నెల: ఫిబ్రవరి 2020
-
Dead of Night – Sowbhagya, Telugu, Indian Poet
Look where you will Flowers are asleep – smiles are asleep and so are the doves— peacefully. cool breeze soars high up to greet the milky-way Moonlight descends to soothe pent-up hearts. beating rhythmically over the sea Tides lull earth to sleep. Branches rollick the twigs in their cradle laps And the heavens look like…
-
అంతా అయిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఇప్పుడు నువ్వంటే నాకు ప్రేమ లేదు, నీకూ నే నన్నా ప్రేమ లేదు, అద్భుతమైన పెను తుఫానులా ప్రేమ మనల్ని తాకి, వెళ్ళిపోయింది. అయినప్పటికీ, మనిద్దరి మధ్యా దూరాలూ, కాలమూ పెరుగుతున్నకొద్దీ ఏవో చిన్న చిన్న విషయాలు జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి: వానతోపాటు వచ్చిన వాసన చినుకులతోపాటు నేలమీదకి జారి అక్కడ రాలిన ఎండుటాకుల్లోకీ పుష్పించే లతాగుల్మాలలోకి చేరినట్టు… స్ఫటికాల్లాటి వానబిందువులు అక్కడి సాలెగూళ్ళ వలలపై తేలి మిణుకుమనే తారకలతో సామ్యాన్ని ఆపాదించుకున్నట్టు. . సారా టీజ్డేల్…
-
దీవులు… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
సాగర దీవుల్లోని గేలిక్ ప్రజల్లా ముసలివాళ్ళు జీవితాల్ని వెలారుస్తారు, సముద్రపుటొడ్డున పొలమూ, ఒక భార్యా, కాసేపు కొడుకులనిపించుకునే పిల్లలూ; కొంత కాలానికి భార్యా, సముద్రపుటొడ్డు పొలమూ సముద్రపు హోరూ, దాని గురించిన ఆలోచనలూ, పిల్లలూ … అందరూ ఆ నీటిమీదనుండే ఎక్కడికో వెళ్ళిపోతారు. చివరకి పెద్దకొడుకూ ఆఖరి కూతురూ కూడా ఆ నీటిబాటనే జీవితాన్ని వెతుక్కుంటూ కనుమరుగైపోతారు. కడకి ఆ ఇద్దరూ… ముసలాడూ, ముసల్దీ మిగుల్తారు ఆ సాగర ద్వీపం మీద. ముసలివాళ్ళు మాటాడుకునేట్టుగానే మాటాడుకుంటూ తలూపుకుంటూ,…
-
నేను పెద్దవాణ్ణవుతున్న కొద్దీ… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికన్ కవి
చాలాకాలం క్రిందటి మాట. నేను నా కలని పూర్తిగా మరిచేపోయాను. కానీ అప్పుడు ఆ కల నా కళ్ళముందు కదలాడేది సూర్యుడిలా ప్రకాశవంతంగా అందమైన నా కల! తర్వాత ఒక గోడ లేచింది నెమ్మది నెమ్మదిగా నాకూ నా కలకీ మధ్య ఒక అడ్దుగోడ ఆకాశాన్ని తాకేదాకా లేస్తూనే ఉంది ఆ గోడ. పెద్ద నీడ. నేను నల్లగా. నేను ఆ నీడలో పరున్నాను. ఇపుడు నా కళ్ళకెదురుగా నా కల వెలుగు లేదు. నా మీదా…
-
వాసంత ప్రభాతవేళ… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఇంత చక్కని మనోజ్ఞ వాసంత ప్రభాతవేళ హృదయమా! ప్రాణప్రదమైన నా ప్రియుని అడుగుజాడలు తెలుపవా? అప్పుడు నేను నా స్వామికి, నా ప్రభువుకి ఉచితమైన దృక్కులతో, నైవేద్యములతో త్వరత్వరగా ఎదురేగి స్వాగతిస్తాను సప్తవర్ణాల ఇంద్రధనుస్సులను సృష్టించే తుంపరలుగా మహోన్నతమైన శిలలపై పతనమయే నీటిచాలుల అతని కనుగొంటే, అవి నే తెచ్చే కలలకు సాటిరావని గ్రహిస్తాడు; తెల్లని ఎండలో తళతళలాడే పచ్చని గోరింటలతో మైదానం కళకళలాడే చోట అతని దర్శించితినా ‘ఆమె బంగారురంగు శిరోజసౌందర్యము ముందు ఈ పూలసౌందర్యమేకాదు,…
-
The Lost Case… Sriraj Ginne, Telugu, Indian
Sriraj Ginne (Born: November 22, 1946) ******** “A lawyer shouldn’t discriminate between one case and the other. Doing justice to one’s clients is true dispensation of justice,” is what lawyer Sundara Ramayya always told his colleagues. Everybody knew that only Sundara Ramayya had the knack of distancing ‘in’ from ‘justice’ jumbling with words and…
-
చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి…అజ్ఞాత చీనీ కవి.
