ఇంటికి ఫోను చేసినపుడు… జోయ్ – హార్యో, అమెరికను కవయిత్రి

ఈ కవిత కరోనా నిబంధనల సడలింపు నేపథ్యంలో,  ప్రభుత్వాలు ఆల్కహాలు, సారాదుకాణాలకు అనుమతి ఇచ్చిన

తర్వాత కొన్ని గ్రామాల్లోని పరిస్థితిని గుర్తు చేసింది.

***

ఎమ్మా లీ ని వాళ్ళాయన వారాంతపు శలవుల్లో

చితక బాదేడుట. కారణం

ప్రభుత్వం అతని జీతాన్ని తొక్కిపెట్టింది

తన తాగుడుకోసం

అతను అప్పుచెయ్యవలసి వచ్చింది.

ఏనా పనికి వారం రోజులు శలవు పెట్టవలసి వచ్చింది

వాళ్ళ చిన్నబ్బాయికి

సుస్తీ చేసింది.

ఆమె అన్నది కదా, “ఒక్కోసారి కష్టం అనిపిస్తుంది,

కానీ, మొగుణ్ణి భరించడం కంటే ఇదే నయం.”

“జిమ్ ని చూసి అప్పుడే రెండు వారాలయింది,”

అంది వాళ్ళావిడ నాతో ఫోనులో.

(కానీ అతన్ని మరో నల్లపిల్లతో

మొన్న శనివారమే చూశాను.)

కోపోద్రిక్తలైన స్త్రీలు

రాళ్లతో ఇళ్ళు పునర్నిర్మిస్తున్నారు.

చితికిపోయిన సంసారాలని

నిలబెట్టడానికి కావలసిన అతుకుని

వాళ్ళ పంటిబిగువున భరిస్తున్నారు.

.

జోయ్-హార్యో

(జననం  9 May 1951)

స్థానిక అమెరికను కవయిత్రి

Joy Harjo
Born 9th May 1951

Conversations between Here and Home

.

Emma Lee’s husband beat her up

This weekend.

His government check was held

Up, and he borrowed the money

To drink on.

Anna had to miss one week of work

Because her youngest child

Got sick,

She says,  “it’s hard sometimes, but

Easier than with a man.”

“I haven’t seen Jim for two weeks

Now,” his wife tells me on the phone

(but I saw him Saturday with that Anadarko

Woman.)

Angry women are building

Houses of stones

They are grinding the mortar

Between straw-thin teeth

And broken families.

.

Joy-harjo

(Born  9th May 1951)

Native American Poet

Joy Harjo was born in Tulsa, Oklahoma, and is a member of the Muscogee (Creek) Nation.

(Named U.S. poet laureate in June 2019)

Poem Courtesy:

https://archive.org/details/thatswhatshesaid00rayn/page/128/mode/1up

 

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: