రోజు: ఫిబ్రవరి 1, 2020
-
రజనీస్తుతి… ఋగ్వేదం నుండి
దిగంతపరీవ్యాప్తమై తమస్విని లేస్తుంటే చుక్కలు కళ్ళు మిటకరించి చూస్తున్నాయి; ఆమె ఉడుపుల ఆడంబరం అంబరాన్ని తాకుతోంది. చీకట్లను తరుముతూ అక్షయమైన తమస్సు భూమ్యాకాశాలను ఆవహిస్తోంది. సోదరి అహస్సు అడుగులో అడుగులేస్తూ పయనిస్తోంది. చీకట్లను వ్యాపించనీండి… ఓ విభావరీ! పక్షులు గూళ్ళకి ఎగసినట్టు నీ ఆగమనతో మేము ఇంటిదారి పట్టుతాము. మనిషీ, మెకమూ, విహంగమూ మొదలుగా సమస్త జీవవ్యాపారాలూ సద్దుమణుగుతాయి. విహాయస పథంలో నిర్విరామంగా ఎగిరే డేగలు సైతం విశ్రాంతికై తిరోన్ముఖమౌతాయి. ఓ రజనీ! మమ్మల్ని దొంగలూ, తోడేళ్ళబారినుండి…