అన్న పెత్తనం… హాత్రే, ఇంగ్లీష్ కవయిత్రి
ఈ కవితలో చమత్కారం అంతా అమ్మకి ఇద్దరం సాయం చెయ్యాలని ఒకప్రక్క చెబుతూనే, కష్టం అంతా సోదరికీ, సుఖం
అంతా తనకీ ఉండేట్టు పని పంచుకోవడంలో అన్న చూపించిన నేర్పు.
***
సూసన్! నువ్వు ఇంట్లో
బుద్ధిగా ఉంటానని మాటివ్వు!
అమ్మకి ఒంట్లో బాగులేదు, నీరసంగా విచారంగా
ఉంది; అమ్మని ఆనందంగా ఉండేట్టు మనం చూడాలి;
బంగాళాదుంపలు ఒలిచిపెట్టు, బియ్యం అత్తెసరు పెట్టు,
రాత్రి భోజనం వేడిగా, రుచిగా ఉండేట్టు చేసిపెట్టు.
కుర్ర చేష్టలు కట్టిపెట్టి మనం
ఇంటిపట్టున ఉండి ఆమెకి సాయం చెయ్యాలి;
నేను కొండవార పొలానికి వెళ్ళాలి, దున్ని
మొక్కలు నాటడానికీ, విత్తులు జల్లడానికీ.
కాబట్టి ఈ రోజల్లా అమ్మను జాగ్రత్తగా చూసుకునే
బాధ్యత నీకు అప్పగిస్తున్నాను.
సాయంత్రం సూర్యాస్తమయం వేళకి
ఇంటికి తిరిగి వచ్చేస్తాను
అమ్మకి టీ కాచి ఇవ్వు,
నాకు కొంచెం బ్రెడ్,చీజ్ సిద్ధంగా ఉంచు
నువ్వు అల్లుతుంటే, నే చదువుతుంటాను
సాయంత్రం ఇట్టే గడిచిపోతుంది.
.
హాత్రే, 18th Century
ఇంగ్లీషు కవయిత్రి
.
The Brother’s Charge
.
Susan, promise that you’ii stay
Quietly at home today;
Mother is ill, and weak, and sad,
We must try and make her glad;
Peel potatoes, boil the rice,
Get the dinner hot and nice.
We must be her help and stay,
Putting childish things away;
To the hill side I must go,
Plants to set and beans to hoe;
So to you I leave the care,
All this day, of mother dear.
When the sunset gilds the pane,
I shall be at home again;
You’ii get mother’s cup of tea,
And some bread and cheese for me;
You shall knit, I’ll read the while,
And the evening hours beguile.
.
Mrs. Hawtrey
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి