ఏదో ఒకరోజు నువ్వు గతించక తప్పదు… అజ్ఞాత చీనీ కవి

నీకు రకరకాల కోట్లూ, దుస్తులూ ఉన్నాయి,

కానీ వాటిని నీతో తీసుకు పోలేవు;

నీకు రథాలూ, గుఱ్ఱాలూ ఉన్నాయి,

కానీ వాటిని నువ్వు ఎక్కి స్వారీ చెయ్యలేవు.

ఏదో ఒకరోజు నువ్వు గతించక తప్పదు,

వాటిని వేరెవరో అనుభవిస్తారు.

నీకు విశాలమైన పెరళ్ళూ, భవంతులూ ఉన్నాయి,

వాటిని ఊడ్చి, కళ్ళాపిచిలకరించే వారు ఉండరు.

నీకు ఢంకాలూ, ఘంటలూ ఉన్నాయి

వాటిని ఎన్నడూ మ్రోగించేవారే ఉండరు.

ఏదో ఒకరోజు నువ్వు గతించక తప్పదు,

అవి ఇంకెవరి అధీనంలోకో వెళ్ళిపోతాయి.

నీకు పళ్ళతోటలూ, పంటపొలాలూ ఉన్నాయి

ప్రతిరోజూ చక్కగా వీణ సాధనం చేస్తూ

ఇటు వర్తమానాన్ని అనుభవిస్తూ అటు

నీ జీవనప్రమాణాన్ని ఎందుకు పెంచుకోకూడదు?

నువ్వెలాగూ ఎప్పుడో ఒకనాడు పోక తప్పదు

నీ ఖాళీని వేరెవరో పూరించకా తప్పదు.

.

అజ్ఞాత చీనీ కవి

క్రీస్తు పూర్వం 5 వ శతాబ్దికి ముందు.

కంఫ్యూషియస్ సంకలనం Shi King నుండి.   అనువాదం: HA Giles 

.

Chinese Poem

.

You Will Die

.

You have coats and robes,

But you do not trail them;

You have chariots and horses,

But you do not ride them.

By and by you will die,

And another will enjoy them.

You have courtyards and halls,

But they are not sprinkled and swept;

You have bells and drums,

But they will never be struck.

By and by you will die,

And another will possess them.

You have wine and food;

Why not play daily on your lute,

That you may enjoy yourself now

And lengthen your days?

By and by you will die,

And another will take your place.

.

(Translated by HA Giles)

Anonymous

From Confucius’s Collection: The “Shi King” or Book of  Odes (Compiled C. 500 BC)

The Shi King was compiled by Confucius from earlier collections which had been long existent.  It was through Odes that Confucius taught his own generation to understand the manners and customs and simple feelings of the men of old. These are the natural songs that float upward from the happy valleys and down the sedge-strewn banks of the wandering K’e.  They are naïve and bright as on their birthday, with that most precious quality of truth and unconscious art which never pets them tarnish or fade… L. Cranmer-Byng

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/3/mode/1up and

https://archive.org/details/anthologyofworld0000vand/page/4/mode/1up

Anthology of World Poetry; Von Doren, Mark, 1894-1972, ed.  Originally published in 1929.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: