1
ఈ ప్రపంచంలో
ఏ బాహ్య చిహ్నాలూ అగుపించకుండా
వడలి వాడిపోయే వస్తువు
బహుశా మగవాడి
హృదయ కుసుమమే!
.
ఒనో నో కొమాచి
825- 900
జపనీస్ కవయిత్రి
2
నా ప్రేమ
మహాపర్వతాల అంతరాలలో ఎక్కడో
పెరిగే గడ్డి లాంటిది.
అది ఎంత ఒత్తుగా పెరిగినా ఏం ప్రయోజనం
దాని ఉనికి గుర్తించేవాడెవరూ ఉండరు.
.
ఒనో నో యొషీకి
మరణం 902.
3
ముదిమి వస్తోందని
ఎవరికైనా ముందే తెలిస్తే ఎంత బాగుండును?
వీధి తలుపు గదియ వేసి
“ఇంట్లో లేరు” అని చెప్పొచ్చు.
అతన్ని కలవడానికి నిరాకరించవచ్చు.
.
అజ్ఞాత కవి.
.
స్పందించండి