రోజు: జూలై 11, 2020
-
పచ్చికబయళ్ళలో లార్క్ పక్షి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
వానవెలిసిన తర్వాత మిగిలే వెండివెలుగులో ఇంకా చినుకులు రాలుస్తున్న మెరుగు పచ్చ పొదలమధ్యనుండి పచ్చికబయళ్ళలోని లార్క్ పక్షుల కుహూరవాలు వినడానికి ఒంటరిగా, మహారాణిలా, ఎంతో ఉత్సాహంతో కాలిబాటపట్టేను. బ్రతుకన్నా, చావన్నా నాకు భయపడడానికి ఏముంది? అసలు ఈ మూడూ తెలిసినవారు లోకంలో ఎవరున్నారని: రాత్రి ముద్దూ, గొంతులో పాట పలుకేటప్పుడు రెక్కతొడిగే ఆనందం, ఈ వెండి వెలుగుల ప్రకృతి హేలలో లార్క్ పక్షుల రసధునీ? . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, […]