తన్మయత… సర్ నిజామత్ జంగ్, అరబ్-భారతీయ కవి

ప్రియా! నేను నీ చెంతకు చేరినపుడు

నాలోని నశ్వరమైనవాటినన్నిటినీ త్యజించి,

దైవదర్శనానికి వెళుతున్నప్పుడు ఏయే

ఆలోచనలను దూరంగా ఉంచుతామో

వాటినుండి మనసు ప్రక్షాళనంచేసుకుని

అంత నిర్మలంగానూ చేరుకుంటాను-

దురహంకారాన్నీ, ప్రేమాడంబరాన్నీ

ఒకే ఒక్క పదునైన చూపుతో అణచగల

ఎగసిపడే అద్భుత చైతన్యవంతమైన

నీ వ్యక్తిత్వానికి అనువుగా నన్ను దిద్దుకుంటూ.

నిజం! నేను అచ్చం అలాగే నీ చెంతకు వస్తాను.

వచ్చి నీ కళ్ళలోకి సూటిగా చూడ సాహసిస్తాను.

నీ చేతిని నా కనులకూ,పెదాలకూ అద్దుకున్నపుడు

ఆ సుతిమెత్తనిస్పర్శ నీ మేన పులకలు కలిగించి

నా తనువూ మనసున ప్రతిఫలిస్తుంటే, మనిద్దరం

స్వర్గంలోని తొలి జంటలా తన్మయులమై ఉంటాం.

.

సర్ నిజామత్ జంగ్

ఏప్రిల్ 1871 – 1955

అరబ్- భారతీయ కవి

.

UNITY

WHEN I approach thee, Love, I lay aside

All that is mortal in me, with a heart

Absolved and pure, and cleansed in every part

Of every thought that I might wish to hide

From God, I come, — fit spirit to abide

With such a soaring spirit as thou art,

Whose eye transfixes with a fiery dart

Presumptuous passion and ignoble pride.

Yea, thus I come to thee, and thus I dare

To gaze into thine eyes ; I take thy hand,

And its soft touch upon my lips and eyes

Thrills thy pure being, while it lingers there,

Into my heart and soul; — and then we stand

Like the first two that loved in Paradise !

.

Sir Nizamat  Jung

(April 1871 – 1955) 

Arab- Indian Poet

Poem Courtesy:

https://archive.org/stream/Sonnets-NawabNizamatJungBahadur/Sonnets+-+Nawab+Nizamat+Jung+Bahadur_djvu.txt

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: