వాసంత ప్రభాతవేళ… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఇంత చక్కని మనోజ్ఞ వాసంత ప్రభాతవేళ హృదయమా!
ప్రాణప్రదమైన నా ప్రియుని అడుగుజాడలు తెలుపవా?
అప్పుడు నేను నా స్వామికి, నా ప్రభువుకి
ఉచితమైన దృక్కులతో, నైవేద్యములతో
త్వరత్వరగా ఎదురేగి స్వాగతిస్తాను
సప్తవర్ణాల ఇంద్రధనుస్సులను సృష్టించే తుంపరలుగా
మహోన్నతమైన శిలలపై పతనమయే నీటిచాలుల
అతని కనుగొంటే, అవి నే తెచ్చే కలలకు సాటిరావని గ్రహిస్తాడు;
తెల్లని ఎండలో తళతళలాడే పచ్చని గోరింటలతో
మైదానం కళకళలాడే చోట అతని దర్శించితినా
‘ఆమె బంగారురంగు శిరోజసౌందర్యము ముందు
ఈ పూలసౌందర్యమేకాదు, ఏదీ సాటిరా’దనీ
‘ఆమె చెక్కిళ్ళలో పూచే గులాబులముందు, తోట
సరిహద్దుల పూచే గులాబులు దిగదుడు’పనీ తప్పక అంటాడు
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
(1866-1925)
అమెరికను కవయిత్రి
.
In Spring
.
On this most perfect morning of the spring,
Tell me my heart, where Love’s dearest feet shall stray,
That I may haste to meet him on the way,
With looks, and with an offering
That shall seem fitting for my lord and king.
If I shall find him where the waters play
About the mighty rocks, their rainbow spray
He’ll think less lovely than these dreams I bring:
And if I meet him in the meadows where
Are yellow cowslips gleaming in the sun,
I know that he will say, her golden hair
Outshines them in its glory, everyone,-
And in her cheeks my roses bloom so fair
That those upon the hedgerows are outdone!
.
Antoinette De Coursey Patterson
(1866-1925)
American Poet, Translator and Artist
From:
Page 16
Sonnets and Quatrains by Antoinette De Coursey Patterson
Philadelphia
H W Fisher & Company
MDCCCCXIII
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి