ప్రియతమా! అప్పుడే సంవత్సరం గడిచిపోయింది
నువ్వు నా జీవితభాగస్వామిగా ఉంటానని ప్రమాణం చేసి,
పైనున్న దేవతల సాక్షిగా ముద్దిడి ప్రమాణాలు చేసుకున్నాం
ఆ ప్రమాణాలు నిలుపుకుంటామనీ బాస చేసుకున్నాం
ఇపుడు రాత్రీ పగలూ పైనున్న దేవతలని ప్రార్థిస్తున్నాను
మన బాసలు కలకాలం నిలిచేలా దయతో అనుగ్రహించమని.
ఒళ్ళెరగని గాఢమైన నిద్రలో మునిగినపుడు
ప్రతిరాత్రీ నీ ముఖం నా కలలో కనిపిస్తుంటుంది
ఆతృతగా నిన్ను కాగలించుకుందికి పరిగెత్తుతానా,
అంతలో తెలివి వచ్చి, కల మోసంచేసిందని తెలుస్తుంది
అప్పుడు నా బాధ పదిరెట్లు పెరుగుతుంది
ఒక్కసారి నా కళ్ళకు కనిపించవూ?
.
జోసెఫ్ ఫ్యుర్టాడో
7th April 1872 – 1st Jan 1947
గోవా, భారతీయ కవి
.
Joseph Furtado
7th April 1872 – 1st Jan 1947
Indian Poet
Image Courtesy:
http://middlestage.blogspot.com/2012/06/on-poems-of-joseph-furtado.html
స్పందించండి