రోజు: మార్చి 13, 2020
-
వసంతాగమనం… నగేష్ విశ్వనాథ్ పాయ్, భారతీయ కవి
యవ్వనపు తొలి కోరికలలా వసంతుడు అడుగుపెడుతున్నాడు… వాటి హేమంతపు నిద్రనుండి మేల్కొలపడానికి జంకుతున్నాడా అన్నట్టు చెట్లమీదనుండీ, పొదలమీదనుండీ,పాదులమీదనుండీ చప్పుడు చెయ్యకుండా బొటనవేలి అంచుపై అడుగు లేస్తూ… ఆ సరోవరపు స్వచ్ఛమైన నీటిపై సున్నితమైన ఎర్ర తామరలు సూర్యుని వే వెలుగుకిరణాల స్పర్శకు సంతోషంతో మెరిసిపోతున్నాయి, అంతే సుకుమారమైన తెల్ల కలువలు సిగ్గుతో, బిడియంతో వెండివెలుగుల రేరాజుకై ఎదురుచూస్తూ తమ ముఖాలని నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి; మబ్బుతునక జాడలేని నిర్మలమైన ఆకాశాన్ని చూసి ఆనందిస్తున్నాయి; సమ్మోహపరిచే సుగంధాలు వెదజల్లుతూ బంగారు…