మృత్యుఘంటికలు (సానెట్)… ఫ్రాన్సిస్కో దె కెబెదో, స్పానిష్ కవి

ఈ కవితలో కవి రెండు అవసాన దశకు వచ్చిన వస్తువులు తీసుకుని (స్వంత ఊరులో ఉన్న తన ఇల్లు, తన శరీరం) శిధిలమౌతున్న మొదటి వస్తువు ద్వారా, రెండవ దాని (తన శరీర) స్థితిని గ్రహించడం చక్కగా చూపిస్తాడు. మనం రోజూ చనిపోతున్న వాళ్ళనీ చూస్తుంటాం, శిధిలమైపోతున్నవీ చూస్తుంటాం. కానీ, రోజు రోజుకీ మనంకూడా తెలియకుండనే శిధిలస్థితికి చేరుకుంటున్నామన్న ఎరుక మనకి కలుగదు. 18వ శతాబ్దం వరకూ, మనదేశంలో కూడా ప్రతి ఊరుచుట్టూ, పెద్ద పెద్ద నగరాలకీ ఊరి/ నగర సరిహద్దులో చుట్టూ ఒక ప్రహారీ ఉండేదిట.

* * *

నా పుట్టిన ఊరి పొలిమేరల ప్రహారీని గమనించాను

ఒకప్పుడు దృఢంగా ఉండేది, ఇప్పుడు పాడుబడి పెల్లలూడిపోతోంది. 

 ఇప్పటి తీరుకు తగ్గట్టు నిర్లక్ష్యానికి గురై ఆ గోడల శక్తి నశించింది  

ఒకప్పుడు మహోన్నతంగా ఉండే ప్రాకారాలు శిధిలమైపోయాయి.

నేను పొలాలు చూడటానికి వెళ్ళేను. అక్కడ అప్పుడే మంచు కరిగి

ఏర్పడ్డ నీటి తడిని సూర్యుడు ఆబగా తాగేయడం గమనించాను.

కొండవాలున పశువులు గిట్టలతో నేలదువ్వుతూ అరుస్తున్నాయి.

వాటి బాధలు చూసి ఇక్కడకు వచ్చిన ఆనందం ఆవిరైపోయింది. 

మా యింటికి వెళ్ళాను; తేమకి ఆ పాత గోడలు మచ్చలు పడి 

పాడు బడుతున్న వస్తువులన్నీ ఆ ఇంటిని కొల్లగొంటున్నాయి; 

అరిగిపోయిన నా చేతికర్ర అప్పుడే వంగిపోసాగింది.

కాలం గెలుస్తున్నట్టు గ్రహించాను; నా కత్తీ తుప్పుపట్టింది;

శిధిలం కానిది ఏదైనా ఉందేమో చూద్దామనుకుంటే

మచ్చుకి ఒక్కటికూడా కంటికి కనిపించలేదు.

.

ఫ్రాన్సిస్కో దె కెబెదొ

(14 September 1580 – 8 September 1645)

స్పానిష్ కవి

Sonnet: Death warnings

.

I saw the ramparts of my native land,

One time so strong, now dropping in decay,

Their strength destroyed by this new age’s way

That has worn out and rotted what was grand.

I went into the fields; there I could see

The sun drink up the waters newly thawed;

And on the hills the moaning cattle pawed,

Their miseries robbed the light of day for me.

I went into my house; I saw how spotted,

Decaying things made that old home their prize;

My withered walking-staff had come to bend.

I felt the age had won; my sword was rotted;

And there was nothing on which to set my eyes

That was not a reminder of the end.

.

(Tr: John Masefield)

Francisco de Quevedo y Villegas

(14 September 1580 – 8 September 1645)

Spanish Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/645/mode/1up

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: