వసంతాగమనం… నగేష్ విశ్వనాథ్ పాయ్, భారతీయ కవి
యవ్వనపు తొలి కోరికలలా వసంతుడు అడుగుపెడుతున్నాడు…
వాటి హేమంతపు నిద్రనుండి మేల్కొలపడానికి జంకుతున్నాడా
అన్నట్టు చెట్లమీదనుండీ, పొదలమీదనుండీ,పాదులమీదనుండీ
చప్పుడు చెయ్యకుండా బొటనవేలి అంచుపై అడుగు లేస్తూ…
ఆ సరోవరపు స్వచ్ఛమైన నీటిపై సున్నితమైన ఎర్ర తామరలు
సూర్యుని వే వెలుగుకిరణాల స్పర్శకు సంతోషంతో మెరిసిపోతున్నాయి,
అంతే సుకుమారమైన తెల్ల కలువలు సిగ్గుతో, బిడియంతో
వెండివెలుగుల రేరాజుకై ఎదురుచూస్తూ తమ ముఖాలని
నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి; మబ్బుతునక జాడలేని నిర్మలమైన
ఆకాశాన్ని చూసి ఆనందిస్తున్నాయి; సమ్మోహపరిచే సుగంధాలు
వెదజల్లుతూ బంగారు కాంతులతో చంపకాలూ,
తమదైన తెలిసువాసనలరుచితో లలిత లలితంగా
వినమ్రంగా విచ్చుకుంటున్న మాలతీ ముకురాలూ; వన మంతటా
అన్ని దిశలా ఇదమిద్ధమని తెలియరాని మాధుర్యం పెల్లుబుకుతూ
ఇంద్రియాలు మోహపారవశ్యంలో మునిగి వశం తప్పుతున్నాయి.
.
నగేష్ విశ్వనాథ్ పాయ్,
(1860? – 1920?)
భారతీయ కవి.
.
In an article in East & West , Dr. Michael Macmillan, sometime Principal of the Bombay Elphinstone College had the following to say about the author:
“It is impossible for a European writer, however keen may be his powers of observation, and however richly endowed he may be with imagination, to thoroughly understand Indian life and character and look upon Indian palaces, gardens, jungles, pageants, and all the other richly coloured elements of Indian surroundings with the eye of a native of the soil. Thus it appears to us that neither Mr. Moore, nor Southey, nor Sir Edwin Arnold, nor Mr. Rudyard Kipling, nor Sir Alfred Lyall, nor Professor Bain of Poona, in their most brilliant efforts to give poetic expression to the glamour of the gorgeous East, have succeeded in producing as true a picture of India as the less ambitious and more homely verses of the author of the The Angel of Misfortune.”
.
Wasanta
.
Like the first hopes of youth Wasanta Comes…
He seems at first to tread on tiptoe o’er
Tree, shrub, and creeping plant, as if he feared
To wake them from their wintry sleep…
And then the delicate lilies on the lake
That revel in sun’s resplendent beams;
And tender Kumuda flowers that coyly wait
The silver moonlight, and then softly ope
Their beauteous face, and smile upon the calm
And cloudless heavens; the overpowering breath
Of the bright golden Champah, and the soft
But exquisite odour of the modest buds
Of Malati; all, all are strangely sweet
And ‘witching to the sense.
.
Nagesh Wishwanath Pai
(1860? – 1920?)
Indian Poet
Works: Stray Sketches of Chakmakpore (1894) and The Angel of Misfortune (1904)
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి