వర్గం: కవితలు
-
పాత – కొత్త… అజ్ఞాత చీనీ కవి
ఆమె కొండమీద దొరికే వనమూలికలు ఏరుకుందికి వెళ్లింది.దిగి వస్తున్నప్పుడు దారిలో తన మాజీ భర్త ఎదురయ్యాడు.సంప్రదాయంగా ముణుకులు వంచి నమస్కరించి అడిగింది“నూతన వధువుతో మీ జీవితం ఇప్పుడెలా ఉంది?” అని. “నా భార్య చాలా తెలివిగా మాటాడుతుంది గాని,నా మొదటి భార్య అలరించినట్టుగా అలరించలేదు.అందంలో ఎవరూ ఎవరికీ తీసిపోరు,కానీ ఉపయోగపడడంలో ఇద్దరికీ పోలిక లేదు.నా భార్య నన్ను కలవడానికి వీధిలోనికి వస్తేనా మాజీ భార్య ఎప్పుడూ అంతర గృహంలోంచి వచ్చేది.నా నూత్న వధువు పట్టు బుటేదారు పనిలో…
-
ఎలిజబెత్ మహరాణి స్మృతిలో… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి
మనిషి సంక్షిప్తంగా ఏమి చెప్పగలడో వినాలనుందా? అయితే, పఠితా! నిలు, నిలు! ఎంత అందం మట్టిలో కలవగలదో అంత అందమూ ఈ రాతికింద మట్టిలో కలిసి పోయి ఉంది. అది జీవితానికిచ్చినదానికంటే ఎక్కువ పాలు శీలానికి తననితాను ధారపోసుకుంది. ఆమెలో మచ్చుకి ఏదైనా లోపం కనిపిస్తే దాన్ని ఈ సమాధిలోనే విడిచిపెట్టండి. ఆ అందానికి ఉన్నది ఒక్కటే పేరు: ఎలిజబెత్ శరీరాన్ని మృత్యువుతో శయనించనీయండి. మృతిలోకూడా ఆజ్ఞనీయగల సమర్థురాలు ఆమె పేరుకి జీవించి ఉన్నప్పటికంటే. శలవు! .…
-
ఎపిక్యూర్… అబ్రహామ్ కౌలీ. ఇంగ్లీషు కవి
మీ పాత్రని ఎర్రని మధువుతో నింపండి తలకట్టున గులాబుల దండ ధరించండి మధువూ, గులాబుల్లా మనం నవ్వుతూ కాసేపు హాయిగా ఆనందంగా గడుపుదాం. గులాబుల కిరీటాన్ని ధరించిన మనం “జహీజ్”(1) రాజమకుటాన్నైనా తలదన్నుదాం ఈ రోజు మనది; మనం దేనికి భయపడాలి? ఈ రోజు మనది; అది మనచేతిలోనే ఉంది. దాన్ని సాదరంగా చూద్దాం. కనీసం మనతోనే ఉండిపోవాలని కోరుకునేలా చేద్దాం. పనులన్నీ కట్టిపెట్టండి, దుఃఖాన్ని తరిమేయండి రే పన్నది సుఖపడడం తెలిసినవాళ్లకే. . అబ్రహామ్ కౌలీ…
-
నీ శకం ముగిసింది… లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి
నీ శకం ముగిసింది, ఇక నీ కీర్తి ప్రారంభమైంది. ఈ దేశవాసులు గీతాలు రచిస్తారు తమ ప్రియతమ పుత్రుడు సాధించిన ఘనకార్యాలూ, గెలిచిన యుద్ధాలూ, నిలబెట్టిన స్వాతంత్య్రమూ, గెలిచిన పోరాటాలనూ స్మరించుకుంటూ! నువ్వు నేల రాలి, మేము స్వేచ్ఛగా మిగిలినా నీకు మరణం ఎంతమాత్రం లేదు; నీ శరీరంనుండి వెల్లువై పెల్లుబికిన రక్తం ఈ నేలలో ఇంకడానికి ఇష్టపడక, మా రక్తనాళాల్లో తిరిగి ప్రవహిస్తూంది నీ ఆత్మ మా ఊపిరులున్నంతవరకు శాశ్వతం! నీ నామస్మరణే తక్కిన వీరసైనికులని…
-
కల… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నేను రోదించినా ఎవరూ పట్టించుకోరు నువ్వు దానికి నవ్వినా నేను దానికి బాధపడను. అలా అనుకోడం తెలివితక్కువగా కనిపించవచ్చు కానీ, నువ్వున్నావన్నది గొప్ప ధైర్యాన్నిస్తుంది. ప్రియతమా!నేను నిద్రలో మేల్కొన్నట్టు కలగన్నాను నేలమీద, తెల్లగా పిండారబోసినట్టున్న వెన్నెల చేతితో తాకాను; కానీ ఎక్కడో దూరంగా వదులుగా ఉన్న కిటికీ ఒకటి కిర్రుమని చప్పుడైంది గాలికి ఊగుతూ… కానీ గాలి వీచిన జాడలేదు, నాకు భయంవేసి నీ వైపు చూశాను నీ భరోసాకోసం చెయ్యి జాచేను కానీ, నువ్వక్కడలేవు!…
