సందులో విద్వాంసుడు… సో సూ, చీనీ కవి పంజరంలో బంధించబడ్డ పక్షి టపటపామని తన రెక్కల్ని నాలుగుపక్కలా కొట్టుకుంటోంది. ఆ ఇరుకు వీధిలోని విద్వాంసుడు నిరాశా నిస్పృహలతో ఉన్నాడు నీడని అప్పళించుకుని ఆ ఖాళీ ఇంట్లో ఉంటున్నాడు. అతను బయటకి వెళ్ళాలంటే వెళ్ళడానికి గమ్యం ఏదీ లేదు, అతని త్రోవనిండా ముళ్లకంపలూ, విరిగిన కొమ్మలూ. అతనొక స్మృతికావ్యం రాస్తాడు, ఎవరూ చదవరు, ఆదరించరు. ఎండిన చెఱువులో చేపలా ఉన్నచోటే చిక్కుపడిపోయాడు. బయట… దమ్మిడీ సంపాదన లేదు లోపల… వంటగదిలో గింజ ధాన్యం లేదు. అతని అసమర్థతకి చుట్టాలు నిందిస్తుంటారు స్నేహితులూ, కలుసుకునేవాళ్ళూ రోజురోజుకీ తరుగుతున్నారు. సూ చిన్ బోధించడానికి ఉత్తరానికి వెళ్ళేవాడు లీ సూ పడమటికి దరఖాస్తులు పెట్టుకున్నాడు. ఒకప్పుడు జీవితమందిచ్చే ఫలాలందుకుందామనుకున్నాను, లాభంలేదు, ఇపుడవన్నీ ఎండి, వాడివత్తలైపోయాయి. నదిలోకి వెళ్ళి తాగినా కడుపు పట్టినన్నే నీళ్ళు ఎవడైనా తాగ గలడు; ఎంత సరిపోతే అంతే చాలు, తనివితీరేదాకా అంటే ఉపయోగం లేదు. అడవిలోనిపక్షి లక్షకొమ్మలున్నా ఒక్కదానిమీదే వాలగలదు. తెలివైనవాడు ఎవడైనా నడుచుకోవలసిన పద్ధతి ఇదే. . సో సూ చీనీ కవి 3వ శతాబ్దం . . The Scholar in the Narrow Street . Flap, flap, the captive bird in the cage Beating its wings against the four corners. Depressed, depressed the scholar in the narrow street: Clasping a shadow, he dwells in an empty house. When he goes out, there is nowhere for him to go: Bunches and brambles block up his path. He composes a memorial, but it is rejected and unread, He is left stranded, like a fish in a dry pond. Without— he has not a single farthing of salary: Within— there is not a peck of grain in his larder. His relations upbraid him for his lack of success: His friends and callers daily decrease in number. Su Ch’in used to go preaching in the North And Li Ssu sent a memorandum to the west. I once hoped to pluck the fruits of life: But now alas, they are all withered and dry. Though one drinks at a river, one cannot drink more than bellyful; Enough is good, but there is no use in satiety. The bird in the forest can perch but on one bough, And this should be the wise man’s pattern. . Tso Ssu Chines poet 3rd Century AD Poem Courtesy: https://archive.org/details/anthologyofworld0000vand/page/17/mode/1up Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే మార్చి 5, 2020
వర్గాలుఅనువాదాలు ట్యాగులు3rd Centurychinese poethttps://archive.org/details/anthologyofworld0000vand/page/17/mode/1upTso Ssu కరెంటు తీగలు… ఫిలిప్ లార్కిన్., ఇంగ్లీషు కవిమందసమీరము… ఫ్యూ హ్యువాన్, చీనీ కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.