నీ చూపుల్లో ఏది నా గుండెపై గాఢ ముద్రవేసిందనిచెప్పను?
ఆ రోజు సాయంత్రం … అలవాటుగా నువ్వు సన్నగా చిరునవ్వు
నవ్వుతూ సరదాగా పేరుపెట్టి గట్టిగా పిలుస్తూ చూసావే
ఆ చూపని చెప్పనా? ఒక రోజు ఊరికి దూరంగా, సమీపంలోని
అడవిలోకి కారులో వెళ్ళినపుడు, కాలమహిమచే శిధిలమై
నలుదిక్కులా పడి ఉన్న అమహావృక్షాల మౌనముద్రలు చూసి
ఆశ్చర్యపడినదా? నేను కొత్తగా రాసిన కవిత్వ పుస్తకంపై వాలి
ఒక్కొక్క కవిత గురించి అడిగినప్పటిదా? లేక, ఆ రోజు రాత్రి
నీ ముఖంమీద నిండుచంద్రుడు ప్రకాశిస్తుంటే డాబా ఎత్తునుండి
వెన్నెలవాకలోమునిగిన మిన్నువాకను తన్మయత్వంతో చూఇనదా?
లేక, ఆ రోజు ఉదయం మనసులో పెల్లుబుకుతున్న ఆలోచనలతో
సతమతమౌతూ హీనస్వరంతో ‘వీడ్కోలు ‘ అని పలికావే, అదా?
.
ప్రొ. శేషాద్రి పూండి
మరణం 1941
భారతీయ కవి
.
Which Look?
.
Thy death has shivered all my pride,
And all my house is in the grave with thee,
Yea, all my happiness with thee is dead
Which in thy lifetime on thy sweet life fed.
— Catullus.
.
Which look of yours is graven on my breast?
Is it the one, when, with that gentle smile
Of yours, you hailed me with a kindly zest
That evening? Or when we drove awhile
Beyond the town, in neighbour forest shades,
You wondered at the mighty wrecks of time
Scattered about those hallowed, silent shades?
When bending on my latest book of rhyme
You wished to know each song? Or, when that night,
The full orbed moon aglow upon your face,
You gazed with rapture from the terraced -hight
Upon the Ganges draped in dazzling rays?
Or when the morn you slowly said, ‘farewell’,
Struggling with varied thoughts which seemed to swell?
.
(A Sonnet from his “Vanished Hours”, available at Princeton University)
.
Seshadri Pundi
( Died 1941)
Indo-Anglian Poet
స్పందించండి