వర్గం: కవితలు
-
నితాంత ప్రేమ…Shernaz Wadia
తమ యుగళనృత్యపుహేలతో ఒక అపూర్వమైన జాడను విడిచివెళ్ళారు వారు ఆ త్రోవ విపరీత భావనల సమ్మేళనం సంతోషం / సంతాపం, ఆవేదన / ఆనందం నవ్వూ / కన్నీరూ, అన్యోన్యత / గౌరవం… వినీల ప్రేమాకాశంలో వింతవన్నెలరంగుల ఉల్కాపాతం విధి వాళ్ళ అద్భుతగాథను కాలాతీతం చేసింది… ఉంచిందామె చేతిలో ఒక పరాయి చెయ్యి “తప్పదు” అందామె. ఏకాకిగా నిలబడిపోయాడతడు అంతుచిక్కని అగాథంలోకి తొంగి చూస్తూ… కళ్ళుమూసుకుని పిడికిలిబిగించి ఒక్కసారి ఎగిరేడు రెక్కలు తొడుగుకుని, విశ్వాసపు వీచికలమీద రెక్కలార్చుకుంటూ… ఆశగా…
-
అసంగత ఆకాంక్షలు… Shernaz Wadia
ఈ అనువాదం చదివిన తర్వాత ఇంతకంటే బాగా చెయ్యొచ్చునని మీలో కొందరికైనా అనిపించకపోదు. అప్పుడు మూలం కోసం వెతక నక్కర లేకుండా ఇక్కడ పొందుపరుస్తున్నాను: శాపగ్రస్తుడనై, అచేతనంగా, దిక్కుతోచక నాతీరంలో నేనుంటూనే దిశాంత తీరాల నపేక్షిస్తుంటాను ఆదరి చేర్చగల సరంగు రాకకై నిరీక్షిస్తూ… రికామీగా, అశక్తుడనై, తప్పటడుగులేస్తూ, నేలమీద తడబడుతున్నా, నేను ఊహలస్వర్గంకోసం ఉవ్విళ్ళూరుతుంటాను నన్నటకు చేర్చగల ఐంద్రజాలికుడికై ఎదురుచూస్తూ… నైరాశ్యంతో, జీవితంతో రాజీపడి, ధైర్యం కోల్పోయి, ఆనవాళ్ళు లేని శవాకృతిగా మిగిలిన నేను మితిలేని ప్రశంసలకు…
-
దీప కళిక… రబీంద్రనాద్ టాగోర్
బెంగాలీ మూలం: కే లేబే మోర్ కార్జ్ , కహే సంధ్యా రబి, సునియా జగత్ రహే నిరుత్తర్ ఛబి మాటేర్ ప్రదీప్ ఛిలో సే కహిలో స్వామీ అమార్ జేటుకు సాధ్య కరిబో తా అమి రబీంద్రనాద్ టాగోర్ Who shall take my charge asked the setting sun, suddenly, the world went pale and heard it spell-bound then a small lamp ventured forward, my lord!…
-
నీ జ్ఞాపకాలు…Shernaz Wadia, Indian Poet
ఇక నుండీ నన్ను వివశను చేసే నీ చిరునవ్వూ, చూడు, అలా నవ్వితే చిన్నగా సొట్టలు పడే నీ బుగ్గలూ, బుంగ మూతీ, కనుమరుగే కదా! చుట్టూ ఉన్న రణగొణధ్వనిని కూడా ఛేదించుకుని, రహస్యంగా నా చెవుల్లో నెమ్మదిగా ఊసులాడి నా ఏకాంతపు విషాదాశ్రువులు తుడిచి నన్నూరడించే నీ కమనీయ కంఠధ్వని, ఉహూ, ఇక ఎన్నటికీ దొరకదు కదా!! ఇంద్రజాలం చేసే నీ కర స్పర్శ అందనంతదూరమైనా, నీ లాలనలో ఎంత మహిమ ఉందంటే, చిత్రంగా నా…
-
కృతజ్ఞతా భావన … Shernaz Wadia, Indian Poet
ఆ మాట ఇంకా ప్రచారంలోకి రాక ముందే ఆ అద్వితీయ భావనని మాలోకి చొప్పించారు మీరు. తనముక్కు చాలాపొడుగ్గా ఉందని ఒకరు విచారిస్తుంటే మీరన్నారు: “నయం!అదింకా వాసనలు పసిగట్టగలుగుతోంది. కుష్టురోగం అక్కడఒక ఒక గొయ్యి మిగులుస్తుంది తెలుసా?” అని. తన పాదాలు అందంగాలేవని మరొకరు తపిస్తుంటే, మీరు అభిశంసించేరు: “సంతోషించు! నీ కాళ్ళమీద నువ్వు నిలబడగలుగుతున్నందుకు. ఒక వేలు పోగొట్టుకున్నవాళ్ళని అడిగిచూడు దాని అవసరమెంతో తెలుస్తుంది.” మూడవది తనగొంతులో కోకిలారవాలు పలకడంలేదని తపిస్తుంటే, మీరు ఆదేశించారు :…
-
ఆప్త మిత్రుడికి… Shernaz Wadia, Indian Poet
మిత్రమా! తీరని ఈహల నిర్జీవ హృదయాన్ని నీ కిచ్చాను. లలితజీవన చుంబనాన్ని దానిపై నువ్వు ప్రసరించావు. ఇపుడది కొంగ్రొత్త జవంతో కేరింతలు కొడుతోంది. ఆప్తుడా! తప్త కాంక్షల చితా భస్మాన్ని నీకిచ్చాను. దాన్ని నీ ప్రేమ పేటికలో భద్రపరిచావు. ఇపుడది పునరుజ్జీవనంతో కళకళలాడుతోంది. నేస్తమా! పీటముడులుపడిపోయిన ఆలోచనల పోగులను నీ ముందుంచాను. అవిఛ్ఛిన్న ప్రశాంతతతో చిక్కులు విప్పి నాకు సాంత్వన నందించావు. సహచరుడా! రసహీనమైన నా జీవితాన్ని నీ ముందు పరిచాను. దయార్ద్రహృదయంతో దానికి ప్రేమలేపనం పూసావు.…
-
చి’త్తరువు’ సౌందర్యం… Shernaz Wadia
ఏకాంత తరువు విశాల వివర్ణ ప్రకృతి నిస్సంగ నిరంబర దేహం అపర్ణ, విభూతిశాఖీశాఖా వియద్వీక్షణం వాగామగోచర విలాసం వసంతాగమ నాభిలాష అంతరాంతర కృతజ్ఞతాంజలి . English Original : Shernaz Wadia
-
కవిత ఎలా ఉండాలి ? … Shernaz Wadia
స్ఫటికం లా… అంది నిశ్చల సరస్సు మెరుస్తూ నాలా ఉదాత్తంగా — గంభీరంగా పలికింది మహావృక్షం నిరాఘాటం గా ప్రవహించాలి — గలగలలాడింది సెలయేరు సద్యః స్ఫురణ కలిగిస్తూ జీవం తొణికిసలాడాలి — కూని రాగాలు పోయింది పిట్ట సువాసనలతో మత్తెక్కించాలి — ఝుంకరించింది తుమ్మెద మనసు దోచుకోవాలి — నవ్వింది సీతాకోక చిలుక రమణీయం గా ఉండాలంటేనో ? అడిగాయి పూలు లోతుగా సారవంతంగా ఉండాలి — ఘోషించింది లోయ కొంత రాజసం కూడా ఉండాలి…