A Deep Sigh… Gurraam Jashua, Telugu Indian Poet
As a tribute to Mahakavi Jashua on his 125th BirthdaY
Over the deep serene interior places of diamond-hard fortes
built by the Pride of Telugu, royal warrior Krishnaraya,
inhabit colonies of pregnant bats meditating upside-down!
What a pity! The glorious history looks hazy in the overcast.
Plantations of banana, jasmine patios, private rose gardens
Of Chinnadevi that bathed in crystalline waters… withered.
Fever nut, Datura, and Balsam shrubs shrouded Tungabhadra,
And the poetic graces of Mohanangi have lost their sheen.
In the aftermath of Nagamma’s vile pernicious warfare, the heroics
Of Palanadu had ceased, grass grows on the tiger-streaked throne,
But over the sheets of Naguleru water gold-washed by sunset
The lotus maids still compose the romances of Balachandra’s bravery.
Gurram Jashua
దీర్ఘనిశ్వాసము
తెలుగుం బాసకు వన్నె దెచ్చిన జగద్వీరుండు మా కృష్ణరా
యలు గట్టించిన వజ్రదుర్గముల, శుద్ధాంత ప్రదేశంబులన్
దలక్రిందై, తపమాచరించెడిని సంతానార్థలై, గబ్బిగ
బ్బిలపుం గుబ్బెత లక్కటా మొయిలుగప్పెం బూర్వమర్యాదకున్.
పన్నీటన్ దలసూపి కాపుగొను రంభా మల్లికావాటికల్
జిన్నాదేవి గులాబి తోటలు నశించె; న్గచ్చ, లుమ్మెత్తలున్,
గన్నేరుం బొద లావరించినవి రంగత్తుంగభద్రానదిన్,
బన్నుండె న్మనమోహనాంగి కవితాప్రాగల్భ్య సౌరభ్యముల్.
నాయకురాలి మాయకదనంబున మా పలనాటి పౌరుష
శ్రీయడుగంటె, గడ్డిమొలిచెం బులిచారల గద్దెమీద, గెం
జాయ మొగాన గ్రమ్మ జలజప్రమదామణి నాగులేటిపై
వ్రాయుచునున్న దిప్పటికి, బాలుని శౌర్య కథాప్రబంధముల్.
I am the Verdure… Raghuseshabhattar, Telugu poet
Words flow from head to tips of fingers
As subtly as larvae of fish from water, or,
The seeds of Crossandra disperse at the touch of moisture.
They haunt like the lines
From a coveted book lost.
Over the beds of enduring vison to its limits
The sky steps on delicately.
Rattled, Silence breaks like the marble of the Banta Soda.
I cannot savor the inflammable hours with bread
Nor make flowery hedges of the earthly thews.
Every time the scattered evenings
Congeal to vermillion hues,
I shall be the word behind the quondam verdure of the paper.
Raghu Seshabhattar
Raghu Seshabhattar
(Born 18.11.1970)
Born and brought up in Khammam, Mr. Raghu is a versatile poet bringing out 6 Volumes of poetry .
He is currently working as Senior Legal Manager with IFFCO-TOKIO General Insurance Co. Ltd. Hyderabad.
నేనొక హరితం
.
నీళ్ళ గుండెలో చేప పిల్లలు పుట్టినట్టు
కనకాంబరం గింజలు నీరుతగిలి చిట్లినట్టు
తల నుండి చేతుల్లోకి మాటలు తంత్రుల్లా మారుతాయి
పారేసుకున్న పుస్తకంలోని పంక్తుల్లా
నాలుక మీద అతుకుతాయి
ఇక కంటి పరుపుల మీద పెండ్యులంలా
ఆకాశం అడుగులు వేస్తుంది
నిశ్శబ్దం ఉలికిపడి గోలీసోడాలా అరుస్తుంది
జ్వలన పుంజాల్లాంటి రోజుల్ని రొట్టె ముక్కల్లో ముంచలేను
ఈ మట్టి కండల్నిక పూలకంచెల్లా మార్చలేను
చెదిరిన సాయంత్రాలు కుంకుమరేఖల్లా
చిక్కనైన ప్రతిసారి
కాగితాన్ని పత్రహరితంతో కలిపే వాక్యం నేను !
.
రఘు
What shall we do?… Pasunuru Sreedhar Babu, Indian Poet
What shall we do?
With what smile can we belie our pain?
What do you think?
Hiding the wound behind eyelids,
shall we bedeck the night with dreams?
How about exploding in tears
Yoking our loneliness to some fear?
What do you say?
Feeling ashamed and ashen-faced under the cover of night
What new face shall we put on each day?
What is the alternative?
No. It is not the way.
We must do something.
Taking this moment as our last,
Let us inflame like a tongue of fire!
Let the world decimate in the inferno.
Won’t seeds take to life breaking through the fissures of dilapidated walls!
So, let us be… like them!
.
Pasunuru Sreedhar Babu
Indian Poet
Pasunuru Sreedhar Babu
ఏం చేద్దాం?
.
ఏం చేద్దాం?
దుఃఖాన్ని ఏ చిరునవ్వుతో బంధించి అబద్ధం చేద్దాం?
ఏం చేద్దాం?
గాయాన్ని ఏ రెప్పలతో మూసి రాత్రిని కలల్తో అలంకరిద్దాం?
ఏం చేద్దాం?
ఏకాంతాన్ని ఏ భయంతో అంటించి కన్నీటి బిందువై పేలిపోదాం?
ఏం చేద్దాం?
చీకటి దుప్పటి కప్పుకుని బూడిదై రోజూ పొద్దున్నే ఏ కొత్తముఖం తొడుక్కుందాం?
ఏం చేద్దాం?
ఉహూఁ! ఇలా కాదు.
ఏదో ఒకటి చేద్దాం.
బతుక్కిదే చిట్టచివరి క్షణమైనట్టు నిట్టనిలువునా నిప్పుకణమై భగ్గుమందాం.
తగులబడిపోనీ ఊరంతా
కాలిన మొండిగోడలను చీల్చుకుని ఎన్ని గింజలు తలెత్తుకోవడం లేదూ?
అలాగే మనమూ మళ్ళీ…
.
పసునూరు శ్రీధర్ బాబు