పాత – కొత్త… అజ్ఞాత చీనీ కవి

ఆమె కొండమీద దొరికే వనమూలికలు ఏరుకుందికి వెళ్లింది.
దిగి వస్తున్నప్పుడు దారిలో తన మాజీ భర్త ఎదురయ్యాడు.
సంప్రదాయంగా ముణుకులు వంచి నమస్కరించి అడిగింది
“నూతన వధువుతో మీ జీవితం ఇప్పుడెలా ఉంది?” అని.

“నా భార్య చాలా తెలివిగా మాటాడుతుంది గాని,
నా మొదటి భార్య అలరించినట్టుగా అలరించలేదు.
అందంలో ఎవరూ ఎవరికీ తీసిపోరు,
కానీ ఉపయోగపడడంలో ఇద్దరికీ పోలిక లేదు.
నా భార్య నన్ను కలవడానికి వీధిలోనికి వస్తే
నా మాజీ భార్య ఎప్పుడూ అంతర గృహంలోంచి వచ్చేది.
నా నూత్న వధువు పట్టు బుటేదారు పనిలో మంచి నేర్పరి.
నా మాజీ భార్యకి సాదా సీదా కుట్టు పనిలో ప్రావీణ్యం ఉంది.
పట్టు బుటేదారు పనితో రోజుకి ఒక అంగుళం నేతపని చెయ్యొచ్చు
అదే సీదాసాదా కుట్టుపనితో ఐదు అడుగుల మేర నెయ్యవచ్చు.
ఆమెకున్న నైపుణ్యాన్ని నీ కుట్టుపనితో సరిపోల్చినపుడు

నా నూతన వధువు మాజీ భార్యకు సాటిరాదని తెలుస్తుంది.
.

అనువాదం: ఆర్థర్ వాలీ.

అజ్ఞాత చీనీ కవి
క్రీ.పూ. 1 వ శతాబ్దం.

Old and New

.

She went up the mountain to pluck wild herbs

She came down the mountain and met her former husband.

She knelt down and asked her former husband

“What do you find your new wife like?”


“My new wife, although her talk is clever,

Cannot charm me as my old wife could.

In beauty there is not much to choose,

But in usefulness they are not at all alike.

My new wife comes in from the road to meet me;

My old wife always came down from her tower.

My new wife is clever at embroidering silk;

My old wife was good at plain sewing.

Of silk embroidery one can do an inch a day;

Of plain sewing, more than five feet.

Putting her skills by the side of your sewing

I see that the new wife will not compare with the old.

.

Anonymous Chinese Poet

1st  Century BC

Translation: Arthur Waley.

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/12/mode/1up

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: