రోజు: జూలై 6, 2020
-
పేదమహరాజు (సానెట్) .. బార్తలొ మేయో ది సెయింట్ ఏంజెలో, ఇటాలియన్ కవి
(కవి తన పేదరికం గూర్చి హాస్యంగా చెబుతున్నాడు) . దారిద్య్రంలో నేను ఎంత గొప్పవాడినంటే ఈ క్షణంలో పారిస్, రోం, పీసా, పాడువా బైజాంటియం, వెనిస్, ల్యూకా, ఫ్లారెన్స్, ఫర్లీ వంటి అన్నినగరాలకి సరఫరా చెయ్యగలను. నా దగ్గరఅచ్చమైన అనేక ‘శూన్యం’, ‘పూజ్యం’ నాణెపు నిల్వలున్నాయి. దానికి తోడు ప్రతి ఏడూ, సున్నాకీ, శూన్యానికీ మధ్య ఉన్నన్ని ఓడలనిండా వచ్చి పడిపోతుంటాయి. బంగారం, విలువైన రత్నాల రాశులయితే నాదగ్గర చక్రాల్లా చెక్కినవి వంద సున్నాల విలువైనవున్నాయి; అన్నిటికంటే, […]