వర్గం: కవితలు
-
ఊహలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
నీ మాటలు నాలో ఎంతో సానుభూతి రేకెత్తించినా నాకు నీతో మాటాడాలనిపించటం లేదు. నా తనువులో మౌనంగా దాగిన మధురగీతికలన్నీ మేల్కొని సంగీతమై నినదిస్తున్నాయి. నువ్వు నిష్క్రమించినపుడు ఈ సున్నితమైన తంత్రులన్నిటినీ అకస్మాత్తుగా ఎవరో నిర్దాక్షిణ్యంగా, సులభంగా త్రెంచిపారేసినట్టనిపిస్తుంది. వద్దు, ఇంకేం మాటాడవద్దు; బదులుగా, మనిద్దరం ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మౌనాన్ని అక్కునచేర్చుకుందాం. నలుపెక్కుతున్న మేఘాలని చూసి తుఫాను రాకడని ఊహించినట్టు మన మాటలనుబట్టి ఇతరులు మన ఆంతర్యాన్ని పసిగట్టవచ్చు. నామట్టుకు నాకు, ఏ రోజైనా మనం…
-
పొద్దుపొడిచేవేళ… యాహియా లబాబిడి, ఈజిప్టు కవి
ప్రతి వస్తువూ ఉన్నచోటనే కట్టుబడినట్టు పడుండవలసిన స్థితికి విసుగెత్తి, అసంకల్పితంగా ఆయా వస్తువులు కిర్రుమన్నట్టూ, కుర్చీలు చేతులు బారజాపుకు వొళ్ళు విరుచుకున్నట్టూ మేజాలు కాళ్ళనీ, అలమరలు వెన్నునీ విరుచుకుంటున్నాయేమో ననిపించే సమయాలు కొన్ని ఉంటాయి … మనుషులుకూడా, పనిచేసేచోటనో, ప్రేమలోనో అంతరాంతరాల్లో తమ అభిప్రాయాలు ఖండాలు జరిగినంత ఖచ్చితంగా, నెమ్మదిగా తామే పోల్చుకోలేనంతగా మారుతున్నపుడు ఏదో ఒకటి ఒళ్ళు విరుచుకునో, అరిచో, వాటిని ఒకసారి పునరావలోకనంచేసుకునేట్టు చేస్తుంది. అశాంతినిండిన ఒకానొక సుప్రభాతవేళ, తెలిసో తెలియకో ఓరవాకిలిగా విడిచిన…
-
ఈ బొమ్మ ఏమై ఉంటుంది?… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
ఒక పాత బొమ్మలో చిన్న ముక్క రోడ్డుమీద పడి ఉంది. ఒక పాత బొమ్మలో చిన్న ముక్క వానలో తడుస్తూంది. అది అలవాటుగా షూ వేసుకునే స్త్రీ తొడుక్కున్న కోటుకి ఉండే నీలిరంగు బొత్తాము కావచ్చు. అది magic bean గాని ఒక మహారాణి గారు ధరించిన ఎర్రని మొకమలు వస్త్రంమీది మడత కావొచ్చు, లేదా, Snow White కి సవతి తల్లి ఇచ్చిన ఏపిలును ఆమె కొరికినపుడు పడిన పంటి గాటు కావొచ్చు. అది ఒక…
-
సామూహిక అభ్యర్థన … ప్రీమో లెవీ, ఇటాలియన్ కవి
మీ మీ ఇళ్ళలో భద్రంగా, వెచ్చగా గుమ్మటంలా ఉంటూ సాయంత్రం ఇంటికి రాగానే నవ్వుముఖాలూ, వేడివేడి భోజనం ఎదురుచూసే మీరు ఒకసారి ఆలోచించండి కేవలం ఒక రోట్టెముక్క కోసం బురద కొట్టుకునేలా చాకిరీచేస్తున్నా మనశ్శాంతి అన్నది ఎరుగక, అవును, కాదు అన్న ఒక నిర్ణయానికి బలి అయే ఇతనూ ఒక మనిషిబ్రతుకే? శుభ్రమైన తలకట్టుగాని, పేరుగాని లేక ఉన్నా గుర్తుపెట్టుకునే శక్తి లేక శీతకాలంలోని కప్పలా కళ్ళు శూన్యంలోకిచూస్తూ, గర్భంవట్టిపోయి అలమటించే ఈమెదీ ఒక ఆడబ్రతుకే? ఇన్నాళ్ళబట్టీ…
-
మీరు లక్షలమంది మృతుల్ని చూడ్డం జరిగితే … ఛార్ల్స్ సోర్లీ, స్కాటిష్ కవి
మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన ప్రముఖ యువకవులలో ఛార్ల్స్ సోర్లీ ఒకడు. Wilfred Owen (1893-1918), Isaac Rosenberg (1890 – 1918) కూడా పిన్న వయసులోనే పోయారు. యుద్ధోన్మాదం పట్ల విముఖతే కాక, చనిపోయిన వారిగురించి అరిగిపోయినమాటలలో చెప్పే ఊకదంపుడు మాటలపట్లకూడా అతనికున్న విముఖత, మృత్యువుపట్ల వయసుకి మించిన పరిణతితో కనిపించే నిర్లిప్తతా ఈ కవితలో కనిపిస్తాయి. *** కొన్ని లక్షలమంది నోరులేనిమనుషులు మీ కలల్లో కుప్పలుతెప్పలుగా నిర్జీవంగా కనిపిస్తే మీ జ్ఞాపకంలో ఉన్నవి, నలుగురూ చెప్పినట్టే…
-
బహుమానాలు… జేమ్స్ థామ్సన్, స్కాటిష్ కవి
తను స్వారీ చెయ్యగల గుఱ్ఱాన్ని గాని, నడపగలిగిన పడవనిగాని ఒక మనిషికి ఇచ్చిచూడు; అతని హోదా, సంపద, బలం ఆరోగ్యం నేలమీదైనా, నీటిమీదైనా చెక్కుచెదరవు. ఒకమనిషికి వాడు తాగగలిగిన పొగాకుగొట్టాన్నిగాని, వాడు చదవగలిగిన పుస్తకాన్నిగాని ఇచ్చి చూడు; అతని గదిలో పేదరికం తాండవించవచ్చునేమోగాని, అతని ఇల్లు ప్రశాంతతతో ఆనందంతో కళకళలాడుతుంది. నేను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు, ప్రేయసీ, ఒక పురుషుడికి అతనికి మనసైన స్త్రీని ఇచ్చి చూడు అతని హృదయం అదృష్టస్పర్శతో ఉదాత్తమౌతుంది ఇంట్లోనూ, నేలమీదా, నీటిమీదా!…
-
దృక్పథంలో మార్పు … ఆర్థర్ సైమన్స్, వెల్ష్ కవి
నేను పువ్వులకంటే వాటి రంగుల్నీ, రెక్కలకంటే, పిచ్చుకల గమకాలనీ ప్రేమించాను. జీవితంలో సగానికి పైగా ఏ సహచరుని తోడూ లేకుండా వృధాచేసుకున్నాను. మరిప్పుడు నేను చెట్టూ పుట్టా ప్రక్కన ఆడుకునే పిల్లల్నీ, రాత్రీ పగలూ కనిపించే సూర్యచంద్రుల్నీ ప్రేమతో ఆశ్చర్యంతో, ఆనందంతో ఎలా చూడగలుగుతున్నాను? ఇప్పుడు రహదారుల్ని మునపటిలా కోపంగా కాకుండా, తొలివేకువలో చిరుకప్పల సమావేశస్థలిగా, మధ్యాహ్నవేళ సీతాకోకచిలుకల సంతగా ఎలా చూస్తున్నాను? ప్రతి కీటకపు అవ్యక్త ఝంకారం వెనుకా అనాదిగా చిక్కుబడ్ద ప్రాణరేణువు దర్శిస్తున్నాను. ఒక్కసారిగా,…
-
అందం… ఎడ్వర్ద్ థామస్, వెల్ష్ కవి
పైకి కొంచెం అన్వయ క్లిష్టత కనిపించినా, ఇది ఒక ఏకాకి ఆత్మరోదన. అందులోనూ ఎన్నడూ ప్రేమ రుచి చూడని వాడు. సౌందర్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. కానీ సౌందర్య దృష్టి ఉన్నప్పుడే. కవి ఉద్దేశ్యంలో అందం పరమర్థం వేరే. అది చివరన చెబుతాడు. ప్రేమ ఎరుగని మనసుకి మృత్యువులోనే సాంత్వన దొరుకుతుంది. లేదా, కేవలం ప్రకృతిలో మమేకమైనపుడు. (అందుకే ఇందులో చక్కని ప్రకృతిదృశ్యాల వర్ణన. గుండెకోతను, నీటిని సన్నని కెరటాల తెరలుగా పిల్లగాలికోయడం ఒక అపురూపమైన ఉపమానం.} పాపం…
-
లాంతరుకంటే వెలుగే ముఖ్యం… నిజార్ కబ్బానీ, సిరియన్ కవి
లాంతరు కంటే వెలుగే చాలా ముఖ్యం, రాసిన పుస్తకం కంటే, కవితే ఎంతో ముఖ్యం, పెదాలకంటే, ముద్దు ఎక్కువ ముఖ్యం నేను నీకు రాసిన ప్రేమలేఖలు మనిద్దరికన్నా గొప్పవీ, ఎంతో ముఖ్యమైనవీ ఎందుకంటే, ప్రజలు నీ అందాన్నీ, నా పిచ్చినీ తెలుసుకోగలిగిన ఆధారపత్రాలు అవి. . నిజార్ కబ్బానీ (21 March 1923 – 30 April 1998) సిరియను కవి. . . Light Is More Important Than The Lantern . Light…
-
నిష్క్రమణ… హెన్రిక్ ఇబ్సెన్, నార్వేజియన్ కవి,నాటకకర్త
చివరగా… ఆఖరునవచ్చిన అతిథి వీధివరకు గుమ్మం వరకు సాగనంపేం; శలవు… తక్కిన మాటల్ని రాత్రి రొజ్జగాలి మింగేసింది. ఇంతదాకా వినిపించిన తియ్యని మాటలు చెవులకు సంగీతంలా వినిపించేయి… ఇక ఈ ఇల్లూ, తోటా, వీధీ పదిరెట్లు బావురుమంటూ ఉన్నాయి. ఇది కేవలం చీకటిపడుతూనే ఏర్పాటుచేసిన ఒక విందు. ఆమె కేవలం ఒక అతిథి, ఇప్పుడు, ఆమెకూడా వెళ్ళిపోయింది . హెన్రిక్ ఇబ్సెన్ నార్వేజియన్ కవి, నాటకకర్త, దర్శకుడు. . Henrik Ibsen Photo Courtesy: Wikipedia .…