రోజు: మార్చి 4, 2020
-
కరెంటు తీగలు… ఫిలిప్ లార్కిన్., ఇంగ్లీషు కవి
ఈ కవితలో గొప్ప సౌందర్యం ఉంది. ఒకలా చూస్తే నిరాశావాదంలా కనిపిస్తున్నా, అది కవి లక్ష్యంకాదు. ఇక్కడ తీగెలు నిజం తీగెలు కానక్కరలేదు. అవి ప్రతీకలు మాత్రమే. సమాజంలో పాతుకు పోయిన మూఢనమ్మకాలూ, ఆచారాలూ, సంప్రదాయం పేరిట చలామణీ అయే ఏ అలవాట్లైనా కావచ్చు. ఇవి మానసికంగా ఒక గోడను, ఒక బలహీనతను యువతలో సృష్టిస్తాయి. అంతేకాదు, ఈ రకమైన ఆచరణలకీ, జీవితంలో మనంచేసే కృషికి లభించే ఫలితాలకీ ఏ రకమైన సమసంబంధ సామ్యం లేకపోయినా, ఏదో రకంగా ఈ రెండింటికీ…