అనువాదలహరి

మతసామరస్యం … జాతిపిత మహాత్మా గాంధీ

మహాత్మా గాంధీ 69 వ వర్థంతి సందర్భంగా

మతసామరస్యం అవసరమన్న విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. కానీ అందరికీ, మతసామరస్యం అంటే బలవంతంగా విధించగలిగిన రాజకీయ ఐక్యత కాదన్న విషయంమాత్రం తెలియదు. మతసామరస్యం అన్నది ఎవ్వరూ వేరుపరచలేని మనసుల కలయిక. అది సాధించడానికి ముందుగా ప్రతి కాంగ్రెసు వాదీ అనుసరించవలసింది, అతను ఏ మతానికి చెందినవాడైనప్పటికీ, తను హిందూ, ముస్లిం, క్రిస్టియం జొరాష్ట్రియన్, యూదు మొదలైన మతాలన్నిటికీ ప్రతినిథిగా ప్రవర్తించాలి. క్లుప్తంగా చెప్పాలంటే అతను హిందూ, హిందూ ఏతర మతాలన్నిటికీ ప్రతినిథిగా ఉండాలి. ఈ హిందూ దేశంలో నివసిస్తున్న అన్నికోట్ల మతావలంబులతో తనని తాను గుర్తించుకోగలగాలి. ఇది సాధించాలంటే, ప్రతి కాంగ్రెసువాదీ, తన మతం కాకుండా తక్కిన మతావలంబులతో వ్యక్తిగత స్నేహాన్ని పెంపొందించుకోవాలి. తన మతం పట్ల అతనికి ఎంత గౌరవం ఉందో, తక్కిన మతాలపట్లకూడా అంత గౌరవాన్నీ కలిగిఉండాలి.

అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో, రైల్వే స్టేషన్లలో “హిందూ త్రాగు నీరు” అనీ, “ముస్లిం త్రాగు నీరు” అనీ, లేదా, “హిందూ టీ” అనీ, “ముస్లిం టీ” అన్ని అవమానకరమైన అరుపులు వినిపించవు. పాఠశాలల్లో, కళాశాలల్లో, హిందువులకీ, హిందూ ఏతరులకి వేర్వేరు గదులూ, వేర్వేరు పాత్రలూ కనిపించవు. ఒక్కొక్క మతానికీ వేర్వేరు పాఠశాలలూ, కళాశాలలూ, ఆసుపత్రులూ ఉండవు. అటువంటి విప్లవాన్ని తీసుకురావడానికి ప్రతి కాంగ్రెసువాదీ ఏ రకమైన రాజకీయ లబ్దీ పొందాలన్న తలంపు లేకుండా దాన్ని సరిదిద్దడానికి పూనుకోవాలి. దాని పర్యవసానంగా, రాజకీయ ఐక్యత దానంతట అదే సిద్ధిస్తుంది.

ప్రజలకి రాజ్యాధికారం చట్టసభలద్వారా మాత్రమే సిద్ధిస్తుందన్న అపోహలో చిరకాలంనుండీ ఉన్నాము. ఈ రకమైన నమ్మకానికి మన అజ్ఞానమూ, మన జడత్వమూ ముఖ్య కారణమని నా నమ్మకం. బ్రిటిషు చరిత్రని పైపైని చదివి ప్రజలకి రాజ్యాధికారం చట్టసభలద్వారా మాత్రమే సంక్రమిస్తుందని అనుకుంటున్నాము. నిజం ఏమిటంటే, ప్రజలకి ఆ అధికారం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కానీ వాళ్లు ఎన్నుకున్న ప్రతినిధులకు తాత్కాలికంగా అది అందివ్వబడుతుంది. ప్రజలు అందించిన అధికారం కాకుండా, చట్టసభలకు స్వతంత్రంగా ఏ అస్తిత్వంగాని, అధికారాలు గాని లేవు. ఈ ప్రాథమిక సత్యాన్ని ప్రజలకి తెలియపరచడానికి గత 21 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను. శాసనోల్లంఘన అధికారానికి కాణాచి. మొత్తం దేశప్రజలందరూ చట్టసభలు చేసే శాసనాన్ని ధిక్కరించి దాని ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిని ఒక్క సారి ఊహించుకొండి. వాళ్ళు ఈ చట్టసభలనీ, అధికార యంత్రాంగాన్నీ ఒక్కసారిగా నిర్వీర్యం చేస్తారు! పోలీసులూ, సైన్యమూ వాళ్ళు ఎంత బలవంతులైనప్పటికీ, కేవలం అల్పసంఖ్యాకులపై మాత్రమే వాళ్ళ ప్రతాపం చూపగలరు. కానీ, దేనికైనా తెగించి ముందుకువచ్చిన దేశప్రజలు యావన్మందినీ ఏ పోలీసులూ, సైన్యమూ ఏమీ చెయ్యలేరు.

చట్టసభల ద్వారా రాజ్యాన్ని పరిపాలించడం చట్టసభలలకి వెళ్ళిన ప్రతినిధులు అధికసంఖ్యాకులైన ప్రజల అభిప్రాయానికి తల ఒగ్గి నడుచుకుందికి ప్రయత్నించినపుడు మాత్రమే సరిగా జరుగుతుంది. మరొక మాటలో చెప్పాలంటే, ప్రజాభిప్రాయమూ, చట్టసభల అభిప్రాయమూ ఒకదానికొకటి అనుకూలంగా ఉన్నప్పుడే రాజ్యనిర్వహణ సాధ్యపడుతుంది.

భారతదేశంలో మనం పార్లమెంటరీ వ్యవస్థని రెండు భిన్నమైన నియోజకవర్గాలద్వారా సాధించడానికి ప్రయత్నిస్తున్నట్టు నటిస్తున్నాము గానీ అలా చెయ్యడం ద్వారా పరస్పరం పొసగని స్థితిని సృష్టిస్తున్నాము. ఒకే వేదికమీదకి ఈ రెండు కృత్రిమమైన వ్యవస్థలనూ తీసుకురావడం ద్వారా మనం ఆచరణలో ఐకమత్యాన్ని తీసుకురాలేము. అటువంటి చట్టసభలు పనిచేస్తే చెయ్యవచ్చు. కానీ, ఈ వేదికలు తగువులాడుకుందికీ, అధికారంలో ఎవరున్నప్పటికీ, వాళ్ళ దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి, వాళ్ళు విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడేవారికి మాత్రమే పనికి వస్తాయి. అవి ఇనప రూళకర్రతో బెదిరించి పాలించడానికీ, వ్యతిరేకించే వర్గాలు ఒకరిమీద ఒకరు కత్తులుదూసుకోకుండా నిరోధించడానికీ పనికొస్తాయి. అటువంటి అవమానకరమైన పరిస్థితులలో పూర్ణ స్వరాజ్యం సాధించడం అసంభవమని నా వ్యక్తిగత అభిప్రాయం.

నాకు అటువంటి స్పష్టమైన నిశ్చితాభిప్రాయాలున్నప్పటికీ, చట్టసభలకి ఎన్నుకోడానికి “అయోగ్యులైన అభ్యర్థులు” లేనంతవరకూ, విప్లవకారులు చట్టసభలలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి కాంగ్రెసు తన అభ్యర్థుల్ని నిలబెట్టాలన్న నిశ్చయానికి వచ్చేను.
.
MK గాంధీ

portrait_gandhi

On the eve of  69th  Anniversary of  Bapu’s Assassination

.

Communal Unity

Everybody is agreed about the necessity of this unity. But everybody does not know that unity does not mean political unity which may be imposed. It means an unbreakable heart unity. The first thing essential for achieving such unity is for every congressman, whatever his religion may be, to represent his own person Hindu, Muslim, Christian, Zoroastrian, Jew, etc., shortly, every  Hindu and No-Hindu. He has to feel his identity with every one of the millions of the inhabitants of Hindustan. In order to realize this, every Congressman will cultivate personal friendship with persons representing faiths other than his own. He should have the same regard for the other faiths as he has for his own.

In such a happy state of things there would be no disgraceful cry at the stations such as “Hindu Water” and “Muslim Water” or “Hindu Tea” and “Muslim Tea”.  There would be no separate rooms or pots for Hindus and non-Hindus in schools and colleges, no communal schools, colleges and hospitals. The beginning of such a revolution has to be made by Congressmen without any political motive behind the correct conduct. Political unity will be its natural fruit.

We have long been accustomed to think that power comes only through Legislative Assemblies.  I have regarded this belief as a grave error brought about by inertia or hypnotism. A superficial study of British history has made us think that all power percolates to the people from parliaments. The truth is that power resides in the people and it is entrusted for the time being to those whom they may choose as representatives. Parliaments have no power or even existence independently of people. It has been my effort for the last twenty-one years to convince the people of this simple truth. Civil Disobedience is the storehouse of power. Imagine a whole people unwilling to conform to the laws of the legislature, and prepared to suffer the consequences on non-compliance! They will bring the whole legislative and executive machinery to a standstill.  The police and military are of use to coerce minorities however powerful they may be. But no police or military coercion can bend the resolute will of people who are out for suffering to the uttermost.

And the parliamentary procedure is good only when its members are willing to conform to the will of the majority. In other words, it is fairly effective only among compatibles.

Here in India we have been pretending to work the parliamentary system under separate electorates which have created artificial incompatibles. Living unity can never come out of these artificial entities being brought together on a common platform. Such legislatures may function. But they can only be a platform for wrangling and sharing the crumbs of power that may fall from rulers whoever they may be. These rule with rod of iron, and prevent the opposing elements from flying at one another’s throats. I hold the emergence of complete Independence to be an impossibility out of such a disgrace.

Though I hold such strong views, I have come to the conclusion that so long as there are  undesirable candidates for elective bodies, Congress should put up candidates in order to prevent reactionaries from entering such bodies.

MK Gandhi

PPs 8-9, Constructive Programme, Its meaning and Place. Navajivan Publishing House, Ahmedabad December 1945 (Courtesy: Gandhi Heritage Portal)

ప్రభుత్వం నడపడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలు… డేవిడ్ హ్యూం, స్కాటిష్ తత్త్వవేత్త

సామాజిక కార్య కలాపాలు తాత్త్విక దృష్టితో చూసే వారికి, అన్నిటికంటే, అతి తక్కువమందిచే అతి ఎక్కువమంది అంత స్పష్టంగా అణిగిమణిగి, తమ పాలకుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తమ అభిప్రాయాలను మలుచుకుని, అంత సులభంగా పరిపాలించబడటం ఆశ్చర్యంగొలపక మానదు. ఇంత ఆశ్చర్యకరంగా ఎలా అమలుపరచగలుగుతున్నారని మనం ఒక సారి తర్కించి చూస్తే, మనకి అసలు అధికారం పాలితుల చేతులో ఉందనీ, పాలకులకు ప్రజాభిప్రాయం తప్ప వారి వెనక మరొకటి లేదనీ స్పష్టం అవుతుంది. కనుక, ప్రభుత్వాలు కేవలం అభిప్రాయం ఆధారంగానే ఏర్పడతున్నాయి; ఈ సూత్రం అత్యంత నిరంకుశప్రభుత్వాలనుండి, సైనిక పాలనలనుండి, మిక్కిలి స్వేచ్ఛగా ఎన్నుకోబడ్డ, మిక్కిలి జనామోదమైన ప్రభుత్వాలవరకూ వర్తిస్తుంది. ఈజిప్టుకి చెందిన సోల్డాన్ గాని 1, రోమను చక్రవర్తిగాని, నిరపాయులైన వాళ్ళ ప్రజల్ని వాళ్ళ అభిప్రాయాలకీ, ఇష్టాలకీ విరుద్ధంగా పశువుల్ని తోలినట్టు తోలి ఉండవచ్చు; కాని వాళ్లు తమ మామ్యుల్యూక్స్నీ2, ప్రీటోరియన్ బాండ్స్ నీ3, వాళ్ళ అభిప్రాయానికి విలువిచ్చి మనుషుల్లాగే నడిపేరు.

