వర్గం: నాటకాలు
-
అజ్ఞాత కుసుమం… లూయీ ఎలిజబెత్ గ్లూక్ , అమెరికను కవయిత్రి
(జీవితంలో చివరి క్షణాన్ని చక్కగా చెప్పిన కవిత ) వేదనకి అంతిమంగా ఒక ద్వారం తెరుచుకుని ఉంటుంది. నన్ను చెప్పనీ: నాకు గుర్తుంది. దాన్ని నువ్వు మరణం అంటావు. నెత్తిమీద ఏవో చప్పుళ్ళు. తమాలవృక్షాల కొమ్మలల్లాడుతున్న చప్పుడు. ఎండిన నేలమీద ఒక్క సారి తళుక్కుమని మెరిసిన నీరెండ చైతన్యం చీకటి గుంతలో కప్పడిపోయాక బ్రతకడం దుర్భరం. దానితో అంతా సరి: నువ్వు భయపడినంతా అయింది ఒక ఆత్మగా మిగిలి, మాటాడలేక అకస్మాత్తుగా ముగిసిపోవడం బిగుసుకున్న మట్టి కొద్దిగా…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 4 వ భాగం
పంచమాంకం దృశ్యం 4 త్రిభుల – బాహుదా (ఒక్క మెరుపు మెరుస్తుంది. ఒక్క పిచ్చికేకతో కొయ్యబారిపోతాడు త్రిభుల) త్రీ: ఓరి భగవంతుడా! ఇది నా బిడ్డా! ఏమిటిది? నాచేతులకు రక్తం అంటుకుంది? నా కూతురు. నా తల తిరుగుతోంది. క్రూరమైన కల ఏదో నా జ్ఞానేంద్రియాలను వశపరచుకుంది. ఇది అసంభవం! ఇంతసేపూ నాతో ఇక్కడే ఉంది. భగవంతుడా! కనికరించు! ఇది ఆమె అయి ఉండదు. ఆమే అయితే నాకు నిజంగా పిచ్చెక్కిపోతుంది. (మరొక్కసారి మెరుపు మెరుస్తుంది) అమ్మో!…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 3 వ భాగం
పంచమాంకం దృశ్యం 3 (ఒంటరిగా త్రిభుల. అతని దృష్టి అంతా సంచీమీద కేంద్రీకృతమై ఉంటుంది.) త్రి: అతనిక్కడ చచ్చి పడి ఉన్నాడు. నేనే గనక అతని ముఖాన్ని చూడగలిగితే ఎంతబాగుండును! (సంచిని మరోసారి పరీక్షిస్తాడు) సందేహం లేదు. అతనే! ఇవి అతని కాలి జోళ్ళు. వాటిని వేగిర పరచడానికి కొట్టిన నాడాలు ఇవి. అనుమానమక్కరలేదు. అతనే!) (త్రిభుల లేచి నుంచుని ఒక కాలు సంచీమీద ఉంచుతాడు) బుర్రతిరుగుడు ప్రపంచమా! ఇప్పుడు, ఇప్పుడు తిలకించు! ఇక్కడ విదూషకుడు! అక్కడ మహా…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 2 వ భాగం
పంచమాంకం దృశ్యం 2 త్రిభుల- సుల్తాన్ సుల్తాన్: చాలా బరువుగా ఉంది. ఏదీ? ఒక చెయ్యి వెయ్యి! ఇందులోనే నీ మనిషి చచ్చిపడి ఉన్నాడు. త్రి: అతని ముఖాన్నొకసారి చూస్తాను. ఏదీ? ఒకసారి దీపం తీసుకురా! సు: అయ్య బాబోయ్! లాభం లేదు. త్రి: ఏమిటీ? హత్య చెయ్యగలవు గాని, హతుడి ముఖమ్మీద మృత్యువును చూడడానికి భయమా? సు: నేను భయపడేది అందుకు కాదు. రాత్రి పహరా కాసే వాళ్ళకు. నేను మాత్రం దీపం ఇయ్యను. అయినా,…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం పంచమాంకం 1 వ భాగం
పంచమాంకం త్రిభుల దృశ్యం 1 [సుల్తాన్ ఇంటితలుపు పూర్తిగా మూసి ఉంచడం, లోపల ఎక్కడా దీపాలు వెలగక పోవడం మినహా, రంగాలంకరణలో ఏ మార్పూ లేక రంగస్థలి నాల్గవ అంకం మాదిరిగానే ఉంటుంది. త్రిభుల రంగస్థలి వెనుక నుండి ముసుగు కప్పుకుని ప్రవేశిస్తాడు. గాలివాన భీభత్సం తగ్గు ముఖం పడుతుంది. వర్షం కొంతసేపటిలో పూర్తిగా ఆగిపోతుంది కూడా. అయినా దూరం నుండి మెరుపులు మెరవడం కనిపిస్తూంటుంది. ఉరుములు ఇంకా ఉరుముతూనే ఉంటాయి…] త్రి: ఇప్పుడు విజయం నాది. ఒక…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 5 వ భాగం
