రోజు: మార్చి 7, 2020
-
స్త్రీ…. ఫ్యూ హ్యువాన్, చీనీ కవి
స్త్రీగా పుట్టడ మెంత దుఃఖభాజనమో కదా! ప్రపంచంలో అంతకంటే విలువతక్కువది మరొకటి ఉండదు. కుర్రాళ్ళు తలుపుకి చేరబడి నిలుచుంటారు దివినుండి దిగివచ్చిన దేవతల్లా. వాళ్ళ హృదయాలు నాలుగు సముద్రాలకీ, వేలమైళ్ళ దుమ్మూ ధూళీ, పెనుగాలులకీ వెరువరు. ఆడపిల్ల పుట్టినపుడు ఎవరూ ఆనందంగా ఉండరు. ఆమె వల్ల ఆ వంశవృద్ధి జరగదు. ఆమె పెరిగి పెద్దయ్యేక తనగదిలోనే దాగుంటుంది. మగవాళ్ళని ముఖాముఖీగా చూసే ధైర్యంలేక. ఆమె అత్తవారింటికి పోయినపుడు ఎవరూ ఏడవరు వర్షం వెలిసిన తర్వాత నెలకొన్న మేఘాల…