విశ్లేషించి చూస్తే, అభిప్రాయం రెండు విధాలు: ఒకటి స్వప్రయోజనంతో కూడిన అభిప్రాయం; రెండవది హక్కుకు సంబంధించిన అభిప్రాయం. ఇక్కడ స్వప్రయోజనం అన్నపుడు, నేను ముఖ్యంగా అర్థం చేసుకున్నది ఒక ప్రభుత్వం ఉండడం వల్ల మనకు ఒనగూడే ప్రయోజనం; ఒక ప్రత్యేకమైన ప్రభుత్వాన్ని నిలబెట్టిన తర్వాత, దాన్ని మనకు అనువుగా మలుచుకోవడంతో పాటు, ఏ ప్రభుత్వాన్నైనా సులభంగా ఏర్పాటు చేసి దానివల్ల లబ్దిపొందగలగడం. దేశంలోని ఎక్కువమంది ప్రజలలో ఈ అభిప్రాయం గనక ప్రబలంగా ఉంటే, ఏర్పడిన ఏ ప్రభుత్వానికైనా అది ఒక పెద్ద రక్షణ.

హక్కులు మళ్ళీ రెండు రకాలు: ఒకటి అధికారాన్ని పొందడానికి హక్కు, రెండవది ఆస్తిని కలిగి ఉండడానికి హక్కు. మానవ మస్తిష్కం మీద మొదటి రకమైన హక్కు ఎంత బలీయమైన ముద్ర వేసిందో తెలుసుకుందికి అన్ని దేశాల్లోనూ వారి వారి ప్రాచీన ప్రభుత్వాలతోటీ, ఆ పేర్లతోటీ వాళ్లు తమ అనుబంధాన్ని పెనవేసుకునే తీరు గమనిస్తే చాలు. అసలు ప్రాచీనతే ఒక హక్కుగా పరిణమిస్తుంది. మనుషుల ప్రవృత్తుల గురించి మనకి ఎన్నెన్ని చెడు అభిప్రాయాలు ఉన్నాయో, అవన్నీ సామాన్య న్యాయం చెయ్యవలసిన సందర్భాల్లో రక్తానికీ, సంపదకీ విలువనిచ్చి అధికారాన్ని దుర్వినియోగం చేసిన అనేక సందర్భాల మూలంగా ఏర్పడినవి. (అ) స్థూలంగా చూసినపుడు ఆధునిక కాలంలో మనుషుల మానసిక స్థితిలో మనకి ఏ రకమైన వైరుద్ధ్యమూ కనిపించదు. మనుషులు తమ అభిప్రాయాన్ని ప్రకటించడానికి ఒక ముఠాగా ఏర్పడి,వాళ్ళ రాజకీయ పార్టీ ప్రయోజనాలకి అనుగుణంగా ప్రవర్తిస్తున్నప్పుడు, సహజంగానే వాళ్ళకి విలువలనీ, అనుబంధాలనీ నిర్లక్ష్యంచేసినందుకు సిగ్గుగాని, విచారముగాని వెయ్యకపోవడంలో ఆశ్చర్యం లేదు; అయినప్పటికీ, కొన్ని విలువలూ, హక్కులు ప్రాతిపదికగా ఒక ముఠాగా ఏర్పడినపుడు, వాళ్లలో సమానత్వం, న్యాయం చెయ్యడం పట్ల నిబద్ధతా, తమ అభిప్రాయాన్ని ప్రకటించడంలో పట్టుదల ప్రదర్శించడమూ చూడగలం. ఈ రకమైన సామాజిక చిత్తవృత్తే, ఈ రకమైన వైరుధ్యాలు కనిపించడానికి కారణం అవుతోంది.

ప్రభుత్వాలు నిర్వహించడంలో ఆస్తి హక్కు కలిగి ఉండడం గురించిన అభిప్రాయం కీలకమని అందరికీ తెలిసినదే. ఒక ప్రముఖ రచయిత అన్ని ప్రభుత్వాలకీ ఆస్తే మూలాధారమని సిద్ధాంతీకరించేడు.1; ఆ విషయంలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఈ విషయంలో అతన్ని అనుసరించడానికి సుముఖంగా ఉన్నారు. కానీ అది విషయాన్ని అతిగా వ్యాఖ్యానించడమే; అయినప్పటికీ, ఆసి హక్కు గురించిన అభిప్రాయం ప్రభుత్వాలని ఏర్పాటు చెయ్యడంలో ప్రాముఖ్యత వహిస్తుందన్నది ఒప్పుకోక తప్పదు.

కనుక ఈ మూడు అభిప్రాయాల … ప్రజల స్వలాభం, అధికారపు హక్కు, ఆస్తి హక్కు… ఆధారంగానే అన్ని ప్రభుత్వాలూ ఏర్పడతాయి, కొద్దిమంది అధికారం అందరిమీదా చెలామణీ అవుతుంది. నిజానికి వీటికి తోడుగా మరికొన్ని సూత్రాలు ఉన్నాయి గాని, అవి వీటికి మరింత బలాన్నివ్వడమో, నిర్వచించడమో, పరిధిని నిర్ణయించడమో, లేక వేరే అభిప్రాయాన్ని ప్రతిపాదించడమో చేస్తాయి. ఉదాహరణకి వ్యక్తిగతప్రయోజనం, భయం, అపేక్ష మొదలైనవి. అయినప్పటికీ ఈ ఇతర సూత్రాలు, పైన పెర్కొన్న సూత్రాల ప్రభావం ముందుగా ఉంటే తప్ప, వాటంతట అవి ఏ రకమైన ప్రభావాన్ని చూపలేవని సూత్రీకరించవచ్చు. కనుక వాటిని ప్రభుత్వం ఏర్పరచడానికి ప్రాధమిక సూత్రాలుగా కాక, గౌణ సూత్రాలుగా పరిగణించవచ్చు.

ఎందుకంటే, ముందుగా స్వలాభాపేక్షని చూస్తే, ఆ మాట వాడడంలో నా ఉద్దేశ్యం ప్రభుత్వం ఏర్పడడం ద్వారా లభించే రక్షణకి అదనంగా, ఒక ప్రత్యేకమైన బిరుదులూ సత్కారాలూ ఆశించడం; అలా జరగాలంటే, ముందుగా ఒక ప్రభుత్వం అంటూ ఏర్పడడం ఆవశ్యకం గదా. ఆ బహుమానమో, ఆ గుర్తింపో పొందడం ద్వారా, కొందరి వ్యక్తులమీద తమ అధికారానికి మరింత బలం చేకూరవచ్చు; కానీ ప్రజలపై ప్రభావం చూపించడానికి సంబంధించినంతవరకు, అది స్వయంగా తనంత తాను సృష్టించుకోలేదు. మనుషులు సహజంగా తమ స్నేహితులనుండీ, పరిచయస్థులనుండీ, ఉపకారాన్ని ఆశిస్తారు; కనుక, దేశంలో చాలా మంది వ్యక్తుల ఆకాంక్షలు, వాళ్ళు ఏ వ్యక్తులనుండి ఇటువంటి స్వప్రయోజనాన్ని ఆశిస్తున్నారో వాళ్ళకి అధికారం లేకున్నా, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చెయ్యగల సమర్థత లేకున్నా, వాళ్ళపై కేంద్రీకృతమవవు. ఇదే పరిశీలనని మిగతా రెండింటికీ… భయానికీ, ప్రేమకీ… వర్తింపచెయ్యవచ్చు. తనకి ఏ రకమైన అధికారమూ లేనప్పుడు ఏ వ్యక్తి అయినా, ఒక నియంత కోపం గురించి భయపడడానికి భయం తప్ప, వేరే కారణం కనిపించదు. ఎందుకంటే, కేవలం ఒక వ్యక్తిగా అతని శారీరక బలం ప్రభావం చూపగలిగిన ఆవరణ చాలా చిన్నది; దాన్ని మించి అతనికి ఉన్న శక్తి అంతా మన అభిప్రాయం మీదో, లేదా అతనికి ఉన్నదని ఇతరులు అనుకోవడం మీద ఆధారపడినదో తప్ప మరొకటి కాదు. ఒక రాజుకి ఉన్న తెలివితేటలమీదా, నైతికవిలువలమీదా ప్రజలకున్న ప్రేమ చాల దూరం పోయినా, ముందు అతనికంటూ కొంత ప్రజామోదకరమైన శీలం అన్నది ఉండి ఉండాలి; లేకపోతే, అతనిపట్ల ప్రజలకున్న గౌరవం అతనికి ఉపకరించదు; అతని శీలానికి కూడా ఏ చిన్న వలయంలోనో తప్ప పెద్ద ప్రభావం కూడా ఉండదు.

కొన్ని ప్రభుత్వాలు కొన్ని తరాలు కొనసాగవచ్చు, అధికారం, ఆస్తుల విషయంలో సమతౌల్యం లేనప్పటికీ. ఇది ముఖ్యంగా ఎలాటిచోట జరుగుతుందంటే, ఒక రాజుగాని, పదవి అధిరోహించినవారుగాని ఆ దేశంలో అత్యధికమైన ఆస్తి సంపాదించగలిగి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం లో ఏ రకమైన భాగస్వామ్యం లేని చోట. ప్రజా వ్యవహారాలలో జోక్యం కలిగించుకుందికి అటువంటి వ్యక్తి ఏ నెపం దొరుకుతుంది? ప్రజలు సంప్రదాయంగా వస్తున్న తమ ప్రభుత్వాలతో ఒక రకమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారు గనుక, అటువంటి అధికార దుర్వినియోగానికి ప్రజలు ఆమోదం తెలుపుతారని ఆశించకూడదు. కాని, ప్రాథమిక రాజ్యాంగమే అటువంటి అధికార భాగస్వామ్యానికి అనుమతిస్తే, అది ఎంత చిన్నపాటిది అయినా, దేశపు ఆస్తిలో ఎక్కువ వాటా కలిగి ఉన్న సమూహాలు, క్రమక్రమంగా తమ అధికారాన్ని పొడిగిస్తూ, అధికారానికీ ఆస్తికీ మధ్య సమతౌల్యాన్ని సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. ఇగ్లండులో “హౌస్ ఆఫ్ కామన్స్ లో ” జరుగుతున్నది అదే.

