంతివిహీనమైన తారకల్లా ఓ నా విరహిణీ! ఇది ఇక విడిపోవలసిన తరుణం. నా హృదయం మీద గడ్డిపూలు వర్షిస్తున్నాయి. ఓహ్, శిధిల శకలాల గుట్ట, భీతావహమైన ఓడ మునక. నీలో సంగ్రామాలూ, తిరోగమనాలూ లయించాయి. నీలోంచే పిట్టల కిలకిలలు రెక్కలు తొడుక్కున్నాయి. అన్నిటినీ నువ్వు కబళించేవు, దూరంలా, సముద్రంలా, కాలంలా. అన్నీ నీలో మునిగిపోయాయి. ఇది చుంబనలతో దాడి…
-
కుక్క చచ్చిపోయింది— Neruda
. నా కుక్క చచ్చిపోయింది. దాన్ని నా పెరట్లో పాతిపెట్టాను. తుప్పుపట్టిన పాత మెషీను పక్కగా. ఏదో రోజు నేను కూడా అక్కడే దాని పక్కన చేరుతాను, ఇప్పటికి మాత్రం దాని బొచ్చుతో, దాని అవలక్షణాలతో, దాని జలుబుతో అది పోయింది, నాస్తికుణ్ణయిన నేను ఎన్నడూ మనిషికి ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో స్వర్గం ఉందంటే నమ్మలేదు, నాకు తెలుసు నేను స్వర్గంలో మాత్రం ఎప్పుడూ అడుగు పెట్టను. కాని, నేను కుక్కలకి స్వర్గం ఉందంటే నమ్ముతాను… అక్కడ అది…
-
అత్యంత విషాద గీతం… Neruda
. అత్యంత విషాద గీతం . ఈ రాత్రి నే నత్యంత విషాదగీతం రాయగలను. ఉదాహరణకి “రాత్రి నక్షత్రాలతో నిండి ఉంది. ఆ నీలి నక్షత్రాలు దూరం నుండి మినుకు మినుకు మంటున్నాయి” అని రాయగలను. రాత్రి రొజ్జగాలి గింగిరాలు తిరుగుతూ పాడుతోంది. ఈ రాత్రి నేను అత్యంత విషాదగీతం రాయగలను. నేనామెను ప్రేమించాను. ఆమెకూడా నన్ను కొన్నిసార్లు ప్రేమించింది. ఇలాంటిరాత్రిళ్లలోనే, నేనామెను నా కౌగిలిలోకి తీసుకున్నాను. అనంతాకాశం క్రింద ఆమెను లెక్కలేనన్నిసార్లు ముద్దుపెట్టుకున్నాను. ఆమె నను ప్రేమించింది.…
-
Ah! … Sri Sri
. Spitting fire When I rocket up into the sky, Wonder struck are ….they! . Spewing out blood When I plummet to earth Mercilessly… they The very … they! . ఆహ్ ! , నిప్పులు చిమ్ముతూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు. . నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే! … శ్రీ శ్రీ
-
కాంక్ష… వేదుల 1
. I for once got this life of a flower just a day-long span; scent-emanating graces, and enduring redolent charms thereon, be it so for trice, or half thereof, regret not, then deep within, there shoots up a virgin desire in the wake of a warm summer morn. . ఈ సుమజన్మ మెట్లొ ఘటియిల్లెను నా కొకనాటిపాటిదై…
-
నువ్వు నన్ను మరిచిపోతే Neruda
. నాకో విషయం తెలుసుకోవాలనుంది. . అది నీకు తెలిసినదే! నేను పూర్ణచంద్రుణ్ణి చూసినా శిశిరఋతు ఆగమనంలో నా గది కిటికీ నానుకున్న అరుణతీవెను చూసినా, చలికాగుతున్నప్పుడు స్పర్శకందని నివురును తాకినా, వంకరలుపోయిన కట్టెని ముట్టుకున్నా ఆలోచనలన్నీ నీవైపే లాక్కెళుతుంటాయి, అక్కడికి సృష్టిలోని సుగంధాలూ, వెలివెలుగులూ, లోహాలూ నీ ద్వీపాలకి పయనమయే చిరు పడవలై, నాకోసమే నిరీక్షిస్తున్నట్టు సరే, ఇప్పుడు నువ్వు నెమ్మది నెమ్మదిగా నన్ను ప్రేమించడం మానేస్తే, నేనుకూడా నిన్ను నెమ్మది నమ్మదిగా ప్రేమించడం మానేస్తాను.…
-
నిన్ను ప్రేమించకుండా ఉండలేను గనుకనే నిన్ను ప్రేమించ లేను – Neruda
నిన్ను ప్రేమించకుండా ఉండలేను గనుకనే నిన్ను ప్రేమించ లేను; ప్రేమించడం నుండి నిన్ను ప్రేమించకపోవడంవైపు మరలుతున్నా, నీ కోసం నిరీక్షించడం నుండి, ఎదురుచూడకపోవడం వైపు మరలుతున్నా నా హృది, నిర్లిప్తతనుండి, జ్వలనం వైపు నడుస్తోంది. నిన్నెందుకు ప్రేమిస్తున్నానంటే, నిన్నే నేను ప్రేమిస్తున్నాను గనుక; నిన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నాను, అలా ద్వేషిస్తూనే నీ వైపే ఒరుగుతున్నాను,దానికి కొలమానం నీవంక చూడకుండా నిన్ను గుడ్డిగా ప్రేమించడమే. బహుశ, జనవరినెల వెలుతురు దాని నిర్దాక్షిణ్యమైన వాడి వేడి కిరణాలతో, నా ప్రశాంతతారహస్యాన్ని …
-
జెండా అంటే ఏదో కొంత భూభాగం కాదు… NS Murty
జెండా అంటే వివిధ వర్ణాలనూ, రోదసినుండి నక్షత్రాల, గ్రహాల, ఉపగ్రహాల, ప్రకృతిలోని జీవజాలాల రేఖలతో మానవ మేధ సృష్టించిన ఉపకరణాల రేఖలను తోచినట్టు కలగలిపి అందంగా తీర్చిదిద్దిన ఏవో నాలుగు కొలతలున్న రంగుగుడ్డముక్క కాదు. . జెండా అంటే … ఒక జాతి ఆలోచనా స్రవంతి. ప్రజల జీవనాడి…భవిష్యదాశాసౌధం. ఆకసాన్ని సైతం ధిక్కరిస్తూ, పోటెత్తిన అజ్ఞాత జనసమూహాల త్యాగాల వెల్లువ. శతాబ్దాల నిదాఘదాస్యనిశీధినుండి జారిపడి రూపుదాల్చిన అపురూప ఆకాంక్ష. దాని రెపరెపల గలగలల్లో రాజ్యహింసను అవలీలగా అనుభవిస్తూ,…
-
మృతనగరి… Shernaz Wadia
ఆ మృతనగరిలో నదులు రక్తరంజితాలై ప్రవహించేయి. తునకలైన పుర్రెలు, మాడిపోయిన ఎముకల గుట్టల క్రింద ప్రేతాత్మలు మంటల్లో లుంగలుచుట్టుకుంటున్నాయి. దీనంగా మూలుగుతూ, అరుస్తూ అవి నా త్రోవలోకి జరజరా ప్రాకి ఆలశ్యంగా కలిగిన పశ్చాత్తాపంతో గద్గదంగా బుసలుకొట్టేయి… నువ్వు నీ మర్త్యలోకంలోకి తిరిగె వెళ్ళినపుడు మా మాటలుగా వాళ్ళకీ కబురందించు… ద్వేషానికీ- హింసకీ ప్రతినిధులుగా నిలిచిన మేము మేం చేసిన ఘోరనేరాల అగ్నికీలల్లో శాశ్వతంగా వ్రేలేలా శాఫగ్రస్తులమైనాము. కనుక మీరు మీ పంథాలు మార్చుకోవలసిందే… మీ విద్వేషాలని…