మనందరికీ కొన్ని భయాలుంటాయి. ముఖ్యంగా, చిన్నప్పుడు కొన్ని విషయాలన్నా, కొందరు వ్యక్తులు, వాళ్ళతో స్నేహం అన్నా మనకి ఇష్టం ఉంటుంది కానీ అమ్మానాన్నా, అన్నదమ్ములూ, లోకులూ ఏమంటారో అన్న భయంతో ఆ పనులూ, ఆ స్నేహాలూ చెయ్యలేకపోవడం బహుశా అందరికీ కాకపోయినా కొందరికి అనుభవమే. ఈ కవిత ఆ మానసిక స్థితిని బాగా పట్టి ఇస్తుంది. ఇది సుమారు 3 వేల ఏళ్ల క్రిందటి కవిత అంటే ఆశ్చర్యం వేస్తుంది.
*
చుంగ్ జూ, నిన్ను బతిమాలుకుంటాను
మా పెరట్లోకి దూకొద్దు,
దూకి, అక్కడ నాటిన మొక్కల్ని పాడు చెయ్యొద్దు.
నాకు ఆ మొక్కలు పాడయిపోతాయన్న చింత కాదు,
అమ్మా నాన్నా ఏమంటారో అని భయం.
చుంగ్ జూ నువ్వంటే నాకు చాలా ఇష్టం
కానీ అమ్మా నాన్నా ఏమంటారో అనే
నా భయం అంతా.
చుంగ్ జూ, నిన్ను బతిమాలుకుంటాను
మా గోడమీదకి ఎక్కొద్దు,
ఎక్కి, అక్కడ నాటిన మల్బరీ మొక్కల్ని పాడు చెయ్యొద్దు.
స్పందించండి