బ్రిటిష్ ప్రభుత్వం గురించి వ్రాసిన రచయితలందరూ, గ్రేట్ బ్రిటన్ లోని దిగువ సభ సామాన్యులందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి, అధికారం పంపకంలో దాని వాటా, అది ప్రాతినిధ్యం వహించే ప్రజల ఆస్తుల మొత్తానికీ, వాళ్ళ హక్కుల మొత్తానికీ అనులోమానుపాతంలో విభాగించబడిందని తలపోసారు. కానీ, దీన్ని పూర్వపక్షం చెయ్యలెని సత్యంగా స్వీకరించవలసిన పనిలేదు. రాజ్యాంగంలో మిగతా విషయాలన్నిటికంటే, ప్రజలు తమని ఎక్కువగా హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువసభ)తో అనుసంధానం చేసుకున్నప్పటికీ; తమ స్వేచ్చా స్వాతంత్ర్యాల సంరక్షకులుగా తాము ఎన్నుకునే ప్రతినిధులను భావించుకుంటున్నప్పటికీ, చాలా సందర్భాల్లో, ముఖ్యంగా రాజు/ రాణికి వ్యతిరేకంగా అభిప్రాయం ప్రకటించిన సమయంలో కూడా, సభ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రవర్తించలేదు. దానికి ఉదాహరణగా, రాజు విలియం పరిపాలనా కాలంలో, టోరీల సభను పేర్కొన వచ్చు. డచ్చి డిప్యూటీల్లా, ఈ ప్రతినిధులుకూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహించే పరజల ఆదేశాలు తీసుకోవాలసిన నియమం ఉండి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేది. నిజంగా గ్రేట్ బ్రిటన్ లోని సామాన్యప్రజల అధీనంలో ఉన్న సమస్త సంపదా, అధికారమూ గనక అధికార పంపిణీకి పరిగణనలోకి తీసుకు రాగలిగితే, రాచరికం అంత అసంఖ్యాక ప్రజానీకంపై తన ప్రభావం చూపించగలదని గాని, అధికారాన్ని తలక్రిందులుచెయ్యగల ఆ ఆస్తి మొత్తం ముందు నిలవగలదని గాని, మనం ఊహించలేము. ఒకటి మత్రం నిజం: రాచరికానికానికి ఎన్నికైన ప్రతినిధులసమూహంపై ఎక్కువ ప్రభావం కలిగి ఉంది. కానీ ఇప్పుడు ఏడేళ్ళకొకసారి మాత్రమే ప్రదర్శించే ఈ ప్రభావాన్ని, ప్రతి వ్యక్తి దగ్గరకీ వచ్చి ఓటు సంపాదించుకోవడంలో చూపించవలసి వస్తే, అది త్వరలోనే ఎందుకూ కొరగాకుండా పోతుంది… ఎంత నైపుణ్యం, ఎంత ప్రజాదరణ, ఎంత ధనబలం దాని వెనక ఉన్నప్పటికీ.

కనుక, నా ఉద్దేశ్యంలో ఈ ఏర్పాటులో ఏ చిన్న పాటి తేడా ఉన్నా, మొత్తం ప్రభుత్వ స్వరూపమే మరిపోతుంది. త్వరలోనే, అది నిజమైన ప్రజాతంత్ర దేశంగా అవతరిస్తుంది… బహుశా, ఏ రకమైన అసౌకర్యమూ కలిగించని ప్రజాప్రభుత్వదేశంగా అవతరించవచ్చు. రోమను తెగల్లా ప్రజలు ఒక వ్యవస్థగా ఏర్పాతయినప్పుడు, వాళ్ళని ఎంతగా నియంత్రించలేక పోయినప్పటికీ, అదే వాళ్ళు విడివిడిగా వర్గాలుగా చీలిపోయినపుడు, అంతకంటే ఎక్కువగా ఆలోచనా, క్రమశిక్షణా లేకుండా ఉంటారు. ఎగిసిపడే కెరటాలవంటి “ప్రజాదరణ” ప్రభావం చాలవరకు తగ్గుముఖం పడుతుంది. ప్రజాప్రయోజనం అన్నది స్థిరంగా, ఒక క్రమపద్ధతిలో అనుసరించబడుతుంది. ఇంతకంటే ఎక్కువగా , ఈ దేశంలో అమలులోకి రావడానికి అవకాశంలేనిదీ, ఇక్కడ ఉన్న ఏ రాజకీయ పార్టీ లక్ష్యం కానటువంటి ప్రభుత్వం గురించీ, ఆలోచించవలసిన అవసరం లేదు. కనుక ప్రమాదకరమైన అటువంటి ప్రయోగాలగురించి ఆవేశంగా ఆలోచించడం కంటే, అమలులో ఉన్న పురాతన వ్యవస్థనే సాధ్యమైనంతవరకు మెరుగుపరచడానికి ఆలోచిద్దాం. (b)

[1 ][Probably James Harrington (1611–1677), author of the Commonwealth of Oceana (1656), who maintained that the balance of political power depends upon the balance of property, especially landed property.]

[2 ][During the period from 1698 to 1701, the House of Commons, under Tory control, opposed measures taken by William III for the security of Europe against Louis XIV of France. When the county of Kent sent petitioners to London in 1701 to chide the House of Commons for its distrust of the king and its delay in voting supplies, the petitioners were arrested. Public disgust at the treatment of the Kentish petitioners was expressed in a Whig pamphlet called the Legion Memorial (1701). The Kentish Petition and the Legion Memorial proved that popular feeling was on the king’s side in this struggle with the Commons.]

[a]Editions A to P insert as follows:—This passion we may denominate enthusiasm, or we may give it what appellation we please; but a politician, who should overlook its influence on human affairs, would prove himself but of a very limited understanding.

Editions A and B omit the remainder of the paragraph.

[b]Editions A to N add the following paragraph:—I shall conclude this subject with observing, that the present political controversy, with regard to instructions, is a very frivolous one, and can never be brought to any decision, as it is managed by both parties. The country-party pretend not, that a member is absolutely bound to follow instructions, as an ambassador or general is confined by his orders, and that his vote is not to be received in the house, but so far as it is conformable to them. The court-party again, pretend not, that the sentiments of the people ought to have no weight with every member; much less that he ought to despise the sentiments of those he represents, and with whom he is more particularly connected. And if their sentiments be of weight, why ought they not to express these sentiments? The question, then, is only concerning the degrees of weight, which ought to be plac’d on instructions. But such is the nature of language, that it is impossible for it to express distinctly these different degrees; and if men will carry on a controversy on this head, it may well happen, that they differ in their language, and yet agree in their sentiments; or differ in their sentiments, and yet agree in their language. Besides, how is it possible to find these degrees, considering the variety of affairs which come before the house, and the variety of places which members represent? Ought the instructions of Totness to have the same weight as those of London? or instructions, with regard to the Convention, which respected foreign politics, to have the same weight as those with regard to the excise, which respected only our domestic affairs?

1: [Soldan:]sultan; the supreme ruler of one or another of the great Mohammedan powers or countries of the Middle Ages.

2: [Mamalukes:]members of the military body, originally composed of Caucasian slaves, that seized the throne of Egypt in 1254 and continued to form the ruling class in that country during the eighteenth century.

3: [Prætorian bands:]the bodyguards of the emperors of ancient Rome.

[Prodigal:]lavish; wasteful.

[In no stead:]to no advantage.

(David Hume, Essays Moral, Political, Literary, edited and with a Foreword, Notes, and Glossary by Eugene F. Miller, with an appendix of variant readings from the 1889 edition by T.H. Green and T.H. Grose, revised edition (Indianapolis: Liberty Fund 1987). Chapter: ESSAY IV: OF THE FIRST PRINCIPLES OF GOVERNMENT

OF THE FIRST PRINCIPLES OF GOVERNMENT

Nothing appears more surprizing to those, who consider human affairs with a philosophical eye, than the easiness with which the many are governed by the few; and the implicit submission, with which men resign their own sentiments and passions to those of their rulers. When we enquire by what means this wonder is effected, we shall find, that, as Force is always on the side of the governed, the governors have nothing to support them but opinion. It is therefore, on opinion only that government is founded; and this maxim extends to the most despotic and most military governments, as well as to the most free and most popular. The soldan(1) of Egypt, or the emperor of Rome, might drive his harmless subjects, like brute beasts, against their sentiments and inclination: But he must, at least, have led his mamalukes,(2) or prætorian bands,(3) like men, by their opinion.

Opinion is of two kinds, to wit, opinion of interest, and opinion of right. By opinion of interest, I chiefly understand the sense of the general advantage which is reaped from government; together with the persuasion, that the particular government, which is established, is equally advantageous with any other that could easily be settled. When this opinion prevails among the generality of a state, or among those who have the force in their hands, it gives great security to any government.

Right is of two kinds, right to Power and right to Property. What prevalence opinion of the first kind has over mankind, may easily be understood, by observing the attachment which all nations have to their ancient government, and even to those names, which have had the sanction of antiquity. Antiquity always begets the opinion of right; and whatever disadvantageous sentiments we may entertain of mankind, they are always found to be prodigal° both of blood and treasure in the maintenance of public justice.(a) There is, indeed, no particular, in which, at first sight, there may appear a greater contradiction in the frame of the human mind than the present. When men act in a faction, they are apt, without shame or remorse, to neglect all the ties of honour and morality, in order to serve their party; and yet, when a faction is formed upon a point of right or principle, there is no occasion, where men discover a greater obstinacy, and a more determined sense of justice and equity. The same social disposition of mankind is the cause of these contradictory appearances.

It is sufficiently understood, that the opinion of right to property is of moment in all matters of government. A noted author has made property the foundation of all government;1 and most of our political writers seem inclined to follow him in that particular. This is carrying the matter too far; but still it must be owned, that the opinion of right to property has a great influence in this subject.

Upon these three opinions, therefore, of public interest, of right to power, and of right to property, are all governments founded, and all authority of the few over the many. There are indeed other principles, which add force to these, and determine, limit, or alter their operation; such as self-interest,fear, and affection: But still we may assert, that these other principles can have no influence alone, but suppose the antecedent influence of those opinions above-mentioned. They are, therefore, to be esteemed the secondary, not the original principles of government.

For, first, as to self-interest, by which I mean the expectation of particular rewards, distinct from the general protection which we receive from government, it is evident that the magistrate’s authority must be antecedently established, at least be hoped for, in order to produce this expectation. The prospect of reward may augment his authority with regard to some particular persons; but can never give birth to it, with regard to the public. Men naturally look for the greatest favours from their friends and acquaintance; and therefore, the hopes of any considerable number of the state would never center in any particular set of men, if these men had no other title to magistracy, and had no separate influence over the opinions of mankind. The same observation may be extended to the other two principles of fear and affection. No man would have any reason to fear the fury of a tyrant, if he had no authority over any but from fear; since, as a single man, his bodily force can reach but a small way, and all the farther power he possesses must be founded either on our own opinion, or on the presumed opinion of others. And though affection to wisdom and virtue in a sovereign extends very far, and has great influence; yet he must antecedently be supposed invested with a public character, otherwise the public esteem will serve him in no stead,° nor will his virtue have any influence beyond a narrow sphere.

A Government may endure for several ages, though the balance of power, and the balance of property do not coincide. This chiefly happens, where any rank or order of the state has acquired a large share in the property; but from the original constitution of the government, has no share in the power. Under what pretence would any individual of that order assume authority in public affairs? As men are commonly much attached to their ancient government, it is not to be expected, that the public would ever favour such usurpations. But where the original constitution allows any share of power, though small, to an order of men, who possess a large share of the property, it is easy for them gradually to stretch their authority, and bring the balance of power to coincide with that of property. This has been the case with the house of commons in England.

Most writers, that have treated of the British government, have supposed, that, as the lower house represents all the commons of Great Britain, its weight in the scale is proportioned to the property and power of all whom it represents. But this principle must not be received as absolutely true. For though the people are apt to attach themselves more to the house of commons, than to any other member of the constitution; that house being chosen by them as their representatives, and as the public guardians of their liberty; yet are there instances where the house, even when in opposition to the crown, has not been followed by the people; as we may particularly observe of the tory house of commons in the reign of king William.2 Were the members obliged to receive instructions from their constituents, like the Dutch deputies, this would entirely alter the case; and if such immense power and riches, as those of all the commons of Great Britain, were brought into the scale, it is not easy to conceive, that the crown could either influence that multitude of people, or withstand that overbalance of property. It is true, the crown has great influence over the collective body in the elections of members; but were this influence, which at present is only exerted once in seven years, to be employed in bringing over the people to every vote, it would soon be wasted; and no skill, popularity, or revenue, could support it. I must, therefore, be of opinion, that an alteration in this particular would introduce a total alteration in our government, and would soon reduce it to a pure republic; and, perhaps, to a republic of no inconvenient form. For though the people, collected in a body like the Roman tribes, be quite unfit for government, yet when dispersed in small bodies, they are more susceptible both of reason and order; the force of popular currents and tides is, in a great measure, broken; and the public interest may be pursued with some method and constancy. But it is needless to reason any farther concerning a form of government, which is never likely to have place in Great Britain, and which seems not to be the aim of any party amongst us. Let us cherish and improve our ancient government as much as possible, without encouraging a passion for such dangerous novelties.(b)

[1 ][Probably James Harrington (1611–1677), author of the Commonwealth of Oceana (1656), who maintained that the balance of political power depends upon the balance of property, especially landed property.]

[2 ][During the period from 1698 to 1701, the House of Commons, under Tory control, opposed measures taken by William III for the security of Europe against Louis XIV of France. When the county of Kent sent petitioners to London in 1701 to chide the House of Commons for its distrust of the king and its delay in voting supplies, the petitioners were arrested. Public disgust at the treatment of the Kentish petitioners was expressed in a Whig pamphlet called the Legion Memorial (1701). The Kentish Petition and the Legion Memorial proved that popular feeling was on the king’s side in this struggle with the Commons.]

[a]Editions A to P insert as follows:—This passion we may denominate enthusiasm, or we may give it what appellation we please; but a politician, who should overlook its influence on human affairs, would prove himself but of a very limited understanding.

Editions A and B omit the remainder of the paragraph.

[b]Editions A to N add the following paragraph:—I shall conclude this subject with observing, that the present political controversy, with regard to instructions, is a very frivolous one, and can never be brought to any decision, as it is managed by both parties. The country-party pretend not, that a member is absolutely bound to follow instructions, as an ambassador or general is confined by his orders, and that his vote is not to be received in the house, but so far as it is conformable to them. The court-party again, pretend not, that the sentiments of the people ought to have no weight with every member; much less that he ought to despise the sentiments of those he represents, and with whom he is more particularly connected. And if their sentiments be of weight, why ought they not to express these sentiments? The question, then, is only concerning the degrees of weight, which ought to be plac’d on instructions. But such is the nature of language, that it is impossible for it to express distinctly these different degrees; and if men will carry on a controversy on this head, it may well happen, that they differ in their language, and yet agree in their sentiments; or differ in their sentiments, and yet agree in their language. Besides, how is it possible to find these degrees, considering the variety of affairs which come before the house, and the variety of places which members represent? Ought the instructions of Totness to have the same weight as those of London? or instructions, with regard to the Convention, which respected foreign politics, to have the same weight as those with regard to the excise, which respected only our domestic affairs?

1: [Soldan:]sultan; the supreme ruler of one or another of the great Mohammedan powers or countries of the Middle Ages.

2: [Mamalukes:]members of the military body, originally composed of Caucasian slaves, that seized the throne of Egypt in 1254 and continued to form the ruling class in that country during the eighteenth century.

3: [Prætorian bands:]the bodyguards of the emperors of ancient Rome.

[Prodigal:]lavish; wasteful.

[In no stead:]to no advantage.

(David Hume, Essays Moral, Political, Literary, edited and with a Foreword, Notes, and Glossary by Eugene F. Miller, with an appendix of variant readings from the 1889 edition by T.H. Green and T.H. Grose, revised edition (Indianapolis: Liberty Fund 1987). Chapter: ESSAY IV: OF THE FIRST PRINCIPLES OF GOVERNMENT

Accessed from http://oll.libertyfund.org/title/704/137484 on 2013-02-24)

స్వాతంత్య్రాన్నయినా యినా ఇవ్వు, లేకుంటే మృత్యువైనా !… పాట్రిక్ హెన్రీ, అమెరికను

(అమెరికా స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా  ఆ దేశ స్వాతంత్య్రానికీ, వ్యక్తి స్వేచ్ఛకీ, సర్వమానవ సౌభ్రాతృత్వానికీ అసలు అమెరికను తత్త్వానికి పునాది వేసిన  జార్జి వాషంగ్టన్, అబ్రహాం లింకన్ వంటి మహానుభావుల్ని వారి మానవీయ ఆదర్శాలనీ స్మరించుకుంటూ, వారి ఆదర్శాలని ఆచరణలో పెట్టడానికి చిత్తశుద్ధిగల రాజకీయ నాయకులు మళ్ళీ అమెరికాలో అవతరించాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటూ అమెరికను పౌరులందరికీ శుభాకాంక్షలు.

అధికారాన్ని తమ స్వంతలాభానికీ, తమపిల్లలకి దోచిపెట్టడానికి కాకుండా, తాము పదవీ ప్రమాణం చేసినప్పుడు పలికిన మాటలకి కట్టుబడుతూ దేశప్రజలకీ, దేశ రాజ్యాంగ స్ఫూర్తికీ పునరంకితమవగల రాజకీయ నాయకులు మనదేశంలో మళ్ళీ పుట్టాలంటే, ఈ నాటి యువతరానికి ఇటువంటి ఉపన్యాసాలు చదవడం మంచిదన్న ఆలోచనతో ఇది సవినయంగా సమర్పిస్తున్నాను.  ఏ ఒక్కరు ఉజ్జేతులవగలినా నా ప్రయత్నం సార్థకమైనట్టు భావిస్తాను.)

American Flag
American Flag (Photo credit: Cristian_RH7)

ఇంతసేపూ ఈ సభనుద్దేశించి ప్రసంగించిన విశిష్ట వ్యక్తుల దేశభక్తినీ, శక్తిసామర్థ్యాలనీ నాకంటే ఉన్నతంగా ఎవరూ సంభావించరు. కాని విభిన్న కారణాలవల్ల భిన్న వ్యక్తులు ఒకే విషయాన్ని వేర్వేరు కోణంలో చూడడం సర్వ సాధారణమైన విషయం; అందుచేత, వాళ్ల అభిప్రాయాలకు వ్యతిరేకమైన అభిప్రాయాలు కలిగి ఉన్న నేను నిర్భయంగా, ఏ అరమరికలు లేకుండా చెప్పడాన్ని వాళ్ళని  అవమానిస్తున్నట్టుగా భావించరని విశ్వసిస్తున్నాను. అయినా, ఇది మర్యాదలు పాటించడానికి సమయం కాదు. ఈ సభముందున్న సమస్య ఈ దేశానికి సంబంధించి అతి కీలకమైనది. నా వరకు, అది స్వాతంత్ర్యమో, దాస్యమో తేల్చుకోవలసినంత సమస్యకి ఏమాత్రం తీసిపోదని భావిస్తున్నాను; కనుక సమస్యకున్న తీవ్రత స్థాయిని బట్టి చర్చకూడ స్వేచ్ఛగా జరగాలి. అలాచెయ్యడంవల్ల మాత్రమే మనం సత్యానికి చేరువగా వచ్చి ఈ దేశానికీ, భగవంతుడికీ మనకున్న గురుతరమైన బాధ్యతని నిర్వర్తించగలమని ఆశిస్తున్నాను. ఇటువంటి సంక్లిష్ట సమయంలో మీ గౌరవానికి భంగం కలిగిస్తున్నానేమోనన్న భయంతో నా అభిప్రాయాలని నాలోనే అణచుకుంటే, నేను దేశద్రోహం చేసిన అపరాథంతోపాటు, ఈ భూమ్మీద అన్ని సార్వభౌమత్వాలకంటే మిన్నగా ఆ పైనున్న పరంధామునికి విశ్వాసఘాతం చేసినవాడినవుతాను.

అధ్యక్ష మహాశయా! మనిషి సహజంగా ఆశాలోలుడు. ఎదురుగా కనిపిస్తున్న బాధాకరమైన సత్యాన్ని విస్మరించి, మనల్ని మృగాలుగా మార్చే ఇంపైన అబద్ధాలకి చెవులొగ్గివినడం అలవాటే. కానీ, మహత్తరమైన స్వాతంత్ర్య సముపార్జనకి తీవ్రంగా కృషిచేస్తున్న మేధావులకి ఇది తగినపనేనా? వాళ్ళ లౌకిక విముక్తికి కళ్ళుండి చూడలేని వాళ్ళూ, చెవులుండి వినలేని సామాన్య జనాల్లా మనం కూడా ప్రవర్తించడానికే నిర్ణయించుకుందామా? నాకు సంబంధించినంతవరకు, మనసుకి ఎంత క్షోభకలిగినా, అసలు సత్యం ఏమిటో పూర్తిగా తెలుసుకోదలుచుకున్నాను; రాబోయే అనర్థం ఎంతటిదైనా తెలుసుకుని ఆ మూల్యాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను.

నా కాళ్ళు ముందుకి కదిలేది ఒక్క దీపపు వెలుగులోనే… అదే అనుభవమనే దీపం. గత అనుభవ ప్రమాణంతో తప్ప భవిషత్తుని అంచనావెయ్యగల మరోమార్గం నాకు తెలీదు. గత అనుభవాన్ని బట్టి చూస్తే, ఈ సభనీ, తమనీ సంతృప్తిపరచుకుందికి, గౌరవనీయ సభ్యులకి గత పది సంవత్సరాలుగా బ్రిటిషు ప్రభుత్వపు ప్రవర్తనలో ఏమి కనిపించిందో తెలుసుకోగోరుతున్నాను. మనం తాజాగా సమర్పించిన వినతిపత్రాన్ని స్వీకరిస్తునపుడు వాళ్ల పెదాలపై మొలిచిన కపట దరహాసమా? ఆర్యా! దాన్ని నమ్మకండి! అది మీ కాళ్లకి సంకెలగా పరిణమిస్తుంది. ఒక ముద్దుకు వంచింపబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇంత ఔదార్యంతో స్వీకరించిన మన వినతిపత్రానికీ, ఈ దేశాన్ని కమ్ముకుంటున్న సముద్రజలాలపై నెలకొంటున్న యుద్ధ వాతావరణానికీ ఎలా పొత్తుకుదురుతుందో మిమ్మల్నిమీరొక్కసారి ప్రశ్నించుకొండి. యుద్ధ నౌకలూ, సైన్యమూ ప్రేమకీ, రాజీప్రయత్నాలకీ అవసరమా? బలప్రయోగంద్వారా మాత్రమే మన విశ్వాసాన్ని తిరిగిపొందడానికి, మనం రాజీ ప్రయత్నాలకి అంత విముఖత చూపించేమా? ఆర్యా, మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. ఇవి యుద్ధానికీ, అణచివేతకీ ఉపయోగించే సాధనసంపత్తులు; మహరాజులు అవలంబించే చివరి ఉపకరణాలు. గౌరవనీయులైన సభ్యులని నేనడిగేది ఒకటే: మనల్ని అణగదొక్కడానికి కాకపోతే, ఈ యుద్ధవ్యూహాల ఆంతర్యం ఏమిటి? గౌరవ సభ్యులు వేరొక కారణాన్ని ఊహించగలరా? ఈ సేనల్నీ, యుద్ధనౌకల్నీ ఇక్కడ మోహరించడానికి, ఈ ప్రాంతంలో బ్రిటనుకి శత్రువులెవ్వరైనా ఉన్నారా? ఆర్యా, లేరు గాక లేరు. అవి మనమీద ఉపయోగించడానికే; వాటి లక్ష్యం వేరెవ్వరూ కాదు. ఇంతకాలమూ బ్రిటిషుప్రభుత్వం మనకి తగిలించిన సంకెళ్ళను మరింతగా బిగించి పటిష్టం చెయ్యడానికి అవి పంపబడ్డాయి. వాటిని ఎదిరించడానికి మనదగ్గర ఏమున్నాయి?  మనం వాళ్లతో వాదిద్దామా? మనం గత పదిసంవత్సరాలుగా వాళ్లతో చేస్తున్న పని అదే! మనం ఈ విషయం మీద వాళ్ళకి కొత్తగా చెప్పడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఈ విషయాన్ని ఎన్ని కోణాల్లో చెప్పడానికి సాధ్యమవుతుందో అన్ని రకాలుగానూ విశదపరచడం జరిగింది; కానీ అది నిష్ఫలమైపోయింది. మనం ఇంక బ్రతిమాలటలకీ, దీనంగా అర్థించడానికీ దిగిపోవాలా? ఇంతవరకు ప్రయత్నించని ఏ కొత్త షరతులు మనం ప్రతిపాదించగలం? మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మనల్ని మనం మోసగించుకోవద్దు. ఏ తుఫానైతే ఇప్పుడు కమ్ముకొస్తోందో దాన్ని నివారించడానికి ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చర్యలూ చేపట్టాము. మనం విజ్ఞాపన చేశాం; మన ఆక్షేపణలు తెలియజేశాం; అభ్యర్థించేం; సింహాసనం ముందు మోకరిల్లి, ఈ ప్రభుత్వమూ, ఈ పార్లమెంటూ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలను అరికట్టడానికి జోక్యం చేసుకోవలసిందిగా వేడుకున్నాం. మన వినతిపత్రాలు తిరస్కరించబడ్డాయి; మన ఆక్షేపణలు మరింత అవమానాన్నీ, మరింత హింసనీ మోసుకొచ్చేయి; మన అభ్యర్థనలు నిరాదరించబడ్డాయి; తిరస్కృతులమై సింహాసనం పాదాలదగ్గరనుండి గెంటివేయబడి అవమానంతో తిరిగొచ్చేం. ఇన్ని జరిగినతర్వాతకూడా శాంతీ, సామరస్యం గురించి వ్యర్థమైన ఆశలు పెట్టుకోగలమా? ఆశావహంగా ఉండాడానికి ఇప్పుడు ఎక్కడా తగిన కారణం కనిపించదు. మనం స్వతంత్రులుగా ఉండాలనుకుంటే… మనం ఇన్నాళ్ళూ ఏ అమూల్యమైన హక్కులకోసం పోరాడుతున్నామో వాటిని నిలబెట్టుకోవాలంటే; మనం ఆశించిన ఉదాత్తమైన అంతిమ లక్ష్యం నెరవేరేదాకా ఎట్టిపరిస్థితులలోనూ విడనాడకూడదని మనకి మనం ప్రమాణం చేసుకున్న ప్రతిఘటనని అర్థాంతరంగా పిరికిగా విడిచిపెట్టకూడదనుకుంటే… మన తక్షణ కర్తవ్యం ఇప్పుడు పోరాడడమే! మరొక్కసారి చెబుతున్నాను, మనం యుద్ధం చెయ్యవలసిందే! మనకి మిగిలిందల్లా ఆయుధాలు చేపట్టమని ప్రజలనీ, ఆశీస్సులిమ్మని భగవంతునీ ప్రార్థించడం ఒక్కటే.

ఆర్యా! వాళ్లనొచ్చు, మనం బలహీనులమని. బలీయమైన శత్రువుతో తలపడలేమని. అయితే, మనం ఎప్పుడు బలంగా ఉండగలం?  వచ్చే వారం? వచ్చే సంవత్సరం? మనల్ని పూర్తిగా నిరాయుధుల్ని చేసి ప్రతి ఇంట్లోనూ బ్రిటిషు సైనికుడు కాపలా ఉన్నప్పుడా? నిర్నిర్ణయత్వం, నిష్క్రియాపరత్వంద్వారా మనం బలోపేతమవగలమా? నేలమీద బార్లా కాళ్ళుజాపుకుని పడుక్కుని కనిపించని ఆశకోసం ఆకాశంవంక చూస్తున్నప్పుడు మనశత్రువు మన కాళ్ళూ చేతులూ బంధించినపుడు ఎదిరించడానికి తగిన శక్తిని సమకూర్చుకోగలమా? ఆర్యా, భగవంతుడు మన అధీనంలో ఉంచిన సాధనాలని సద్వినియోగం చేసుకోగలిగితే మనం ఎన్నటికీ బలహీనులం కాదు. స్వాతంత్ర్యమనే పవిత్ర లక్ష్యంకోసం సాయుధులైన లక్షలమంది ప్రజలున్న ఈ దేశంలో, శత్రువు మనమీదకి ఎంతమంది సైనికులని పంపినా, మనలని నిర్జించలేడు. అదిగాక, మనం యుద్ధాన్ని ఒంటరిగా చెయ్యబోవడం లేదు. దేశాల భవిష్యత్తులని నిర్ణయించగల న్యాయవర్తియైన భగవంతుడు పైన ఉన్నాడు, అతనే మనకి యుద్ధంలో సహాయం చెయ్యడానికి స్నేహితులని సమకూరుస్తాడు. ఆమాటకి వస్తే, ఆర్యా, యుద్ధాల్లో గెలుపు ఎప్పుడూ బలవంతుడిదే కాదు; ఎవరైతే సాహసవంతులో, జాగరూకులో, చురుకుగా ఉంటారో వాళ్లది.  అదిగాక, అధ్యక్షా మనకిప్పుడు వేరే ప్రత్యామ్నాయం లేదు. మనం అంత పిరికివాళ్లమైతే తప్ప, యుద్ధం నుండి విరమించుకుందికి ఇపుడు తరుణం మించిపోయింది. తలవంచి బానిసత్వం చెయ్యడం తప్ప వేరే గత్యంతరం లేదు. మన సంకెళ్లు అప్పుడే తయారయ్యాయి. బోస్టను మైదానాల్లో వాటి గలగలలు అప్పుడే వినిపిస్తున్నై. యుద్ధం ఇప్పుడు అనివార్యం! దాన్ని రానీండి. మరొక్క సారి చెబుతున్నా, అధ్యక్షా, యుద్ధం వస్తే రానీండి.

ఈ విషయాన్ని ఇంకా సాగదియ్యడం అనవసరం. శాంతీ శాంతీ అని పెద్దమనుషులు అనవచ్చు… కాని  శాంతికి ఆస్కారం లేదు.  నిజానికి యుద్ధం అప్పుడే ఆరంభం అయిపోయింది! ఉత్తరం నుండి వీయబోయే గాలి తరగ మన చెవులకి ఆయుధాల సంఘర్షించుకుంటున్న శబ్దాల్ని మోసుకొస్తుంది.  మన సోదరులు అప్పుడే యుద్ధరంగంలో ఉన్నారు. మనం ఇక్కడ ఎందుకు పనిలేక నిల్చున్నట్టు?  ఈ గౌరవనీయ సభ్యులు ఆశించేది ఏమిటి? వాళ్ళకి ఏమిటి కావాలి? శృంఖలాలతోనూ దాస్యంతోనూ కొనుక్కుందికి ప్రాణం అంత విలువైనదీ, శాంతి అంత తియ్యనిదీనా? సర్వశక్తిమయుడవైన ప్రభూ! అమంగళం ప్రతిహతమగుగాక! మిగతావాళ్ళు ఏ మార్గం అనుసరిస్తారో అనుసరించనీ; నాకు మాత్రం అయితే  స్వాతంత్ర్యాన్నయినా ఇవ్వు, లేకుంటే మృత్యువైనా !

.

పాట్రిక్ హెన్రీ

అమెరికను ప్రతినిధి

(Notes:

లెఫ్టినెంట్ గవర్నర్ డన్ మోర్, అతని రాయల్ మెరైన్స్ ప్రమేయాన్ని తప్పించుకుందికి, మార్చి 20, 1775 న, విలియమ్స్  బర్గ్ లోని కేపిటోల్ లో కాకుండా, రెండవ వర్జీనియా సమావేశం ఇప్పుడు సెయింట్ జోన్స్ చర్చిగా పిలవబడుతున్న నాటి రిచ్ మండ్ చర్చిలో జరిగింది. యుద్ధానికి కావలసిన సైన్యాన్ని సమకూర్చుకుందికీ, వర్జీనియాని రక్షణకవచంగా తీర్చిదిద్దడానికీ పాట్రిక్ హెన్రీ అనే ఒక ప్రతినిధి ప్రతిపాదనలు చేశాడు. కానీ హెన్రీకి వ్యతిరేకులు జార్జి III చక్రవర్తికి కాంగ్రెసు  పంపిన వినతిపత్రానికి సమాధానం వచ్చేదాకా జాగరూకతతోనూ, సహనంతోనూ ఉండవలసిందిగా అభ్యర్థించేరు.

23వ తేదీన, వర్జీనియాలో ప్రతి గ్రామంలోనూ సాయుధులైన సైనికులని గాని, ఆశ్వికదళాన్ని గాని తనే స్వయంగా సంఘటితపరచే ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. సంప్రదాయం ప్రకారం ఆ సమావేశానికి అధ్యక్షుడైన  విలియమ్స్  బర్గ్ కి చెందిన పేటన్ రుడోల్ఫ్ ని సంబోధిస్తూ ప్రసంగించేడు.  అతని మాటల్ని ఎవరూ వ్రాతప్రతిగా తిరగరాయకపోయినా, ఆరోజు అతన్ని విన్నవాళ్ళెవ్వరూ అతని వాగ్ధాటినిగాని, ముఖ్యంగా అతని చివరి వాక్యాలు “అయితే నాకు స్వాతంత్ర్యం ఇవ్వు, లేదా మృత్యువైనా” అన్న మాటలుగాని  మరిచిపోలేదు.)