చాలా కాలం క్రిందట ఒక కథ చదివేను. పేరు గుర్తు రావటం లేదు. అందులో కథానాయకుడికి ఒక అమ్మాయిమీద మనసుంటుంది. దగ్గర చుట్టం కూడా. అమ్మాయి వాళ్ల దగ్గరనుండి సంబంధం కలుపుకుందామని కబుర్లు వస్తుంటాయి. ఇష్టం లేనపుడు ‘నాకప్పుడే పెళ్లి వొద్దు అనడం ఒక ఆనవాయితీ’. అబ్బాయి వాళ్లింట్లో తల్లీ, వదినా, అన్నా ఒక్కొక్కరే కథానాయకుడి అభిప్రాయం కనుక్కుందికి ప్రయత్నిస్తారు వేర్వేరు సందర్భాలలో. సిగ్గుకొద్దీ ‘నాకప్పుడే పెళ్లి వొద్దు’ అని అనేవాడు వాళ్లతో. దానితో, చివరకి మన…
-
చుంగ్ జు… అజ్ఞాత చీనీ కవి
మనందరికీ కొన్ని భయాలుంటాయి. ముఖ్యంగా, చిన్నప్పుడు కొన్ని విషయాలన్నా, కొందరు వ్యక్తులు, వాళ్ళతో స్నేహం అన్నా మనకి ఇష్టం ఉంటుంది కానీ అమ్మానాన్నా, అన్నదమ్ములూ, లోకులూ ఏమంటారో అన్న భయంతో ఆ పనులూ, ఆ స్నేహాలూ చెయ్యలేకపోవడం బహుశా అందరికీ కాకపోయినా కొందరికి అనుభవమే. ఈ కవిత ఆ మానసిక స్థితిని బాగా పట్టి ఇస్తుంది. ఇది సుమారు 3 వేల ఏళ్ల క్రిందటి కవిత అంటే ఆశ్చర్యం వేస్తుంది. * చుంగ్ జూ, నిన్ను బతిమాలుకుంటాను…
-
11 వ కవిత, తావొ తే చింగ్ నుండి…
ముప్ఫై చువ్వలు చక్రానికున్న కన్నాలకు బిగించినపుడు శూన్యమూ, పదార్థమూ జతకలుస్తాయి. బండి నడుస్తుంది. మట్టిని ఒక కూజా ఆకారంలోకి మలిచినపుడు శూన్యమూ పదార్థమూ జతకలుస్తాయి. కూజా పనిచేస్తుంది. తలుపులూ కిటికీలూ గదికి దారి చేసినపుడు శూన్యమూ పదార్థమూ జతకలుస్తాయి. గది పనిచేస్తుంది. నిజంగా అదంతే! పదార్థం లాభపడుతుంది శూన్యం దన్నుగా పనిచేస్తుంటే. . లావొ జు చీనీ కవి తావొ తే చింగ్ చీనీ గ్రంధము నుండి. క్రీ. పూ. 4వ శతాబ్ది. Poem Eleven…
-
ప్రేమే సర్వస్వం కాదు (సానెట్ 30) … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ప్రేమే సర్వస్వం కాదు; తినేదీ తాగేదీ అసలు కాదు. సుఖంగా నిద్రపుచ్చేదో, వాననుండి రక్షించే పైకప్పో కాదు. అందులో పడి మునుగుతూ తేలుతూ, మునుగుతూ తేలుతూ, మళ్ళీ ములిగే మగాళ్ళని రక్షించగల ‘తేలే కలపముక్కా’ కాదు. ప్రేమ దాని ఊపిరితో ఆగిపోయిన గుండెను కొట్టుకునేలా చెయ్యలేదు రక్తాన్ని శుభ్రపరచలేదు, విరిగిన ఎముకను అతకనూ లేదు. నేను ఇలా చెబుతున్నప్పుడుకూడా, ఎంతో మంది పురుషులు కేవలం ప్రేమలేకపోవడం వల్ల మృత్యువుతో చెలిమిచేస్తున్నారు. హాఁ! ఒకటి నిజం. ఏదో ఒక…