-
నాకు ఒంట్లో బాగులేదు… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
“ఇవాళ నేను బడికి వెళ్ళలేను” అంది పెగ్గీ ఏన్ మెకే. నాకు మశూచిసోకిందో, గవదబిళ్ళలు లేచాయో అక్కడక్కడగాట్లూ, దద్దుర్లూ, ఎర్రగా పొక్కులూ ఉన్నాయి. నా నోరు తడిగానూ, గొంతు పొడారిపోతూనూ ఉంది నాకు కుడికన్ను కనిపించడం లేదు. నా టాన్సిల్స్ బండరాయిల్లా తయారయ్యాయి నేను లెక్కెట్టేను పదహారు అమ్మవారుపోసిన పొక్కులున్నాయి ఇదిగో, దీనితో కలిపి పదిహేడు నా ముఖం నీకు పచ్చగా కనిపించటం లేదూ? నా కాలుకి దెబ్బతగిలింది, కళ్ళు వాచిపోయాయి… బహుశా అప్పుడే ఫ్లూ జ్వరం…
-
కవితలు రాస్తున్నకొద్దీ… ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి
రాసిన కవితల సంఖ్య వేలలోకి వెళ్తున్నకొద్దీ నీకు అర్థం అవుతుంది నువ్వు చెప్పుకోదగ్గంత రాయలేదని. చివరకి వానా, ఎండా, రోడ్డుమీదవాహనాలూ, రాత్రుళ్ళూ పగళ్ళూ, ముఖాలూ కవితావస్తువులౌతాయి. వాటిని భరించడం కంటే విడిచిపెట్టడం ఉత్తమం. రేడియోలో ఎవరిదో పియానో వాద్యం వినిపిస్తుంటే మరో కవిత రాస్తున్నాను. గొప్పకవులు రాసింది చాలా తక్కువ చెత్తకవులు మరీ ఎక్కువ రాసేరు. . చార్ల్స్ బ్యుకోవ్స్కీ August 16, 1920 – March 9, 1994 అమెరికను కవి As The Poems…
-
జారిపోతున్న క్షణాలు… జార్జి లూయీ బోర్హెస్, అర్జెంటీనా కవి
నా జీవితాన్ని తిరిగి జీవించే అవకాశం వస్తే మరిన్ని తప్పులు చెయ్యడానికి రెండవసారి ప్రయత్నిస్తాను. పరిపూర్ణంగా దోషరహితంగా ఉండడానికి ప్రయత్నించను. ఏ ఒత్తిడీలేకుండా తీరుబాటుగా ఉంటాను, ఇప్పటికంటే సంతృప్తిగా ఉంటాను. నిజానికి అతి తక్కువ విషయాలని ప్రాధాన్యత ఇస్తాను ఇప్పటికంటే తక్కువ పరిశుభ్రంగా ఉంటాను ఎక్కువ తెగువచూపిస్తాను ఎక్కువ ప్రయాణాలు చేస్తాను ఎక్కువ సూర్యాస్తమయాలు చూస్తాను ఎక్కువ కొండలెక్కుతాను ఎక్కువ నదుల్లో ఈదుతాను ఇప్పటివరకు చూడని ఎన్నో ప్రదేశాలు చూస్తాను ఎక్కువ ఐస్ క్రీం తిని, తక్కువ…
-
ఊహలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
నీ మాటలు నాలో ఎంతో సానుభూతి రేకెత్తించినా నాకు నీతో మాటాడాలనిపించటం లేదు. నా తనువులో మౌనంగా దాగిన మధురగీతికలన్నీ మేల్కొని సంగీతమై నినదిస్తున్నాయి. నువ్వు నిష్క్రమించినపుడు ఈ సున్నితమైన తంత్రులన్నిటినీ అకస్మాత్తుగా ఎవరో నిర్దాక్షిణ్యంగా, సులభంగా త్రెంచిపారేసినట్టనిపిస్తుంది. వద్దు, ఇంకేం మాటాడవద్దు; బదులుగా, మనిద్దరం ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మౌనాన్ని అక్కునచేర్చుకుందాం. నలుపెక్కుతున్న మేఘాలని చూసి తుఫాను రాకడని ఊహించినట్టు మన మాటలనుబట్టి ఇతరులు మన ఆంతర్యాన్ని పసిగట్టవచ్చు. నామట్టుకు నాకు, ఏ రోజైనా మనం…