రోజు: మార్చి 5, 2020
-
సందులో విద్వాంసుడు… సో సూ, చీనీ కవి
పంజరంలో బంధించబడ్డ పక్షి టపటపామని తన రెక్కల్ని నాలుగుపక్కలా కొట్టుకుంటోంది. ఆ ఇరుకు వీధిలోని విద్వాంసుడు నిరాశా నిస్పృహలతో ఉన్నాడు నీడని అప్పళించుకుని ఆ ఖాళీ ఇంట్లో ఉంటున్నాడు. అతను బయటకి వెళ్ళాలంటే వెళ్ళడానికి గమ్యం ఏదీ లేదు, అతని త్రోవనిండా ముళ్లకంపలూ, విరిగిన కొమ్మలూ. అతనొక స్మృతికావ్యం రాస్తాడు, ఎవరూ చదవరు, ఆదరించరు. ఎండిన చెఱువులో చేపలా ఉన్నచోటే చిక్కుపడిపోయాడు. బయట… దమ్మిడీ సంపాదన లేదు లోపల… వంటగదిలో గింజ ధాన్యం లేదు. అతని అసమర్థతకి…