దీవులు… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి సాగర దీవుల్లోని గేలిక్ ప్రజల్లా ముసలివాళ్ళు జీవితాల్ని వెలారుస్తారు, సముద్రపుటొడ్డున పొలమూ, ఒక భార్యా, కాసేపు కొడుకులనిపించుకునే పిల్లలూ; కొంత కాలానికి భార్యా, సముద్రపుటొడ్డు పొలమూ సముద్రపు హోరూ, దాని గురించిన ఆలోచనలూ, పిల్లలూ … అందరూ ఆ నీటిమీదనుండే ఎక్కడికో వెళ్ళిపోతారు. చివరకి పెద్దకొడుకూ ఆఖరి కూతురూ కూడా ఆ నీటిబాటనే జీవితాన్ని వెతుక్కుంటూ కనుమరుగైపోతారు. కడకి ఆ ఇద్దరూ… ముసలాడూ, ముసల్దీ మిగుల్తారు ఆ సాగర ద్వీపం మీద. ముసలివాళ్ళు మాటాడుకునేట్టుగానే మాటాడుకుంటూ తలూపుకుంటూ, నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళబ్బాయిలగురించీ, వాళ్ళనవ్వులగురించీ ఆలోచిస్తారు. ఆమె గట్టిగా అరిచి పిలుస్తుంది గాని వాళ్ళని కాదు. “ఆమెకి పిల్లల్ని గుర్తుచేసుకునేకంటే పెంచుకుందికి ఒక పిల్లి ఉంటే బాగుణ్ణ”నిపిస్తుంది. మనిషి చాలా కాలం బ్రతకొచ్చు అప్పటికి మగపిల్లలూ, ఆడపిల్లలూ సముద్రాలు దాటుకుని వెళ్ళిపోతారు భార్య నీళ్ళవంక అలా చూస్తూ కూర్చుంటుంది. . ఆర్చిబాల్డ్ మెక్లీష్ (May 7, 1892 – April 20, 1982) అమెరికను కవి . . Hebrides Old men live in a life As the Gaels in those ocean islands, A croft by the sea and a wife And sons for a while; Afterward wife and croft And the sound of the sea and the thought of it, Children and all gone off Over the water; Even the eldest son, Even the youngest daughter, All of them vanished and gone By the way of the water. A man and his wife, those two, Left on the ocean island: They talk as the old will do And they nod and they smile. But they think of their sons, how they laughed, And she calls but it’s not for them- “she’d rather a kitten to have Than a child to remember.” You can live too long in life Where the sons go off and the daughter Off over the sea and the wife Watches the water. . Archibald Macleish (May 7, 1892 – April 20, 1982) American Poet Poem Courtesy: Archibald Macleish Collected Poems 1917- 1982 pages 18-19 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిఫిబ్రవరి 25, 2020