అంతా అయిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఇప్పుడు నువ్వంటే నాకు ప్రేమ లేదు,
నీకూ నే నన్నా ప్రేమ లేదు,
అద్భుతమైన పెను తుఫానులా
ప్రేమ మనల్ని తాకి, వెళ్ళిపోయింది.
అయినప్పటికీ, మనిద్దరి మధ్యా
దూరాలూ, కాలమూ పెరుగుతున్నకొద్దీ
ఏవో చిన్న చిన్న విషయాలు
జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి:
వానతోపాటు వచ్చిన వాసన
చినుకులతోపాటు నేలమీదకి జారి
అక్కడ రాలిన ఎండుటాకుల్లోకీ
పుష్పించే లతాగుల్మాలలోకి చేరినట్టు…
స్ఫటికాల్లాటి వానబిందువులు
అక్కడి సాలెగూళ్ళ వలలపై తేలి
మిణుకుమనే తారకలతో
సామ్యాన్ని ఆపాదించుకున్నట్టు.
.
సారా టీజ్డేల్
(8 August 1884 – 29 January 1933)
అమెరికను కవయిత్రి
