అనువాదలహరి

కాకీ- నక్కా… జీన్ డి ల ఫోంటేన్, ఫ్రెంచి కవి

ఒక ఓక్ చెట్టుకొమ్మ మీద కాకి వాలింది.

ముక్కున జున్నుముక్క కరుచుకుని ఉంది.

దాని ఘుమఘుమ వాసన ఎక్కడనుండి పసిగట్టిందో

ఒక నక్క అక్కడకి వచ్చి, తేనెపూసిన మాటలతో ఇలా అంది: 

“ఓ కాకి యువరాజా! నీవంటి సొగసుకాడిని 

ఈ పట్టున నే నింతవరకు చూసి ఉండలేదు.   

నీ గాత్రం ఇందులో సగం బాగున్నా 

ఈ అడవికి హంసవని అందరూ నిన్ను కొనియాడతారు సుమా!”  

ఆ మాటలు విని ఆనందంతో తబ్బిబ్బైన కాకి,  

తన గొంతు ఎలాగైనా నక్కకి వినిపించాలని 

నోరు తెరిచిందో లేదో, నోట్లోని జున్నుముక్క రాలిపోయింది. 

రెప్పపాటులో నక్క ఆ జున్నుముక్కని గాలిలోనే అందుకుంది.

“ప్రభూ! ఏలినవారు ఆలకించాలి,” అని ప్రారంభించింది నక్క, 

“తమ పొగడ్తలు విన్నవాళ్ళమీదే భట్రాజులు బ్రతుకుతారు. 

ఇంత విలువైన సలహా పొందడానికి

ఈ జున్నుముక్క పెద్ద ఖర్చేమీ కాదు.”  

అంత సులభంగా తను మోసపోయినందుకు కాకి సిగ్గుపడి 

ఆలస్యమైనా, మరోసారి మోసపోకూడదని ఒట్టు వేసుకుంది. 

.

జీన్ డి ల ఫోంటేన్

(8 July 1621 – 13 April 1695) 

ఫ్రెంచి కవి

అనువాదం: ఎడ్వర్ద్ మార్ష్)

The Crow and the Fox

.

A crow perched upon an oak,

And in his beak he held a cheese.

A Fox snuffed up a savory breeze,

And thus in honeyed accent spoke:

“O Prince of Crows, such grace of mien

Has never in these parts been seen.

If your song be half as good,

You are the Phoenix of the wood!”

The Crow, beside himself with pleasure,

And eager to display his voice,

Opened his beak, and dropped his treasure.

The fox was on it a trice.

“Learn, sir,” said he, “that flatterers live

On those who swallow what they say.

A cheese is not too much to give

For such a piece of sound advice.”

The Crow, ashamed to have been such easy prey

Swore, but too late, he shouldn’t catch him twice.

.

Jean de la Fontaine

(8 July 1621 – 13 April 1695)

French Poet

(Tr: Edward Marsh)

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/731/mode/1up

కోడిపుంజూ- నక్కా…. జీన్ డి ల ఫోంటేన్, ఫ్రెంచి కవి

ఒకానొక రోజు అడవిలో ఒక తెలివైన, నేర్పుగల

ఒక ముసలి కోడిపుంజు కాపలాలికి చెట్టెక్కి కూచుంది;

అంతలో ఆ చెట్టు మొదలుకి ఒక నక్క పరిగెత్తుకుంటూ వచ్చి,

చాలా ప్రేమగా, స్నేహపూరితమైన గొంతుతో ఇలా అంది:

“సోదరా! మన మధ్యనున్న తగవులన్నీ సమసిపోయాయి 

ఇక నుండీ నేను నీకు స్నేహితుడిగా మెలగాలనుకుంటున్నాను.

ఈ జంతు ప్రపంచ మంతటా 

పూర్తి ప్రశాంతత నెలకొంది.

ఆ వార్త చెప్పడానికే వచ్చాnu. క్రిందికి దిగిరా! 

సోదరప్రేమతో ఆలింగనం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను;

సోదరా! ఇంక ఏమాత్రమూ ఆలస్యం చెయ్య వద్దు.

సమాచారం మనందరికీ ఎంత ముఖ్యమైన దంటే 

ఇది దూరాన ఉన్న అందరికీ ఈ రోjE తెలియజెయ్యాలి. 