Patrick Henry, portrait by George Bagby Matthe...
Patrick Henry, portrait by George Bagby Matthews c. 1891 after an original by Thomas Sully (Photo credit: Wikipedia)

Give Me Liberty Or Give Me Death

Patrick Henry

March 23, 1775.

No man thinks more highly than I do of the patriotism, as well as abilities,  of the very worthy gentlemen who have just addressed the House.  But different men often see the same subject in different lights; and, therefore, I hope it  will not be thought disrespectful to those gentlemen if, entertaining as I do  opinions of a character very opposite to theirs, I shall speak forth my  sentiments freely and without reserve.  This is no time for ceremony. The question before the House is one of awful moment to this country. For my own part, I consider it as nothing less than a question of freedom or slavery; and in proportion to the magnitude of the subject ought to be the freedom of the debate.  It is only in this way that we can hope to arrive at truth, and fulfill the great responsibility which we hold to God and our country.  Should I keep back my opinions at such a time, through fear of giving offense, I should consider myself as guilty of treason towards my country, and of an act of disloyalty toward the Majesty of Heaven, which I revere above all earthly kings.

Mr. President, it is natural to man to indulge in the illusions of hope. We are apt to shut our eyes against a painful truth, and listen to the song of that siren till she transforms us into beasts.  Is this the part of wise men, engaged in a great and arduous struggle for liberty? Are we disposed to be of the number of those who, having eyes, see not, and, having ears, hear not, the things which so nearly concern their temporal salvation?  For my part, whatever anguish of spirit it may cost, I am willing to know the whole truth; to know the worst, and to provide for it.

I have but one lamp by which my feet are guided, and that is the lamp of  experience.  I know of no way of judging of the future but by the past. And judging by the past, I wish to know what there has been in the conduct of the British ministry for the last ten years to justify those hopes with which  gentlemen have been pleased to solace themselves and the House. Is it that insidious smile with which our petition has been lately received? Trust it not, sir; it will prove a snare to your feet.  Suffer not yourselves to be betrayed with a kiss.  Ask yourselves how this gracious reception of our  petition comports with those warlike preparations which cover our waters and  darken our land.  Are fleets and armies necessary to a work of love and  reconciliation?  Have we shown ourselves so unwilling to be reconciled that  force must be called in to win back our love?  Let us not deceive ourselves,  sir.  These are the implements of war and subjugation; the last arguments to  which kings resort.  I ask gentlemen, sir, what means this martial array, if  its purpose be not to force us to submission?  Can gentlemen assign any other  possible motive for it?  Has Great Britain any enemy, in this quarter of the world, to call for all this accumulation of navies and armies?  No, sir, she has none.  They are meant for us:  they can be meant for no other. They are sent over to bind and rivet upon us those chains which the British ministry have been so long forging.  And what have we to oppose to them? Shall we try argument?  Sir, we have been trying that for the last ten years. Have we anything new to offer upon the subject?  Nothing.  We have held the subject up in every light of which it is capable; but it has been all in vain. Shall we resort to entreaty and humble supplication?  What terms shall we find which have not been already exhausted?  Let us not, I beseech you, sir, deceive ourselves.  Sir, we have done everything that could be done to avert the storm which is now coming on.  We have petitioned; we have remonstrated; we have supplicated; we have prostrated ourselves before the throne, and have implored its interposition to arrest the tyrannical hands of the ministry and Parliament.  Our petitions have been slighted; our remonstrances have produced additional violence and insult; our supplications have been disregarded; and we have been spurned, with contempt, from the foot of the throne! In vain, after these things, may we indulge the fond hope of peace and reconciliation.  There is no longer any room for hope.  If we wish to be free—if we mean to preserve inviolate those inestimable privileges for which  we have been so long contending—if we mean not basely to abandon the noble  struggle in which we have been so long engaged, and which we have pledged  ourselves never to abandon until the glorious object of our contest shall be obtained—we must fight!  I repeat it, sir, we must fight! An appeal to arms  and to the God of hosts is all that is left us!

They tell us, sir, that we are weak; unable to cope with so formidable an adversary.  But when shall we be stronger?  Will it be the next week, or the next year?  Will it be when we are totally disarmed, and when a British guard shall be stationed in every house?  Shall we gather strength by irresolution and inaction?  Shall we acquire the means of effectual resistance by lying supinely on our backs and hugging the delusive phantom of hope, until our enemies shall have bound us hand and foot?  Sir, we are not weak if we make a proper use of those means which the God of nature hath placed in our power.   The millions of people, armed in the holy cause of liberty, and in such a  country as that which we possess, are invincible by any force which our enemy  can send against us.  Besides, sir, we shall not fight our battles alone.   There is a just God who presides over the destinies of nations, and who will  raise up friends to fight our battles for us.  The battle, sir, is not to the strong alone; it is to the vigilant, the active, the brave.  Besides, sir, we have no election.  If we were base enough to desire it, it is now too late to retire from the contest.  There is no retreat but in submission and slavery! Our chains are forged!  Their clanking may be heard on the plains of Boston!   The war is inevitable—and let it come!  I repeat it, sir, let it come.

It is in vain, sir, to extenuate the matter.  Gentlemen may cry, Peace, Peace—but there is no peace.  The war is actually begun!  The next gale that sweeps from the north will bring to our ears the clash of resounding arms! Our brethren are already in the field!  Why stand we here idle? What is it that gentlemen wish?  What would they have?  Is life so dear, or peace so sweet, as to be purchased at the price of chains and slavery? Forbid it, Almighty God!  I know not what course others may take; but as for me, give me liberty or give me death!

Notes:

To avoid interference from Lieutenant-Governor Dunmore and his  Royal Marines, the Second Virginia Convention met March 20, 1775 inland  at Richmond–in what is now called St. John’s Church–instead of the Capitol  in Williamsburg. Delegate Patrick Henry presented resolutions to raise a  militia, and to put Virginia in a posture of defense. Henry’s opponents urged  caution and patience until the crown replied to Congress’ latest petition for  reconciliation.

On the 23rd, Henry presented a proposal to organize a volunteer company of cavalry or infantry in every Virginia county. By custom, Henry addressed himself to the Convention’s president, Peyton Randolph of Williamsburg. Henry’s words were not transcribed, but no one who heard them forgot their eloquence, or Henry’s closing words: “Give me liberty, or give me death!”

(Article Courtesy: http://www.history.org/almanack/life/politics/giveme.cfm)

ఏబ్రహాం లింకన్ గెటీస్బర్గ్ ఉపన్యాసము

[అమెరికను అంతర్యుద్ధ కాలంలో 19 నవంబరు 1863 గురువారం మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన చారిత్రాత్మకమైన ఉపన్యాసం. నిజానికి యుద్ధంలో మరణించిన వీరులకి “Soldiers’ National cemetery” ని అంకితం చేసే సందర్భంలో, నిర్వాహకుల మాటల్లో చెప్పాలంటే “కొన్ని సందర్భోచితమైన మాటలు (to say few appropriate words)” చెప్పడానికి అధ్యక్షుడిని ఆహ్వానించేరు. [ఈ సంఘటనని పదే పదే ఉటంకిస్తూ చెప్పిన గొప్ప విషయాలని Public Speaking by Dale Carnegieలో చదవొచ్చు. ఈ సందర్భాన్ని అతను ఎంత సీరియస్ గా తీసుకున్నాడో, ఈ నాలుగు మాటలు చెప్పడానికి అతను ఎంతగా తయారయ్యాడో, అద్దం ముందు ఎన్నిసార్లు, జట్కాలో వెళుతూ ఎన్నిసార్లు, ఈ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు అతని ముఖం ఎంత గంభీరంగా ఆవేశపూరితమయిందో చదవొచ్చు]. లింకను చెప్పిన ఈ “నాలుగు ముక్కలూ” స్వాతంత్ర్యంపట్ల అమెరికనుదృక్పథాన్ని నిర్వచించడంలో చరిత్రాత్మకమైనవవడమే గాక, మానవజాతి చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి.

స్వాతంత్ర్యం ఒకరిచ్చేదయితే, అది ఎప్పుడో ఒకప్పుడు అవతలివాళ్ళు లాక్కోగలరు. స్వేచ్ఛ మనిషి గాలిపీల్చినంత సులభంగా అనుభవించగలగాలి. మన స్వంతలాభంకోసం ఈరోజు మన స్వేచ్ఛని ఒకరికి తాకట్టుపెడితే, అది  మనపిల్లలకీ, భవిష్యత్తరాలకీ బానిసత్వంగా పరిణమిస్తుంది. వాళ్ళు మళ్ళీ స్వేచ్ఛకోసం యుద్ధం చెయ్యవలసిన పరిస్థితి కల్పిస్తుంది.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలూ అలాంటివే. మనకులం వాడనీ, మనమతం వాడనీ, మనఊరివాడనే సంకుచితమనస్తత్వంతో తలమాసిన వెధవలకి ఓట్లు వేస్తే,  వాళ్ళు చట్టసభలలో మన అభిప్రాయాలకి ప్రాతినిధ్యం వహించరు సరిగదా, వాళ్లకి ఏ స్వంత అభిప్రాయాలూ లేక, ఉత్సవిగ్రహాల్లా కూర్చుంటారు. మన వోటు స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు చిహ్నం. దాన్ని ప్రలోభాలకి అమ్ముకోవద్దు. మనం వేసే ప్రతి వోటూ మన మనవారసుల ఉజ్జ్వలభవిష్యత్తులకి కొత్తద్వారాలని తెరవనూగలదు … వాళ్ల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకి శాశ్వత సమాధులు కట్టనూగలదు. నిర్ణయించుకోవలసింది మనమే.]

.

87 సంవత్సరాలక్రితం మన తండ్రులు ఈ ఖండముమీద స్వేఛ్చావాయువులు పీలుస్తూ, మనుషులందరూ ఒక్కటేనన్న సిధ్ధాంతానికి అంకితం అయిన ఒక క్రొత్త దేశాన్ని నిర్మించారు. కానీ, ఇపుడు అదే దేశం… ఆ మాటకొస్తే అలా ఆవిర్భవించి ఆ సిధ్ధాంతానికి అంకితమైన ఏ దేశమైనాసరే… ఎక్కువకాలం మనగలదా లేదా అని పరీక్షించే అంతర్యుధ్ధంలో మనం చిక్కుకున్నాం. ఆ మహత్తర రణభూమి మీదే మనం సమావేశమయ్యాం. ఈదేశం శాశ్వతంగా మనగలగడానికి తమ జీవితాలను ధారపోసిన వీరులకి ఆ యుధ్ధభూమిలోనే కొంత భూభాగాన్ని అంకితం చెయ్యడానికి మనం ఇక్కడ కలుసుకున్నాం. మనం అలా చెయ్యడం  సముచితమూ, యోగ్యమైనదీ కూడా.

కాని, స్థూలదృష్టితో చూస్తే  ఈ నేలని వాళ్ళకి మనం అంకితం చెయ్యడం, సమర్పించడం, పునీతం చెయ్యడమేమిటి? ఈ నేలమీద పోరాడి, సజీవులూ, అమరులైన, ఆ మహావీరులందరూ దీన్ని ఏనాడో  పునీతం చేశారు. ఆ పవిత్రతని విలువకట్టడం మన శక్తికి మించినపని. మనం ఇప్పుడు పలికే మాటల్ని ప్రపంచం పట్టించుకోడంగాని, గుర్తుపెట్టుకోడంగాని చెయ్యదు; కానీ, వాళ్ళిక్కడ ఏమి చేశారో మాత్రం ఎన్నటికీ మరిచిపోలేదు. తమ ఉదాత్తమైన పోరాటంద్వారా వారు ఇంతదూరం తీసుకువచ్చి మనకి అసంపూర్ణంగా మిగిల్చిపోయిన కార్యానికి బ్రతికున్న మనందరం అంకితమవాలి. ఈ అమరవీరులు ప్రదర్శించిన పరిపూర్ణమైన నిష్ఠనుండి మరింత ప్రేరణని గ్రహించి మనముందున్న ఈ బృహత్తర కార్యానికి, మనం  అంకితమవాలి. మనమందరం సంకల్పం తీసుకోవాలి … అమరవీరుల ఆత్మార్పణలు వృధా పోనీయమనీ, భగవంతుని  ఆశీస్సులతో ఈ దేశంలో స్వాతంత్ర్యం పునరుద్భవిస్తుందనీ, ప్రజలచేత, ప్రజలకొరకు నడిచే ఈ ప్రజల ప్రభుత్వానికి భూమిమీద నాశనముండదనీ.

.

Abraham Lincoln, the sixteenth President of th...
Abraham Lincoln, the sixteenth President of the United States.  (Photo credit: Wikipedia)

Gettysburg Speech Of Abraham Lincoln

.

Four score and seven years ago our fathers brought forth on this continent a new nation, conceived in liberty, and dedicated to the proposition that all men are created equal.

Now we are engaged in a great civil war, testing whether that nation, or any nation, so conceived and so dedicated, can long endure. We are met on a great battle-field of that war. We have come to dedicate a portion of that field, as a final resting place for those who here gave their lives that that nation might live. It is altogether fitting and proper that we should do this.

But, in a larger sense, we can not dedicate, we can not consecrate, we can not hallow this ground. The brave men, living and dead, who struggled here, have consecrated it, far above our poor power to add or detract. The world will little note, nor long remember what we say here, but it can never forget what they did here. It is for us the living, rather, to be dedicated here to the unfinished work which they who fought here have thus far so nobly advanced. It is rather for us to be here dedicated to the great task remaining before us—that from these honored dead we take increased devotion to that cause for which they gave the last full measure of devotion—that we here highly resolve that these dead shall not have died in vain—that this nation, under God, shall have a new birth of freedom—and that government of the people, by the people, for the people, shall not perish from the earth.

(The Bliss Copy)

Denver - Civic Center: Colorado State Capitol ...
Denver – Civic Center: Colorado State Capitol – Lincoln’s Gettysburg Address (Photo credit: wallyg)

Speech delivered by Abraham Lincoln on the afternoon of 19th November 1863 at the dedication of the Soldiers’ National Cemetery in GETTYSBURG, Pennsylvania.

ముందు వాళ్లు కమ్యూనిస్టులకోసం వచ్చేరు … మార్టిన్ నీమలర్

.

ముందు వాళ్లు కమ్యూనిస్టులకోసం వచ్చేరు
నాకెందుకు అక్కరలేనివని మాట్లాడలేదు
నేను కమ్యూనిస్టుని కాదుగదా!
.
తర్వాతవాళ్ళు  కార్మిక నాయకులకోసం వచ్చేరు.
నాకెందుకని ఊరుకున్నాను
నేనేమైనా కార్మికనాయకుణ్ణేమిటి?
.
ఆ తర్వాత వాళ్ళు యూదులకోసం వచ్చేరు
మనకెందుకని అడగలేదు
నేను యూదును కాదుగదా!
.

చివరికి వాళ్ళు నాకోసం వచ్చేరు
నన్ను వెనకేసుకుని రావడానికి
ఎవ్వరూ మిగల్లేదు.

.

మార్టిన్ నీమలర్

జర్మను  ప్రొటెస్టెంటు పాస్టరు.

(14 జనవరి 1892 – 6 మార్చి 1984)

“వాళ్ళు ముందు కమ్యూనిస్టులకోసం వచ్చేరు” అన్నవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాటలు. ఇది నాజీలు చేసిన ఘాతుకాలకు మనసు కరిగి, జర్మను మేధావులు ఏమీ పట్టకుండా ఉండడం వల్ల జరిగిన మానవమారణహోమానికి బాధతో మార్టిన్ నీమలర్ పలికిన పలుకులు. ఇవి కేవలం ఆ కాలానికే వర్తిస్తాయనుకోవడం పొరపాటు. చరిత్ర ఇప్పటికి ఎన్నోనిదర్శనాలు  ఇచ్చింది: ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత పాలకులు తమపదవిని నిలబెట్టుకుందికి ఎన్ని ఘాతుకాలు చెయ్యడానికైనా వెనుదియ్యరని. అది ప్రజాస్వామ్యమైనా, రాచరికమైనా, నియంతృత్వమైనా లేక ఇంకేరకమైన రాజ్యపాలన వ్యవస్థ అయినా. కనుక ప్రజలు వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళే అప్రమత్తులుగా ఉండాలి. ఈ కవితలో చెప్పినట్లు  అధికారులు చేసే అకృత్యాలు మనకు సంబంధం లేదని ప్రతిఘటించకుండా ఊరుకుంటే, మనకి సంబంధించిన అన్యాయం జరిగినపుడు, మనకి తోడు ఎవ్వరూ మిగలరు… అవి వాళ్ళకు సంబంధించినది కాదుగా మరి!

.

[Note: The origins of this poem were traced to the January 6, 1946, speech delivered by Martin Niemöller to the representatives of the Confessing Church at Frankfurt.  The text has several variants. For details visit: http://en.wikipedia.org/wiki/First_they_came%E2%80%A6]

.

First they came for the communists,

and I didn’t speak out

because I wasn’t a communist.

.

Then they came for the trade unionists,

and I didn’t speak out

because I wasn’t a trade unionist.

.

Then they came for the Jews,

and I didn’t speak out

because I wasn’t a Jew.

.

Then they came for me

and there was no one left

to speak out for me.

.

Deutsch: Briefmarke von Martin Niemöller
Deutsch: Briefmarke von Martin Niemöller (Photo credit: Wikipedia)

Friedrich Gustav Emil Martin Niemöller (14 January 1892 – 6 March 1984)

These are the most remarkable and controversial lines uttered by the Protestant German Pastor (and social activist) about the passiveness or pathy of the German intellectuals when the Nazi regime chose to decimate all opposition groups one after another. It is pertinent to all times and all places since people in power always try to perpetuate their reign, no matter what kind of polity it is, at the expense of people and their liberty.

Charlie Chaplin’s Speech in The Great Dictator

watch the speech here: Charlie Chaplin’s Memorable Speech

నా బ్లాగు మిత్రులకీ సందర్శకులకీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

————————————————————————-

ఈ శుభ సందర్భం లో 1940 ల నాటి ఒక అద్భుతమైన చిత్రంలో మహానటుడు చార్లీ చాప్లిన్ ఇచ్చిన ఉపన్యాసం అనువాదంగా సమర్పిస్తున్నాను.

ఇది 70 సంవత్సరాలు గతించినా ఇప్పటికీ ఒక్క అక్షరం పొల్లుపోకుండా అన్వయిస్తుందంటే, ఒక పక్క రచయిత సునిశితమైన పరిశీలనాశక్తికీ, పదౌచిత్యానికీ సంతోషిస్తూనే, పుడుతూనే స్వతంత్రవాయువులు పీల్చుకున్న నాతరం ఇటువంటి దౌర్భాగ్యస్థితులు రాకుండా ఉండేందుకు సరియైన ప్రయత్నాలు చెయ్యలేదే అని వేరొకపక్క సిగ్గుపడుతున్నాను. 

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాన్ని ప్రజాక్షేమానికీ, తమ విధేయతని రాజ్యాంగానికీ కాకుండా,  అధికారయంత్రాంగం రాజకీయనాయకులకు బానిసత్వాన్ని ప్రకటించుకుని, వారితో భాగస్వాములై, ప్రజాసంస్థల్నీ, ప్రజాధనాన్నీ నిర్లజ్జగానూ, నిస్సిగ్గుగానూ దోచుకుంటూ, రెండు వ్యవస్థలూ ప్రజలదృష్టిని ప్రధానసమస్యలనుండి చిల్లరమల్లర విషయాలమీదకి మరలించి పబ్బం గడుపుకుంటుంటే; విద్యార్థులూ, మేధావులూ రకరకాల ఇజాల వాదనల్లో ములిగి, నిజజీవితంలో చెదురుమదురుగా కనిపించే నిజాయితీపరులూ, సాహసాన్ని ప్రదర్శించిన వాళ్ళూ, విలువల్ని పాటించినవాళ్ళూ, ఎన్ని అవాంతరాలొచ్చినా ధైర్యంగాఎదుర్కొని నిలిచినవాళ్ళూ తమ మార్గదర్శులుగా గాక, వెండితెరమీద వెర్రివేషాలువేసేవాళ్ళే ఆరాధ్యదైవాలుగా, అనుకరించవలసిన నమూనాలుగా చేసుకుంటున్నప్పుడు, ప్రజాస్వామ్యానికి ఎటువంటి దుర్దశ పడుతుందో నేటి భారతీయ సాంఘిక సామాజిక ఆర్థిక చిత్రమే అచ్చమైన నమూనాగా అద్దం పడుతుంది. 

అయినా నిరుత్సాహపడనక్కరలేదు. మనం ఒక్కసారి కన్నుతెరిచి, సత్యాన్ని గ్రహించి, కర్తవ్యాన్ని గుర్తించి, మన మతవిశ్వాసాలు మనల్నివిడదియ్యడానికికాక, బాధ్యతగలపౌరులుగా, ఒక అపూర్వమైన నాగరికతకి వారసులుగా, భవిష్యత్తును శాసించగల అవకాసాన్ని గుర్తించిన క్రియాశీలురుగా ఎరిగి,  మనసా వాచా కర్మణా ఆచరణలో చూపించగల సమర్థులమైనపుడు, మనమే మనకు కావలసిన రీతిలో మనకు ఆమోదయోగ్యమైన పరిపాలన పాలకులచేత రాబట్టుకోగలము.

అటువంటి యువతరానికోసమే ఈ అనువాదం:

****

Image Courtesy: http://t2.gstatic.com

న్ను క్షమించండి…

నాకు చక్రవర్తిని అవుదామన్న ఆశ లేదు. అది నా ఉద్దేశ్యమూ కాదు.

నేను ఎవరినీ శాశించాలనిగానీ, వపరుచుకోవాలని గానీ అనుకోవడం లేదు. దానికి బదులు, అవకాశం ఉంటే వాళ్ళు యూదులో, ఆస్తికులో, నాస్తికులో, నల్లవారో, తెల్లవారో అన్న భేదం లేకుండా అందరికీ సహాయం చెయ్యాలనుకుంటున్నాను.

మనందరమూ అలాగే అనుకుంటాము. అసలు మనిషన్న ప్రతివాడూ అలాగే అనుకుంటాడు.

మందరమూ ఒకరింకొకరి సంతోషాన్ని చూసి బ్రతకాలనుకుంటాం,  ఒకర్నొకరు దుస్థితిలోకి తోసి కాదు. మనం ఒకర్నొకర్ని ద్వేషిస్తూ, అసహ్యించుకుంటూ బ్రతకాలని కోరుకోం.

ఈ సృష్టిలో అందరికీ చోటుంది;

ఈ పుడమితల్లి అందరికీ తగిన తిండీ బట్టా అవకాశాలూ కల్పించగల కల్పవల్లి.

మనందరి జీవితాలూ స్వేఛ్ఛా సౌందర్యాలతో అలరారగలవు.

కానీ, మనం దారి తప్పిపోయాం.

దురాశ మనిషి మనసుని విషపూరితం చేసింది… మనుషుల మధ్య ద్వేషమనే ముళ్ళకంచెలు కట్టింది; మనం దౌర్భాగ్యంలోనూ, రక్తపాతంలోనూ, మగ్గేలా చేసింది.

మనం వేగాన్ని అభివృధ్ధిచెయ్యగలిగేం గాని  మనం అందులో ఇరుక్కుపోయాం. మన యంత్రాలు దేన్నైనా సమృధ్ధిగా ఉత్పత్తి చెయ్యగలవు… కానీ మనచుట్టూ ఆకలీ, లేమీ తాండవమాడుతున్నాయి.

మన విజ్ఞానం మనల్ని నిర్లిప్తులుగానూ  స్వార్థపరులుగానూ మార్చింది; మన నిశిత బుధ్ధి మనల్ని కఠినుల్నీ, నిర్దయుల్నీ చేసింది. మనకు ఆలోచన అనంతం, స్పందన శూన్యం; యంత్రం కంటే కూడా ఇప్పుడు మనకు మానవత్వం అవసరం; తెలివితేటలకంటే కూడా ఇప్పుడు కనికరమూ, మృదుత్వమూ మనకు అవసరం. ఈ లక్షణాలు లేకుంటే, జీవితం హింసామయమై అంతా సర్వనాశనమై పోతుంది.

విమానాలూ, రేడియో మనల్ని దగ్గర చేశాయి. అసలీ ఆవిష్కరణల వెనుకగల ఆంతర్యం మనుషుల్లో మంచిదనానికై అలమటిస్తోంది; విశ్వ సౌభ్రాతృత్వంకోసం, మనందరి ఐకమత్యం కోసం అర్రులుజాస్తోంది. ఇప్పుడుకూడా నా గొంతుక ప్రపంచవ్యాప్తంగా లక్షలమందికి చేరుతోంది… మనుషుల్ని హింసించి, అమాయకుల్ని బంధించే వ్యవస్థకు బలి అయిపోయిన… నిరాశా పీడితులైన స్త్రీలూ, పురుషులూ, పసిపాపలూ… వారందరికీ. 

నాగొంతు వినగలిగిన వాళ్ళందరికీ నేను చెప్పేదొక్కటే: నిరా పడవొద్దు.

ఈరోజు మనమున్న దౌర్భాగ్యస్థితికి కారణం కొందరి దురాశ ఫలితమే … మానవ వికాసానికీ అభివృధ్ధికీ అసూయపడేవారి భయోజనితమే.

మనుషులమధ్య ద్వేషాలు నశిస్తాయి. నియంతలు మట్టికరుస్తారు… ప్రజలదగ్గరనుండి వాళ్ళు లాక్కున్న అధికారం తిరిగి ప్రజలకి సంక్రమిస్తుంది; మనిషికి ప్రాణములమీద తీపి లేనంతవరకూ … స్వాతంత్ర్యం సమసిపోదు.

సైనికులారా!

మీరు మూర్ఖుల ఆదేశాలకు తలొగ్గకండి, వాళ్ళు మిమ్మల్ని ద్వేషించడమే కాకుండా బానిసలుగా చేసి— మీరు  జీవితంలో ఏమిచేయ్యాలో, ఏది ఆలోచించాలో, దేనికి ఎలా స్పందించాలో శిక్షణ ఇస్తూ, మీ ఆలోచనల్లోకి జొప్పించి, మీకు తిండిపెడుతూ, మిమ్మల్ని పశువులుగా చూస్తూ, వాళ్ల ఆయుధాలకి ఆహారంగా చేస్తారు.

ఈ అసహజమైన మనుషులకి, యంత్రాలవంటి మనుషులకి, యంత్రాల్లా ఆలోచిస్తూ యంత్రాల్లాంటి హృదయమున్న మనుషులకి తలొగ్గవద్దు. మీరు యంత్రాలు కాదు… మీరు పశువులు కారు…  మీరు మానవులు. మీకు హృదయం ఉంది … హృదయాంతరాల్లో మీకు మానవత్వం మీద అపారమైన ప్రేమ ఉంది.

మీరు ఎవరినీ ద్వేషించరు… ప్రేమనెరుగని వాడే ద్వేషిస్తాడు… ప్రేమననుభవించనివాళ్ళూ, కృత్రిమంగా జీవించేవాళ్ళే ద్వేషిస్తారు. 

సైనికులారా! 

బానిసత్వం కోసం పోరాడకండి! స్వాతంత్ర్యం కోసం పోరాడండి!

ఋషి లూకా ప్రవచించిన 17వ అధ్యాయంలో రాసి ఉంది: భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు… ఏ ఒక్క మనిషిలోనో, లేదా ఏ చిన్ని సమూహంలోనో కాదు… ప్రజలందరిలోనూ… మీలో, నాలో ప్రజలమందరిలోనూ ఉన్నాడు.

ప్రజలు మీరందరి దగ్గరా ఉంది అసలైన శక్తి… యంత్రాల్ని నిర్మించగల శక్తి… ఆనందాన్ని సృష్టించగల శక్తి. మీ కందరికీ జీవితం స్వేఛ్చగానూ, ఆనందమయంగానూ చెయ్యగల శక్తి … ఈ జీవితాన్ని ఒక అద్భుత సాహసొపేతమైన ప్రక్రియగా మలచగల శక్తి.

కాబట్టి ప్రజాస్వామ్యం పేరుతో మనమందరమూ ఆ శక్తిని వినియోగిద్దాం… అందరమూ ఏకమౌందాం రండి!

మనమొక కొత్త ప్రపంచంకోసం పరిశ్రమిద్దాం… ఒక సభ్య ప్రపంచం కోసం… ఎక్కడ ప్రతివ్యక్తికీ పనిచెయ్యడానికి అవకాశమూ, భవిష్యత్తు పట్ల విశ్వాసమూ, ముదిమిలో భద్రతా ఉండగలవో అటువంటి ప్రపంచం కోసం

వీటిని హామీలుగా ఇచ్చే ఈ దుర్మార్గులు అధికారానికి ఎదిగారు. కాని వాళ్ళు అబధ్ధాలకోరులు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చరు… ఇకముందెన్నడూ నెరవేర్చరు కూడా.

నియంతలు స్వతంత్రంగా ఉంటారు గాని, ప్రజల్ని మాత్రం బానిసల్ని చేస్తారు. మనం ఆ వాగ్దానాల్ని నిజం చెయ్యడానికి పోరాడుదాం రండి.  మనం ఈ ప్రపంచాన్ని ఒక  స్వేఛ్ఛా ప్రపంచంగా … జాతీయతల హద్దులు చెరిపివేస్తూ, దురాశా, ద్వేషం, ఓర్వలేనితనం లేనివిగా చేద్దాం. మనం ఒక వివేకవంతమైన ప్రపంచం కోసం… ఎక్కడ విజ్ఞానమూ అభివృధ్ధీ సమిష్టి ఆనందాన్ని సమకూర్చగలవో అటువంటి ప్రపంచ నిర్మాణం కోసం పరిశ్రమిద్దాం.

సైనికులారా!… ప్రజాస్వామ్యం పేరుతో అందరూ ఏకం కండి!

.

Hope… I’m sorry but I don’t want to be an Emperor – that’s not my business – I don’t want to rule or conquer anyone. I should like to help everyone if possible, Jew, gentile, black man, white. We all want to help one another, human beings are like that.

We all want to live by each other’s happiness, not by each other’s misery. We don’t want to hate and despise one another. In this world there is room for everyone and the earth is rich and can provide for everyone.

The way of life can be free and beautiful.

But we have lost the way.

Greed has poisoned men’s souls – has barricaded the world with hate; has goose-stepped us into misery and bloodshed.

We have developed speed but we have shut ourselves in: machinery that gives abundance has left us in want. Our knowledge has made us cynical, our cleverness hard and unkind. We think too much and feel too little: More than machinery we need humanity; More than cleverness we need kindness and gentleness. Without these qualities, life will be violent and all will be lost.

The aeroplane and the radio have brought us closer together. The very nature of these inventions cries out for the goodness in men, cries out for universal brotherhood for the unity of us all. Even now my voice is reaching millions throughout the world, millions of despairing men, women and little children, victims of a system that makes men torture and imprison innocent people. To those who can hear me I say “Do not despair”.

The misery that is now upon us is but the passing of greed, the bitterness of men who fear the way of human progress: the hate of men will pass and dictators die and the power they took from the people, will return to the people and so long as men die [now] liberty will never perish…

Soldiers – don’t give yourselves to brutes, men who despise you and enslave you – who regiment your lives, tell you what to do, what to think and what to feel, who drill you, diet you, treat you as cattle, as cannon fodder.

Don’t give yourselves to these unnatural men, machine men, with machine minds and machine hearts. You are not machines. You are not cattle. You are men. You have the love of humanity in your hearts. You don’t hate – only the unloved hate. Only the unloved and the unnatural. Soldiers – don’t fight for slavery, fight for liberty.

In the seventeenth chapter of Saint Luke it is written ” the kingdom of God is within man ” – not one man, nor a group of men – but in all men – in you, the people.

You the people have the power, the power to create machines, the power to create happiness. You the people have the power to make life free and beautiful, to make this life a wonderful adventure. Then in the name of democracy let’s use that power – let us all unite. Let us fight for a new world, a decent world that will give men a chance to work, that will give you the future and old age and security. By the promise of these things, brutes have risen to power, but they lie. They do not fulfil their promise, they never will. Dictators free themselves but they enslave the people. Now let us fight to fulfil that promise. Let us fight to free the world, to do away with national barriers, do away with greed, with hate and intolerance. Let us fight for a world of reason, a world where science and progress will lead to all men’s happiness.

Soldiers – in the name of democracy, let us all unite!”

.

(Text Courtesy: http://www.nikolasschiller.com/blog/index.php/archives/2009/08/10/3574)

%d bloggers like this: