ఒకానొక రోజు అడవిలో ఒక తెలివైన, నేర్పుగల
ఒక ముసలి కోడిపుంజు కాపలాలికి చెట్టెక్కి కూచుంది;
అంతలో ఆ చెట్టు మొదలుకి ఒక నక్క పరిగెత్తుకుంటూ వచ్చి,
చాలా ప్రేమగా, స్నేహపూరితమైన గొంతుతో ఇలా అంది:
“సోదరా! మన మధ్యనున్న తగవులన్నీ సమసిపోయాయి
ఇక నుండీ నేను నీకు స్నేహితుడిగా మెలగాలనుకుంటున్నాను.
ఈ జంతు ప్రపంచ మంతటా
పూర్తి ప్రశాంతత నెలకొంది.
ఆ వార్త చెప్పడానికే వచ్చాnu. క్రిందికి దిగిరా!
సోదరప్రేమతో ఆలింగనం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను;
సోదరా! ఇంక ఏమాత్రమూ ఆలస్యం చెయ్య వద్దు.
సమాచారం మనందరికీ ఎంత ముఖ్యమైన దంటే
ఇది దూరాన ఉన్న అందరికీ ఈ రోjE తెలియజెయ్యాలి.
ఇకనుండి, నువ్వూ, నీ సంతానమూ అన్ని దారులా తిరగొచ్చు
గ్రద్దల గురించి ఏ ఆలోచనలూ, భయాలూ లేకుండా;
ఒక వేళ వాటినుండిగాని, మరెవరి నుండైనా తగవొస్తే
సోదరులం మేము మీకు అన్నివిధాలా అండగా ఉంటాము.
ఈ సందర్భాన్ని పండగ చేసుకుంటూ
ఈ రాత్రి మీరు పెద్ద చలిమంట వేసుకోవచ్చు.
కానీ, ముందుగా, ఏదీ, ఈ ఆనంద ఘడియలని
సోదర ప్రేమ పూర్వకంగా ముద్దులతో ధృవపరుచుకుందాం.”
దానికి పుంజు బదులిస్తూ, “ఓ మంచి నేస్తమా! ఒట్టేసి చెబుతున్నా!
ఇంతకంటే మంచి వార్త నా జీవితంలో విని ఉండలేదు.
అందులోనూ, నీలాంటి వారి నోటివెంట రావడం,
అది రెండింతలు ఆనందకరంగా ఉంది.
నిజంగా నీ మాటల్లో సత్యం ఉండి తీరాలి.
దూరాన్నుండి రెండు వేటకుక్కలిటు పరిగెత్తుకుంటూ వస్తున్నది
ఈ వార్త చెప్పడానికేనని నా గాఢమైన నమ్మకం.
అవి ఏ క్షణాన్నైనా ఇక్కడికి చేరగల వడితో పరిగెత్తుకొస్తున్నాయి.
నేను తప్పకుండా క్రిందికి దిగి వస్తా. మనమందరం ఒకరినొకరు
కాగలించుకుని, ముద్దులతో ఈ శుభవార్తని పండగ జరుపుకుందాం.”
“మరయితే, నేను ఉంటా! నాకు చాలా తొందరపని ఒకటుంది.
నేను వెంటనే బయలు దేరక తప్పదు.
మరొకనాడు మనం పండగ చేసుకుందాం”
అని వెనుదిరిగి చూడకుండా నక్క దౌడు తీసింది,
సమీపంలోని కొండల్లో తన రక్షణస్థావరానికి.
అప్పుడు పుంజు ముసి ముసి నవ్వులు నవ్వుతూ తనలో ఇలా అనుకుంది:
మోసగించాలనుకునేవాడిని మోసగించడం రెండింతలు మజాగా ఉంటుంది!
.
(అనువాదం: ఎలిజూర్ రైట్)
జీన్ డి ల ఫోంటేన్
(8 July 1621 – 13 April 1695)
ఫ్రెంచి కవి
The Cock and the Fox
.
Upon a tree there mounted guard
A veteran cock, adroit and cunning;
When to the roots a fox up running
Spoke thus, in tones of kind regard:-
“Our quarrel, brother, ‘s at an end;
Henceforth I hope to live your friend;
For peace now reigns
Throughout the animal domains.
I bear the news. Come down, I pray,
And give me the embrace fraternal;
And please, my brother, don’t delay:
So much the tidings do concern us all.
That I must spread them far to-day.
Now you and yours can take your walks
Without a fear or thought of hawks;
And should you clash with them or others,
In us you’ll find the best of brothers;-
For which you may this joyful night,
Your merry bonfires light.
But, first, let’s seal the bliss
With one fraternal kiss.”
“Good friend,” the cock replied, “upon my word,
A better thing I never heard;
And doubly I rejoice
To hear it from your voice;
And, really, there must be something in it
For yonder come two grey hounds, which I flatter
Myself, are couriers on this very matter:
They come so fast, they’ll be here in a minute.
I’ll down, and all of us will seal the blessing
With general kissing and caressing.”
“Adieu,” said Fox, “my errand’s pressing;
I’ll hurry on my way,
And we’ll rejoice some other day .”
So off the fellow scampered, quick and light,
To gain the fox-holes of a neighbouring height,-
Less happy in his stratagem than flight.
The cock laughed sweetly in his sleeve;-
‘Tis doubly sweet deceiver to deceive.
.
Jean de la Fontaine
(8 July 1621 – 13 April 1695)
French Poet
(Tr: Elizur Wright)
Poem Courtesy:
https://archive.org/details/anthologyofworld0000vand/page/728/mode/1up
స్పందించండి