ఇకనుండి, నువ్వూ, నీ సంతానమూ అన్ని దారులా తిరగొచ్చు

గ్రద్దల గురించి ఏ ఆలోచనలూ, భయాలూ లేకుండా;

ఒక వేళ వాటినుండిగాని, మరెవరి నుండైనా తగవొస్తే

సోదరులం మేము మీకు అన్నివిధాలా అండగా ఉంటాము.

ఈ సందర్భాన్ని పండగ చేసుకుంటూ  

ఈ రాత్రి మీరు పెద్ద చలిమంట వేసుకోవచ్చు.

కానీ, ముందుగా, ఏదీ, ఈ ఆనంద ఘడియలని

సోదర ప్రేమ పూర్వకంగా ముద్దులతో ధృవపరుచుకుందాం.”  

దానికి పుంజు బదులిస్తూ, “ఓ మంచి నేస్తమా! ఒట్టేసి చెబుతున్నా!

ఇంతకంటే మంచి వార్త నా జీవితంలో విని ఉండలేదు.

అందులోనూ, నీలాంటి వారి నోటివెంట రావడం,

అది రెండింతలు ఆనందకరంగా ఉంది.

నిజంగా నీ మాటల్లో సత్యం ఉండి తీరాలి.  

దూరాన్నుండి రెండు వేటకుక్కలిటు పరిగెత్తుకుంటూ వస్తున్నది

ఈ వార్త చెప్పడానికేనని నా గాఢమైన నమ్మకం.

అవి ఏ క్షణాన్నైనా ఇక్కడికి చేరగల వడితో పరిగెత్తుకొస్తున్నాయి.  

నేను తప్పకుండా క్రిందికి దిగి వస్తా. మనమందరం ఒకరినొకరు 

కాగలించుకుని, ముద్దులతో ఈ శుభవార్తని పండగ జరుపుకుందాం.” 

“మరయితే, నేను ఉంటా! నాకు చాలా తొందరపని ఒకటుంది. 

నేను వెంటనే బయలు దేరక తప్పదు. 

మరొకనాడు మనం పండగ చేసుకుందాం”

అని వెనుదిరిగి చూడకుండా నక్క దౌడు తీసింది, 

సమీపంలోని కొండల్లో తన రక్షణస్థావరానికి.

అప్పుడు పుంజు ముసి ముసి నవ్వులు నవ్వుతూ తనలో ఇలా అనుకుంది: 

మోసగించాలనుకునేవాడిని మోసగించడం రెండింతలు మజాగా ఉంటుంది!   

.

(అనువాదం: ఎలిజూర్ రైట్)

జీన్ డి ల ఫోంటేన్

(8 July 1621 – 13 April 1695)

ఫ్రెంచి కవి

The Cock and the Fox

.

Upon a tree there mounted guard

A veteran cock, adroit and cunning;

When to the roots a fox up running

Spoke thus, in tones of kind regard:-

“Our quarrel, brother, ‘s at an end;

Henceforth I hope to live your friend;

For peace now reigns

Throughout the animal domains.

I bear the news. Come down, I pray,

And give me the embrace fraternal;

And please, my brother, don’t delay:

So much the tidings do concern us all.

That I must spread them far to-day.

Now you and yours can take your walks

Without a fear or thought of hawks;

And should you clash with them or others,

In us you’ll find the best of brothers;-

For which you may this joyful night,

Your merry bonfires light.

But, first, let’s seal the bliss

With one fraternal kiss.”

“Good friend,” the cock replied, “upon my word,

A better thing I never heard;

And doubly I rejoice

To hear it from your voice;

And, really, there must be something in it

For yonder come two grey hounds, which I flatter

Myself, are couriers on this very matter:

They come so fast, they’ll be here in a minute.

I’ll down, and all of us will seal the blessing

With general kissing and caressing.”

“Adieu,” said Fox, “my errand’s pressing;

I’ll hurry on my way,

And we’ll rejoice some other day .”

So off the fellow scampered, quick and light,

To gain the fox-holes of a neighbouring height,-

Less happy in his stratagem than flight.

The cock laughed sweetly in his sleeve;-

‘Tis doubly sweet deceiver to deceive.

.

Jean de la Fontaine

(8 July 1621 – 13 April 1695)

French Poet

(Tr: Elizur Wright)

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/728/mode/1up

మరణానంతర కులుకులు… టొఫీల్ గోట్యే, ఫ్రెంచి కవి

నేను చనిపోయిన తర్వాత, 

శవపేటిక కప్పు మూయకముందే,

నా బుగ్గలకు కాస్త ఎరుపునీ,

కంటికి కాటుకనీ అద్దండి. 

అతను ప్రమాణాలు చేసిన రాత్రి లానే

శాశ్వతంగా బుగ్గలపై గులాబి ఎరుపూ

నా నీలికళ్ళ రెప్పలక్రింద కాటుక నలుపుతో 

ఆ శవపేటికలో ఉండాలని కోరుకుంటున్నాను

నా శరీరాన్ని ఆ పాద మస్తకమూ

నార చీరలతో ముసుగువేసి కప్పొద్దు; 

బదులు, ఆ తెల్లవస్త్రాన్ని అంచులంట సంప్రదాయంగా

పదమూడు మడతలు వేసి అందంగా కుట్టండి.

ప్రతి ముఖ్యమైన చోటుకీ అలాగే వెళ్ళేదాన్ని:

అతని మనసు దోచుకున్నప్పుడు అదే వస్త్రాలంకరణ;

అతని తొలిచూపు దాన్ని పావనం చేసింది, అందుకే,

అతని కోసమే ఈ అలంకరణ కోరుకున్నది. 

నా  సమాధిమీద ఏ పూల అలంకరణలూ వద్దు,

తలగడలపై కన్నీటి అందమైన అల్లికలూ వద్దు;

నన్ను నా తలగడ అంచుమీద పడుకోబెట్టండి

నా జుత్తుని సముద్రంలా అన్నిదిక్కులా పరుస్తూ. 

ఈ తలగడ ఎన్నో మోహావేశపు రాత్రులను చూసింది

నిద్రతో బరువెక్కిన కనుబొమలు ఏకమవడమూ చూసింది,

ఆ తలగడా-పడవ తన నల్లని నీడలో

లెక్కలేనన్ని ముద్దులను లెక్కపెట్టి ఉంటుంది. 

నిద్రకీ, ప్రార్థనకీ రెంటికీ  అనువుగా

దగ్గర చేసిన దంతాల వంటి తెల్లని చేతులలో

రోము నగరం వెళ్ళినప్పుడు పోపు అనుగ్రహించిన

స్ఫటికాలతో చేసిన తావళాన్ని ఉంచండి.  

అప్పుడు, అలాంటి పానుపుమీద పడుక్కుని 

మెలకువలేని నిద్రకు ఉపక్రమిస్తాను  

అతని పెదాలు నా పెదాలపై పలికాయి ప్రార్థనలు 

నా ఆత్మశాంతికి భగవంతుణ్ణీ, మేరీనీ స్తుతిస్తూ.  

.

టొఫీల్  గోట్యే 

(30 August 1811 – 23 October 1872)

ఫ్రెంచి కవి, నవలాకారుడు, నాటక కర్త, కళా-, సాహిత్య విమర్శకుడు

Posthumous Coquetry

.

Let there be laid, when I am dead,

Ere ‘neath the coffin-lid I lie,

Upon my cheek a little red,

A little black abut the eye.

For I in my close bier would fain,

As on the night his vows were made,

Rose-red eternally remain,

With khol beneath my blue eye laid

Wind me no shroud of linen down

My body to my feet, but fold

The white folds of mu muslin gown

With thirteen flounces as of old.

This shall go with me where I go:

I wore it when I won his heart;

His first look hallowed it, and so,

For him, I laid the gown part.

No immortelles, no broidered grace

Of tears upon my cushions be;

Lay me on my pillow’s lace

My hair across it like a sea.

That pillow, those mad nights of old,

Has seen our slumbering brows unite,

And neath the gondola’s black fold

Has counted kisses infinite.

Between my hands of ivory,

Together set with prayer and rest,

Place then the opal rosary

The holy Pope at Rome has blest.

I will lie down then that bed

And sleep the sleep that shall not cease;

His mouth upon mouth has said

Pater and Ave for my peace.

.

Théophile Gautier

(30 August 1811 – 23 October 1872)

French Poet, Dramatist, Novelist, art- and literary-critic

(Tr: Arthur Symons)

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/757/mode/1up

%d bloggers like this: