రోజు: మార్చి 31, 2020
-
అన్న పెత్తనం… హాత్రే, ఇంగ్లీష్ కవయిత్రి
ఈ కవితలో చమత్కారం అంతా అమ్మకి ఇద్దరం సాయం చెయ్యాలని ఒకప్రక్క చెబుతూనే, కష్టం అంతా సోదరికీ, సుఖం అంతా తనకీ ఉండేట్టు పని పంచుకోవడంలో అన్న చూపించిన నేర్పు. *** సూసన్! నువ్వు ఇంట్లో బుద్ధిగా ఉంటానని మాటివ్వు! అమ్మకి ఒంట్లో బాగులేదు, నీరసంగా విచారంగా ఉంది; అమ్మని ఆనందంగా ఉండేట్టు మనం చూడాలి; బంగాళాదుంపలు ఒలిచిపెట్టు, బియ్యం అత్తెసరు పెట్టు, రాత్రి భోజనం వేడిగా, రుచిగా ఉండేట్టు చేసిపెట్టు. కుర్ర చేష్టలు కట్టిపెట్టి మనం…