చతుర్థాంకం దృశ్యం 5 [రాజు నిద్రిస్తుంటూ మేడమీది గదిలో; సుల్తాన్ మొగలి క్రింద గదిలో; బాహుదా బయట] బాహుదా: (చీకటిలో నెమ్మదిగా మెరుపుల ఆసరాతో నడుస్తుంటుంది. మహా ప్రమాదకరమైన ప్రయత్నం. నాకుగాని వివేకము తప్పడం లేదు గదా! ప్రకృతికన్న బలీయమైన శక్తి ఏదో నన్ను ప్రేరేపిస్తోంది. అతను ఈ ఇంటిలోనే ఎక్కడో నిద్రిస్తుంటాడు. నాన్నా, క్షమించు! నీ ఆజ్ఞని ఉల్లంఘించి వచ్చినందుకు మన్నించు. నా హృదయాన్ని చీలుస్తున్న సందేహాన్ని అణుచుకోగల శక్తి నాకు లేదు. ఇన్ని సంవత్సరాలూ,…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 4 వ భాగం
చతుర్థాంకం దృశ్యం 4 [రాజు, సుల్తాన్, మొగలి] సుల్తాన్: [బయట ఒంటరిగా ఆకాశంలోకి చూస్తుంటాడు. మెల్లి మెల్లిగా మేఘాలు దట్టంగా కమ్ముకోవడం ప్రారంభిస్తుంటాయి. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోతుంది. మెరుపులు బాగా మెరుస్తుంటాయి. దూరాన్నుండి ఉరుములు వినిపిస్తుంటాయి] ఇంక కాసేపట్లో ఈ ప్రదేశం శ్మశానంలా నిర్మానుష్యమైపోతుంది. ఇదొక చిత్రమైన వ్యవహారం. నాకు ఇదేమీ అర్థం కావటంలేదు. (రాజును చూపిస్తూ) మనకు తెలియనిది ఏదో ఈ మనుషులని ఆవహించి ఉంది. (ఆకాశాన్ని మరోసారి పరీక్షిస్తాడు. ఆ సమయంలో రాజు…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 3 వ భాగం
చతుర్థాంకం దృశ్యం 3 [త్రిభుల, సుల్తాన్ బయట; రాజు మొగలి లోపల] త్రి: (బంగారు నాణేలు సుల్తాన్ కి ఒక్కొక్కటీ లెక్కబెడుతూ) నువ్వు ఇరవై అడిగేవు. ప్రస్తుతానికి ఇవిగో పది. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాడంటావా? (నాణేలు ఇవ్వబోతూ ఆగిపోతాడు) సు: (ఆకాశాన్ని పరీక్షిస్తూ) మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇంకో గంటలో గాలీ వానా వచ్చి అతన్ని ఈ రాత్రికి ఇక్కడే ఉంచేటట్టయితే, మా మొగలికి అవి సహాయం చేస్తాయి. త్రి: అలా అయితే నేను అర్థరాత్రికి వస్తాను.…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 2 వ భాగం
చతుర్థాంకం దృశ్యం 2 [ బాహుదా- త్రిభుల బయట; సుల్తాన్, మొగలి, రాజు లోపల.] రాజు: (సుల్తాన్ భుజంపై పరిచయస్తుడిలా చెయ్యి వేసి తడుతూ) “చుక్క”లు రెండూ ఒక్కసారే- నీ సోదరీ, ఆ చుక్కా. త్రి: (తనలో) దేముడి అనుగ్రహం వలన రాజయి, తనమీద ఏ నిఘా లేదని తెలిసి, నీచ సాంగత్యంకోసం నీతి నియమాల్ని బలిచేస్తున్నాడు. కేవలం, ఒక రాదారి విడిది నడుపుకునే వాడు పోసే మద్యం, పాలకులని సైతం సేవకులుగా మార్చే మద్యం, కోరుకుంటున్నాడు. రా: (పాడును)…
-
రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 1 వ భాగం
చతుర్థాంకం బాహుదా దృశ్యం 1 నగర ప్రథాన ద్వారం. అతి ప్రాచీనద్వారం. దానిప్రక్కగా ఒక పాడుబడ్డ ధాన్య నిల్వచేసుకునే గిడ్డంగి. దాని అవతారం చూడగానే అది చవుకబారు మనుషుల విలాస గృహం అని అర్థం అవుతుంది. ఆ ఇంటిముఖద్వారం ప్రేక్షకులవైపు తెరిచి ఉంటుంది. లోపల చాలా సాదా సీదాగా- ఒక మేజాబల్ల- గోడలోకి చలికాచుకునేందుకు పొయ్యి- డాబామీదకో, డాబామీది గదిలోనికో వెళ్ళేందుకు సన్నని మెట్ల వరుస. పైనున్న గదిలో కిటికీలోంచి కనిపిస్తున్న మంచం. మంచానికి కుడిప్రక్కగా లోపలకి…