రోజు: జూలై 14, 2020
-
పాతపాట…యెహోష్, యిద్దిష్ కవి
పూదోటవంటి జపానులో ఎక్కడో మారుమూల, ఈ పాట పాడుకునే వారు: ఒక సామురాయ్ లోహకారుడితో ఇలా అన్నాడు: “నాకో కరవాలము చేసిపెట్టు అది నీటిమీద గాలితరగలా తేలికగా, గోధుమ చేను కోతలపుడు పాడే పాటలా, చాలా సుదీర్ఘంగా, ఏ పగుళ్ళూ లేక, పాములా చురుకుగా, ఎటుపడితే అటు వంగుతూ మెరుపువేగంతో కదలాలి! పట్టుబట్టంత మెత్తగా, పల్చగా, సాలెపట్టంతా సన్నగా, చలీ, బాధంత నిర్దాక్షిణ్యంగా ఉండాలి.” “వీరుడా! చేతిపిడి మీద తమ ఆదేశం?” “చేతి పిడి మీద, సజ్జనుడా, ప్రవహిస్తున్న సెలయేటినీ, […]