ఎలిజబెత్ మహరాణి స్మృతిలో… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి
మనిషి సంక్షిప్తంగా ఏమి చెప్పగలడో
వినాలనుందా? అయితే, పఠితా! నిలు, నిలు!
ఎంత అందం మట్టిలో కలవగలదో అంత అందమూ
ఈ రాతికింద మట్టిలో కలిసి పోయి ఉంది.
అది జీవితానికిచ్చినదానికంటే ఎక్కువ పాలు
శీలానికి తననితాను ధారపోసుకుంది.
ఆమెలో మచ్చుకి ఏదైనా లోపం కనిపిస్తే
దాన్ని ఈ సమాధిలోనే విడిచిపెట్టండి.
ఆ అందానికి ఉన్నది ఒక్కటే పేరు: ఎలిజబెత్
శరీరాన్ని మృత్యువుతో శయనించనీయండి.
మృతిలోకూడా ఆజ్ఞనీయగల సమర్థురాలు
ఆమె పేరుకి జీవించి ఉన్నప్పటికంటే. శలవు!
.
బెన్ జాన్సన్
11 June 1572 – 6 August 1637
ఇంగ్లీషు కవి

On Elizabeth L. H.
.
Wouldst though hear what Man can say
In a little? Reader, stay!
underneath this stone doth lie
As much beauty as could die;
Which in life did harbour give
To more Virtue than doth live.
If at all she had a fault
Leave it buried in this vault.
One name was Elizabeth,
The other, let it sleep with death;
Fitter, where it died, to tell,
Than that it lived at all. Farewell.
.
Ben Johnson
11 June 1572 – 6 August 1637
English Playwright, Poet and Critic.
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి