రోజు: జూలై 16, 2020
-
గాయపడిన మన్మధుడు… ఎనాక్రియన్, గ్రీకు కవి
ఒకసారి గులాబిదొంతరలలో పరున్న మన్మధుణ్ణి ఒక తేనెటీగ కుట్టింది. అంతే, కోపంతో వాళ్ళమ్మదగ్గరకి పరిగెత్తి, ఏడ్చిగగ్గోలుపెడుతూ ఇలా అన్నాడు: ‘అమ్మా! కాపాడే! నీ కొడుకు ప్రాణం పోతోందే!” “అరే నా బంగారు తండ్రీ! ఏమయిందమ్మా?” అప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఇలా అన్నాడు: “రెక్కలున్న పామేదో నన్ను కరిచిందే, జానపదులు దాన్ని తేనెటీగ అంటారే. “దాని కామె పకపకా నవ్వి, ముద్దులతో, కేశపాశంతో ముంచెత్తి, కన్నీరు తుడుస్తూ, “అయ్యో నాయనా! నవ్వొస్తోందిరా! దీనికేఉపద్రవం వచ్చినట్టు ఏడవాలిట్రా? అలాగయితే నీ […]